View

హీరో ఇంటర్య్వూ - డా.రంజిత్ (ఏప్రిల్ 28 ఏం జరిగింది)

Wednesday,February24th,2021, 11:56 AM

సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు అంటుంటారు.. అయితే డా.రంజిత్... ముందుగా ఆయుర్వేద డాక్టర్‌గా పేరు సంపాందించి.. తనలోని నటుడిని సంతృప్తి పరచుకోవడానికి ఇప్పుడు యాక్టర్ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది. వీరాస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  సందర్భంగా డా.రంజిత్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.  


నాన్న స్ఫూర్తితో...
మా నాన్న ఎలూర్చి వెంకట్రావు ఆయుర్వేద డాక్టర్‌గా చక్కటి పేరు గడించారు. సినిమాలపై ఆయనకు అమితమైన ఆసక్తి ఉంది. సినీ రైటర్స్ అసోసియేషన్‌ను నాన్న ప్రారంభించారు. గాడ్‌ఫాదర్, మావూరి మారాజు, ఇంటింటి దీపావళి, ప్రజల మనిషితో పాటు చాలా సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆయన బాటలోనే అడుగులు  వేస్తూ నేను వైద్యవృత్తిని ఎంచుకున్నా. పన్నెండేళ్లుగా డాక్టర్‌గా పనిచేస్తున్నా. నాన్నగారి ద్వారా నాకు సినిమాల పట్ల ఇష్టం మొదలైంది. ఆ ఆసక్తితోనే ఈ చిత్రంలో నటించా.


సినీ రచయిత ప్రయాణం...
ఇందులో సినీ రచయితగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది.  నిర్మాతల్ని మెప్పించే మంచి కథ రాయడం కోసం రచయిత తన కుటుంబంతో  కలిసి ఓ ఇంటికి వెళతాడు. అక్కడ అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా  నవ్యమైన పాయింట్‌తో వీరాస్వామి సినిమాను తెరకెక్కించారు. గతంలో కన్నడంలో హీరోగా అవధి అనే సినిమా చేశా. ఆ సినిమాకు వీరాస్వామి కో డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది.  ఆయన చెప్పిన కథలో విరామ సన్నివేశాల ముందే వచ్చే మలుపు ఆకట్టుకోవడం సినిమాను అంగీకరించా. పతాక ఘట్టాలు  నవ్యానుభూతిని పంచుతాయి. వీరాస్వామి, హరిప్రసాద్ జక్కా  ఊహకందని మలుపులతో స్క్రీన్‌ప్లే తీర్చిదిద్దారు.  గంట యాభై నిమిషాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.


ఏప్రిల్ 28 మంచి రోజు...
టైటిల్‌తో పాటు ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోంది.  ఓ సందర్భంలో హాస్యనటుడు అలీకి ఈ సినిమా గురించి చెప్పాను.  టైటిల్ విని ఆయన  ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యాయని అన్నారు. అలాంటి మంచి రోజు టైటిల్‌గా కుదరడం ఆనందంగా ఉంది. అకథానుగుణంగా ఈ సినిమాలో ఏప్రిల్ 28కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదేమిటన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది.


మంచి సినిమా కోసం..
నిఖిల్, సొహెల్‌తో చాలా కాలంగా పరిచయముంది. ఇప్పటివరకు నేను చూసిన  గొప్ప ఇంట్రావెల్ బ్యాంగ్ ఇదేనని నిఖిల్ సినిమా చూసి ప్రశంసించారు.  సొహెల్‌కు ఈ సినిమా చాలా నచ్చింది. మంచి సినిమాను ప్రోత్సహించేందుకు వారిద్దరూ ముందుకు రావడం ఆనందంగా ఉంది.


ఆ పరిమితులు లేవు...
వైద్యవృత్తికే నా తొలి ప్రాధాన్యత. జనాలకు సేవ చేస్తూనే సినిమాల్లో నటిస్తా.  హీరోగా మాత్రమే నటించాలనే పరిమితులు పెట్టుకోలేదు.  పాత్రకు ప్రాముఖ్యత  ఉందనిపిస్తే విలన్‌గా నటించడానికి సిద్ధమే. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగించాలనుంది. సినిమాల పట్ల నాలో ఉన్న  ఇష్టాన్ని గుర్తించిన అమ్మనాన్నలు నన్ను ప్రోత్సహించారు. వైద్యవృత్తిని వదులుకోకుండా సినిమాలు చేయమని సలహాఇచ్చారు.


చక్కటి సలహాలిచ్చారు...
తనికెళ్లభరణి, అజయ్, రాజీవ్‌కనకాల వంటి అనుభవజ్ఞులతో ఈ సినిమాలో కలిసి పనిచేశా. వారి సహకారం వల్లే నా పాత్రకు  పరిపూర్ణంగా న్యాయం చేయగలిగా. తనికెళ్లభరణితో కలిసి నటించిన సన్నివేశాలన్నీ సింగిల్ టేక్‌లోనే పూర్తిచేశా. హావభావల విషయంలో అజయ్ చక్కటి సలహాలిచ్చారు. ఈ సినిమా విడుదల తర్వాతే కొత్త చిత్రాలను అంగీకరించాలనే ఆలోచనలో ఉన్నా. సొంతంగా కొన్ని కథలు రాశాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !