View

బర్త్ డే ఇంటర్య్వూ - హీరో విశ్వక్ సేన్ 

Sunday,March28th,2021, 04:19 PM

'ఫలక్‌నూమాదాస్‌'తో ఆకట్టుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ రెండో చిత్రం‌ `హిట్`తో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `పాగల్`. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది.  ఈ చిత్రం ఏప్రిల్ 30న  గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. మార్చి 29 పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ చెప్పిన విశేషాలు..


బ‌ర్త్‌డే  ప్లాన్స్..
- స్పెష‌ల్‌గా ప్లాన్స్ అంటూ ఏంలేవు..రేపు కూడా షూటింగ్‌కి వెళ్తున్నాను. గ‌తేడాది పాగ‌ల్ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి అవ‌గానే లాక్‌డౌన్ వ‌చ్చింది. ఆ సినిమాకి రానా క్లాప్ కొట్టారు. అయితే యాదృచ్చికంగా మా ఇద్ద‌రి సినిమాలు ఒకే రోజు విడుద‌ల‌వుతున్నాయి. ఇదే విష‌యాన్ని రానాకి చెప్తే మ‌నం ఇద్ద‌రం క్రాస్ ప్ర‌మోష‌న్స్ చేసుకుందాం అని న‌వ్వుతూ అన్నారు. రేప‌టితో పాగ‌ల్ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. ఏప్రిల్  ఫ‌స్ట్ నుండి ఈ సినిమాకి సంబందించి నాన్‌స్టాప్ అప్‌డేట్స్ ఉంటాయి.


కొత్త నిర్ణ‌యం..
- థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని కేవ‌లం థియేట‌ర్స్‌లోనే ప్లే చేయ‌బోతున్నాం. దిల్‌రాజుగారు కూడా ఈ విష‌యంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత‌కు ముందు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కేవ‌లం థియేట‌ర్స్‌లోనే ప్లే అయ్యేది. ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్‌ల‌లోనే ఎక్కువ ప్లే అవుతుంది. అలా జ‌ర‌గ‌కూడ‌దు అనే  మా టీమ్ అంద‌రం క‌లిసి ఈ  కొత్త నిర్ణ‌యం తీసుకున్నాం. మ‌రో 15రోజుల్లో పాగ‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పాగ‌ల్ ర‌థ‌యాత్ర చేయ‌బోతున్నాం. వీలైన‌న్ని ఎక్కువ జిల్లాల్లో ప‌ర్యటించ‌నున్నాం.


అందుకే ఆ టైటిల్..
- ఇప్ప‌టివ‌ర‌కూ నేను ఒక‌దానితో ఒక‌టి సంభందం లేకుండా విభిన్న క‌థాంశాల‌తో సినిమాలు చేశాను.  ఇప్పుడు పాగ‌ల్ సినిమా కూడా ఒక కొత్త ప్ర‌య‌త్నం. ప్రేమించేట‌ప్పుడు కొంత‌మంది పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ కూడా అలానే ఉంటుంది, అందుకే ఈ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. మా టీమ్ అంద‌రం క‌లిసి తీసుకున్న నిర్ణ‌యం అది.


బ‌ల‌మైన ఎమోష‌న్స్ కూడా..
- రీసెంట్‌గా విడుద‌ల‌చేసిన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క‌థ విన‌గానే చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. అందుకే ఈ సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాను. టీజ‌ర్‌లో మీకు కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాత్ర‌మే చూపించాం. రేపు సినిమాలో దానితో పాటు బ‌ల‌మైన ఎమోష‌న్స్ కూడా ఉంటాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో కొత్త ఫార్ములా ఇది.


న్యూ బిగినింగ్..
- సినిమా ప‌రిశ్ర‌మ‌లో లాక్‌డౌన్ త‌ర్వాత చాలా మార్పు వ‌చ్చింది. ఒక న్యూ బిగినింగ్‌లా ఉంది. గ‌త చిత్రాల‌తో సంభందం లేకుండా ఎవ‌రైనా మ‌ళ్లీ కొత్త‌గా ప్రూవ్ చేసుకోవాల్సి వ‌స్తోంది. అందుకే మ‌రో సాలిడ్ సినిమాతో మీముందుకు రాబోతున్నాను.


ఎలాంటి స‌జెష‌న్స్ ఇవ్వ‌ను..
- ర‌ధ‌న్ మంచి సంగీతం ఇచ్చారు. మూడు పాట‌లు ఉన్నాయి. అన్ని సాంగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. ఒక డైరెక్ట‌ర్‌ని పూర్తిగా న‌మ్మిన త‌ర్వాతే సినిమా చేస్తాను. ఆ ప్రాసెస్‌లో ఎలాంటి స‌జెష‌న్స్ ఇవ్వ‌ను. ద‌ర్శ‌కుడు న‌రేష్ ఫ‌స్ట్ మూవీ అయినా చాలా బాగా తెర‌కెక్కించాడు.


అత‌ను చెప్తేనే బాగుంటుంది..
- ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ మా ఫ్యామిలీఫ్రెండ్‌.. త‌న‌తో అన్ని విష‌యాలు డిస్కస్ చేస్తాను. అత‌నితో సినిమా గురించి త‌రుణ్ చెప్తేనే బాగుంటుంది.


ఈ ఏడాది మూడు రిలీజ్‌లు..
- 'ప్రాజెక్ట్ గామీ' షూటింగ్ పూర్త‌య్యింది. క్లాసిక్ అడ్వెంచ‌ర్ డ్రామా అది. డిఫ‌రెంట్ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం. ఆ సినిమాలో సీజీ వ‌ర్క్ ఎక్కువ ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి మ‌‌రో ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. అలాగే పివిపి బ్యాన‌ర్‌లో ఒక సినిమా చేస్తున్నా..అది ఏప్రిల్ 3నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత బీవిఎస్ఎన్ ప్ర‌సాద్‌గారితో ఒక సినిమా ఉంది. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !