View

చిట్ చాట్ - హీరోయిన్ నందితా శ్వేత (అక్షర)

Thursday,February25th,2021, 02:15 PM

"ఎక్కడికిపోతావు చిన్నవాడా" చిత్రంతో టాలెంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ నాయిక నందితా శ్వేత. ఆ తర్వాత "ప్రేమ కథా చిత్రమ్ 2", "శ్రీనివాస కళ్యాణం" లాంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. ఇటీవలే "కపటధారి" చిత్రంతో పలకరించిన నందితా శ్వేత తన కొత్త సినిమా "అక్షర" తో ప్రేక్షకుల ముందుకొస్తోంది.  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్నికృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న ‘‘అక్షర’’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా "అక్షర" చిత్రంలో నటించిన అనుభవాలను మీడియాతో పంచుకుంది నందితా శ్వేత. ఆమె మాట్లాడుతూ...


- నా కెరీర్ లో హారర్ ఫిలింస్ ఎక్కువ చేయలేదు. ప్రేమకథా చిత్రమ్2, ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రమే చేశాను. - అక్షర లో విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడుతాను. ట్విస్ట్ ఉంటుంది కథలో. ఆ మలుపు ఏంటి అనేది చెప్పను.


- సినిమాలో చాలా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఏదో సందేశం చెబుతున్నాం. మీరు కూర్చుని చూడండి అని ఉండదు. మెసేజ్ తో పాటు సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అక్షర నాకు ఒక ఛేంజ్ ఓవర్ మూవీ అనుకోవచ్చు.


- కెరీర్ బిగినింగ్ లోనే ఫీమేల్ స్క్రిప్ట్ చేయడం అంటే సాహసం అనుకోవాలి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కొంత భయపడ్డాను. ఇప్పుడు నేను సందేశం చెబితే తీసుకుంటారా లేదా అనేది సందేహించాను. కానీ డేర్ డెసిషన్ తీసుకున్నాను.


- టీమ్ కూడా ననన్ను తీసుకోవడంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్షర మూవీ కోసం నన్ను పిలిచినప్పుడు హారర్ మూవీనే కదా అనుకున్నాను. కానీ చిన్న కృష్ణ గారు కథ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ చేసిన క్యారెక్టర్లు చేసిన కామెడీ చాలా బాగుంటుంది.


- అక్షర సినిమాలో హారర్  లేదు. సస్పెన్స్ ఉంటుంది. లాక్ డౌన్ లో ఫస్ట్ 3మంత్స్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆన్ లైన్ కోర్సులు చేశాను. వెబ్ సిరీస్ లో ఛాన్సులు వచ్చాయి. కానీ నేను అంగీకరించలేదు. దానికి కారణం నిర్మాతలు. చాలా మంది లాక్ డౌన్ ముందు చేసిన సినిమాలు థియేటర్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఓటీటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపించలేదు. నా సినిమాల్లో ఇటీవల కపటధారి థియేటర్లో రిలీజ్ అయ్యింది. మార్చి నుంచి చూస్తే అక్షరతో కలిపి నేను చేసిన నాలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇది మరే హీరోయిన్ కు దక్కని ఘనత అనుకోవచ్చు.


- స్క్రిప్ట్ ఈజ్ హీరో అనుకుంటాను. అందులో నా క్యారెక్టర్ ఎంత బాగుంది, ఎంత నిడివి ఉంది అని ఆలోచించేదు. అక్షరలో నన్ను ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో చూస్తారు. కపటధారిలో నా క్యారెక్టర్ తక్కువ ఉంది అని కొందరు అన్నారు.


- సహజంగానే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ కు తక్కువగానే స్పేస్ ఉంటుంది. ఆ వాస్తవం నాకు తెలుసు. తమిళం, తెలుగులో ఒకేసారి కపటధారి చిత్రాన్ని చిత్రీకరించాం. అదొక కొత్త అనుభవం నాకు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాత్రమే కాదు ఏ సిస్టమ్ అయినా ఫ్లస్ మైనస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఎందుకు చేశామంటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్స్ సఫర్ అవడం నాకు ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది. మన పిల్లలు కాన్వెంట్ లో చదవాలని తల్లిదండ్రులు అంతా అనుకుంటారు. అలాగే మా పేరెంట్స్ కూడా చిన్నప్పుడు నన్ను పెద్ద స్కూల్ లో వేశారు. ఆ ఏడాది నాకు వారితో అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని అనడ కూడా ఇబ్బంది పడ్డాను. ఫీజ్ కట్టడం కూడా కష్టమైంది. ఆతర్వాత తొమ్మిదో తరగతి నుంచి కార్పొరేషన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నా లాంటి కథే చాలా మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉంటుంది.


- విద్యా వ్యవస్థలోనే లోపాలను చెబుతున్నాం. కానీ విద్య లేనిదే ఎదగలేము అని చెప్పలేదు. విద్య వల్లే జీవితంలో పైకి వస్తాము అని కాదు. కమ్యునికేషన్ బాగుంటుంది ఎడ్యుకేషన్ ఉంటే. నేను ఉన్నత చదువు వదిలేసి ఫిల్మ్ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్ గా నాకూ పేరు వచ్చింది.


- అక్షరలో విద్యా వ్యవస్థ అంశాలతో కామెడీ చేయలేదు. ఎడ్యుకేషన్ కు కామెడీకి సంబంధం లేదు. అది రెండు వేరే వేరే ట్రాక్ లు ఉంటాయి. ఎంటర్ టైనింగ్ కోసం కామెడీ చేసింది. ప్రేక్షకులు వినోదం కోసం చేసిన పాత్రలు అవి. ఈ చిత్రంలో నటించడం ఛాలెంజింగ్ గా అనిపించలేదు. క్యాజువల్ గానే నటించాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా లో రెండు పాత్రల మధ్య ట్రాన్సఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు కష్టం అనిపించింది. కానీ ఈ చిత్రంలో ఒకే పాత్ర కంటిన్యూగా ఉంటుది కాబట్టి కేవలం యాక్ట్ చేశాను. అంతే ఫ్లాప్ అయితే మూవీస్ రావు అంటారు, గ్లామర్ గా లేకుంటే మూవీస్ రావు అంటారు, ఎడు ఏనిమిది సినిమాలు చేశాను. నందిత సినిమా చేయలేదు అని ఎవరూ అనరు. ఇప్పటికీ అవకాశాలు బాగానే వస్తుంటాయి. అక్షర లాంటి చిత్రం చేశాను సంతృప్తిగా ఉంది. ప్రతి సినిమా కష్టపడే చేస్తుంటాము. విజయం, అపజయం నా చేతిలో లేదు.


- అక్షర ఓన్లీ తెలుగు, మిగతా భాషల్లో అనుకుంటున్నారు చూడాలి.- రాజు గారి గది హీరో అశ్విన్ తో  ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అందులో ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా కష్టపడి నటిస్తున్నాను.


- దబాంగ్ మూవీకి తమిళ్, తెలుగు, కన్నడ కు డబ్బింగ్ చెప్పాను. శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. నేను ఇంట్రోవర్ట్, ఎక్కువగా అందరితో కలవను కాట్టి లాక్డౌన్ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !