View

ఇంటర్య్వూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (గాండీవధారి అర్జున)

Thursday,August24th,2023, 08:45 AM

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్బంగా...


* ప్రవీణ్ సత్తారు సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటాను. తన కాన్సెప్ట్స్ లో సెన్సిబిలిటీస్ ఉంటాయి. విభిన్నమైన సినిమాలను చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. చందమామ కథలు, గరుడ వేగ లాంటి సినిమాలను చూశాను. గని సినిమా షూటింగ్ సమయంలో తను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో కథ గురించి నేనేమీ అడగలేదు. యాక్షన్ సినిమా చేద్దాం అన్నాడు. తను యాక్షన్ సినిమా అయితే బాగా చేస్తాడని సరేనని కలిశాను. కథ విన్న తర్వాత స్టైలిష్ యాక్షన్ మూవీస్ సాధారణంగా యాక్షన్, స్టైలిష్ అంశాల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ తక్కువగా ఉంటుంది. కానీ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు తను మాట్లాడాలనుకున్న ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని నాకు ఓ యంగస్టర్ గా తెలుసు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల ఆ సమస్యను ఎవరం పట్టించుకోం. అది వెంటనే మనపైన ప్రభావం చూపేది కాదు. దాని ఎఫెక్ట్ కొన్నేళ్ల తర్వాత ఉంటుంది. ప్రవీణ్ చెప్పినప్పుడు కథలోని మెయిన్ పాయింట్, ఎమోషన్స్ నచ్చాయి. 


* నటుడికి ఓ సామాజిక బాధ్యతాయుతమైన పాత్రల్లో నటించే సినిమాలు తక్కువగానే వస్తుంటాయి. ఎఫ్ 2, ఎఫ్ 3లాగా కామెడీ చేయాల్సి ఉంటుంది. గని విషయానికి వస్తే యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. అయితే మంచి కథతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉండే సినిమా చేయటం నాకు బావుంటుందనిపించింది. అవకాశం ఉన్న ప్రతీసారి చేయాల్సిన అవసరం ఉందనిపించింది. 


* బేసిగ్గా నాకు యాక్షన్ సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నాను. ప్రవీణ్ కి యాక్షన్ ఎలా కావాలనే దానిపై ఓ అవగాహన ఉంది. అందుకనే తన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులు బావుంటాయి. గాండీధారి అర్జున విషయానికి వచ్చేసరికి ఇందులో ఎక్కువ రోప్ షాట్స్, సీజీ వర్క్ ఉపయోగించకుండానే చేశాం. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ చేశాం. రేపు థియేటర్స్ లో చూస్తే తెలుస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యాయి. 


* 'గాండీవధారి అర్జున' కథను యాప్ట్ అయ్యే టైటిల్. కాల్ ఫర్ హెల్ప్ లాంటి టైటిల్. ఈ సినిమాలోనూ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హీరోని పిలుస్తారు. తను పేరు అర్జున్. అందుకనే ఈ టైటిల్ పెట్టాం. 


*  'గాండీవధారి అర్జున' స్పై సినిమా కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. సాధారణంగా మన దేశానికి చెందిన ప్రతినిధులు ఇతర దేశాల్లో చర్చలకు వెళ్లినప్పుడు వాళ్లు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకుంటారు. ఇలాంటి వాళ్లలో దేశ రక్షణ వ్యవస్థలో పని చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు. 


*  'గాండీవధారి అర్జున'లో ఏదో సందేశం ఇచ్చి మీరు మారాలని చెప్పటం లేదు. ఇప్పుడున్న సమస్య ఏంటి? అనే దాన్ని చూపిస్తున్నాం. దాని వల్ల ఎవరైనా మారితే మంచిదే. నేను రీసెంట్ గా సినిమాను చూశాను. నాకు నచ్చింది. 


* ఎవరైనా క్లాస్ పీకినట్లు ఏ విషయమైన చెబితే బోర్ కొట్టేస్తుంది. సినిమా అయినా అంతే కాస్త ఎంటర్ టైనింగ్ పంథాలో చెబితే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు.  'గాండీవధారి అర్జున' విషయానికి వస్తే యాక్షన్ ఎంటర్ టైనర్ గా చెప్పే ప్రయత్నం చేశాం. 


*  'గాండీవధారి అర్జున' కథ నాలుగు రోజుల్లో జరిగే సినిమాగా తెరకెక్కించారు. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో పాటు చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. కథ డిమాండ్ మేరకే సినిమాను లండన్ లో షూట్ చేశాం. 


* సాక్షి వైద్య చాలా ఫోకస్డ్ పర్సన్. సినిమాలోని త్రీ పేజీస్ డైలాగ్ ను ఎక్కువ టేక్స్ లేకుండా కంప్లీట్ చేయటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. తను ఏదో సాధించాలనుకుంటోంది. 


* ఇప్పుడు నేను చేస్తున్న మట్కా సినిమాలో నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో నా క్యారెక్టర్ లో నాలుగు షేడ్స్ ఉంటాయి. మట్కా అనే ఆట ఎలా ప్రారంభమైందనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !