View

ఇంటర్య్వూ - సంపత్ రాజ్ (చెక్)

Thursday,February25th,2021, 10:45 AM

సంపత్ రాజ్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో 'లౌక్యం'లో అతడికి మంచి పాత్ర ఇచ్చి భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం 'చెక్'. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం 'చెక్'. శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్ తో ఇంటర్వ్యూ..


*'చెక్' సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి...*
మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తారు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో... అంత దగ్గరగా ఉంటుందీ సినిమా.‌ చాలా చాలా బావుంటుంది.


*ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో 'చెక్' భిన్నమైన సినిమా అనుకోవచ్చా?*
అవును. తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువ లోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి. షూటింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే... నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలు జీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా. పదేళ్లు, ఇరవై ఏళ్ళు జైలులో అలా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండా దర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకు నమ్మకం ఉంది.


*ట్రైలర్ చూస్తే మీరు పోలీస్ గా చేశారని తెలుస్తుంది. నితిన్ లాస్ట్ సినిమా 'భీష్మ 'లో కూడా మీరు పోలీస్ గా చేశారు కదా!*
'భీష్మ'లో నేను పోలీస్ అయినప్పటికీ... అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు.


*'చెక్'లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?*
హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలు కావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి గారు కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆ పాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్ రోల్, డిఫరెంట్ పోలీస్ అని అర్థమైంది.


*'భీష్మ', 'చెక్' కంటే ముందు కూడా మీరు పోలీస్ రోల్స్ చేశారు. పోలీస్ అంటే సంపత్... సంపత్ అంటే పోలీస్ అన్నట్టు!*
(నవ్వుతూ)... ఇప్పుడు 'ఎఫ్3'లో కూడా పోలీస్ గా చేస్తున్నాను. నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే... తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఓ లెటర్ రాస్తాను. 'నాకు పెన్షన్ ఇవ్వండి' అని. ఎక్కువసార్లు పోలీస్ గా నటిస్తున్నాను కదా! అలాగే, 'పోలీస్ కమీషనర్, ఐజీ డ్రస్ లు నేనే కుట్టించుకుంటా' అని. పోలీస్ క్యారెక్టర్ అంటే దానికి తగ్గ డ్రస్ నేనే వేసుకుని షూటింగ్ కి వెళ్తా. పెన్షన్ మాత్రం తప్పకుండా అడుగుతా. (నవ్వులు)


*దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గారి గురించి?*
ఆయన గురించి చెక్ చేయడానికి ముందే నేను విన్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కథ చెప్పడానికి ఆయన వచ్చారు. పది నిమిషాలు నా క్యారెక్టర్ గురించి వివరించారు. ఈలోపు మేం ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలు కాకుండా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడిగా ఆయన ప్రతిభ గురించి అందరికీ తెలుసు.


*భవ్య క్రియేషన్స్, సంపత్ రాజ్... సక్సెస్ ఫుల్ కాంబినేషన్!*
మా కాంబినేషన్ లో 'లౌక్యం' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ అవ్వాలి. ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవి గారు నా ఫ్యామిలీ. భవ్య క్రియేషన్స్ నా హోమ్ ప్రొడక్షన్ కింద భావిస్తా. ‘లౌక్యం’ హిట్ తర్వాత సక్సెస్ టూర్ లో కోన వెంకట్ గారు ఓ మాట చెప్పారు. సినిమా సక్సెస్ తర్వాత కనీసం ఒక యాపిల్ కూడా ఇవ్వరు. కానీ, ఆనంద ప్రసాద్ గారు యాపిల్ ఐ ఫోన్ ఇచ్చారు అని. కచ్చితంగా ఈ సినిమా ‘లౌక్యం’ కంటే పెద్ద హిట్ అవుతుంది. ఐ ఫోన్ కంటే పెద్ద గిఫ్ట్ అడగాలి.


*'లౌక్యం'లో నటించిన రకుల్ కూడా ఈ సినిమాలో నటించారు. ఆమెతోనూ మీది సక్సెస్ ఫుల్ కాంబినేషన్!*
రకుల్ కి బ్రదర్ నటించాను. తనకు తండ్రిగా నటించాను. తనకు కొలీగ్ చేశా. ఆ అమ్మాయితో కూడా నాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అవుతుంది.


*'చెక్' చూశారా?*
లేదు. కానీ, కథంతా తెలుసు. క్లైమాక్స్ చాలా బావుంటుంది. నాకు అది బాగా నచ్చింది. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉంటుంది. ఒకటి జరుగుతుందని ఊహిస్తారు. చూస్తే... అది కాదు, మరొకటి జరుగుతుంది. విజువల్స్ షాక్ ఇస్తాయి. దర్శకుడి ఇంటిలిజెన్స్ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. క్లైమాక్స్ లో టర్న్ అండ్ ట్విస్టులు ఎక్స్ట్రా డినరీ. ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ఇస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !