View

ఇంటర్య్వూ - హీరో సయ్యద్ సోహైల్ రియాన్ (మిస్టర్ ప్రెగ్నెంట్)

Thursday,August17th,2023, 02:10 PM

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన సయ్యద్ సోహైల్ రియాన్ పలు క్రేజీ మూవీస్ తో టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఇందులో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో సోహైల్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రూపా కొడవాయుర్ హీరోయిన్  గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నైజాంలో విడుదల చేస్తోంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లో నటించిన ఎక్సీపిరియన్స్ ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సోహైల్.


- నేను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అయితే సినిమాలో హీరోగా నటిస్తే నన్ను చూసేందుకు థియేటర్ దాకా వస్తారా అనే సందేహం ఉండేది.  స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే  వర్కవుట్ అవుతుంది. వాళ్లకు అభిమానులు ఉంటారు. కానీ నాలాంటి యంగ్  హీరోస్ వెరైటీ మూవీస్, కొత్త  ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు మన సినిమాలకు వస్తారు అని నమ్మాను. అందుకే మిస్టర్ ప్రెగ్నంట్ వంటి న్యూ జానర్ మూవీ చేస్తున్నాను. ఈ మూవీ చేయడం రిస్క్ అని అనుకోవడం లేదు. నాలాంటి యంగ్ యాక్టర్స్ రొటీన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయడమే రిస్క్  అవుతుంది.


- దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్. ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మనిద్దరం కొత్తవాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనేవాడు. నేను అప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్లలేదు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఈ సినిమాకు నువ్వు హీరో అని చెప్పి సైన్ చేయించాడు. అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది.


- మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో నటించడం నాకొక డిఫరెంట్ ఎక్సీపిరియన్స్. మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ నేను ఈ సినిమా ఒప్పుకునేప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. వాళ్లు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పనులు చేస్తున్నారు అంతా గమనించాను. అలాగే మా దర్శకుడు శ్రీనివాస్ గుడ్ ఫ్యామిలీ పర్సన్. ఆయన మంచి సూచనలు ఇచ్చేవారు. అలా ఈ క్యారెక్టర్ బాగా చేశాను. ఈ క్యారెక్టర్ చేసేప్పుడు మూడు కిలోల బరువున్న ప్రోత్సటిక్స్ ధరించాను. ఆ కొద్ది బరువే నాకు ఇబ్బందిగా అనిపించేది. తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోసేందుకు ఎంత కష్టపడుతుందో మనం ఊహించుకోవచ్చు.


- ఈ సినిమా షో చూసిన తర్వాత చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు. మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనేందుకు వాళ్ల రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనిపించింది. రేపు థియేటర్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.


- మేల్ ప్రెగ్నెన్సీ నిజంగా సాధ్యమైతే కనీసం 20 శాతం మంది మేల్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. అది ఎలా ఉంటుందో ఎక్సీపిరియన్స్ అయ్యేందుకైనా తీసుకుంటారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేశాక చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే నన్ను ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని అనుకున్నా.  ఈ సినిమా గురించి మా అమ్మ కూడా మొదట్లో నెగిటివ్ గా చెప్పింది. కానీ సినిమా చూశాక ప్రౌడ్ గా ఫీలయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావని నన్ను మెచ్చుకుంది.


- ఈ సినిమా రిలీజ్ ఆలస్యమయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. ఎందుకంటే ఈ సినిమాపై నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఇది నా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమా అని నమ్ముతున్నాను.


- మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా గ్లింప్స్ చూపించినప్పుడు నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నువ్వు డిఫరెంట్ మూవీ చేస్తున్నావు. కొత్త వాళ్లు ఇలాగే కొత్త ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.


- మైక్ మూవీస్ అప్పిరెడ్డి గారు తన సినిమాలతో కొత్త దర్శకులు, హీరోలను ఎంకరేజ్ చేస్తున్నారు. కనీసం ఐదారు కోట్ల బడ్జెట్ తో మూవీస్ చేస్తున్నారు. ఆయన కావాలంటే ఇంకొత బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలను ట్రై చేసుకోవచ్చు. కానీ కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. మైక్ మూవీస్ లో నేనూ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. గౌతమ్, మహి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఫస్ట్ ఫన్, లవ్ స్టోరీతో వెళ్తూ తర్వాత ఎమోషనల్ గా మారుతుంది.


- రూపా టాలెంటెడ్ హీరోయిన్. సైమా అవార్డు అందుకుంది. ఈ సినిమాలో నేనూ ఆమె వార్ లా పోటీ పడి నటించాం. పేరున్న టెక్నీషియన్స్ పనిచేశారు. నాకంటే మిగతా వాళ్లంతా మంచి ఎక్సీపిరియన్స్ పర్సన్. నేను చిన్న ఏజ్ లో ఇండస్ట్రీకి వచ్చాను. సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నాను. రోజూ సినిమాల కోసమే కష్టపడుతుంటా. ప్రస్తుతం బూట్ కట్ బాలరాజు షూటింగ్ జరుగుతోంది. కథ వేరే ఉంటది అనే మరో సినిమా చేస్తున్నాను. సెలెక్టెడ్ గా మూవీస్ చేయాలని ఉంది. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాలా తెలుగులో డిఫరెంట్ మూవీస్ చేయాలని ఉంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !