View

ఇంటర్య్వూ- డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ (అతిధి దేవో భవ)

Tuesday,January04th,2022, 02:16 PM

అతిథిని చూస్తే దేవుడులా భావించే యువ‌కుడి క‌థ‌తో ‘అతిధి దేవో భవ’  చిత్రం రూపొందింద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ తెలియ‌జేస్తున్నారు. రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాత‌లు. ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారంనాడు ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ విలేక‌రుల‌తో చిత్రం గురించి ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.


- మాది చోడ‌వ‌రం ద‌గ్గ‌ర బోగాపురం అనే మారుమూల గ్రామం. కాలేజీ రోజుల్లోనే సినిమాల‌పై ఆస‌క్తి ఎక్కువ‌. మ‌రోవైపు నాట‌కాల్లో కూడా ప్ర‌వేశం వుంది. బిటెక్ లో చేరినా సినిమా ఇంట్రెస్ట్ త‌గ్గ‌లేదు. అందుకే హైద‌రాబాద్ వ‌చ్చేశాను. మొద‌ట్లో వినాయ‌క్‌, కె.విశ్వ‌నాథ్‌, రాజ‌మౌళి వంటివారి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది.


- నేను ప‌లు క‌థ‌లు రాసుకున్నాను. ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న క్ర‌మంలో రాజాబాబు మిర్యాల ప‌రిచ‌యం కావ‌డం దేవుడిలా అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రిగింది. అలా మంచి టీమ్‌తో ఈ సినిమాకు ప‌నిచేశాను. తొలి సినిమానే సంక్రాంతికి విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా అనిపిస్తుంది.


- ఇక క‌థ నిర్మాత‌దే అయినా ఎవ‌రి ప‌ని వారు చేయ‌గ‌లిగాం. నిర్మాత‌లు కొత్త‌వార‌యినా ద‌ర్శ‌కుడిగా నాకున్న అనుభ‌వంతో న‌న్ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. ద‌ర్శ‌కుడిగా ఫ్రీడ‌మ్ ఇచ్చారు. అంద‌రి స‌హ‌కారంతో సినిమా బాగా వ‌చ్చింది.  గేరంటీగా మంచి సినిమా చేశాన‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను.


- అతిధి దేవో భవ చిత్రం ల‌వ్‌, యాక్ష‌న్ .. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వుంటుంది.


- ట్రైల‌ర్‌లో భ‌యంమీద డైలాగ్ వుంది. అది ఏమిట‌నేది సినిమాలో చూడాల్సిందే.  హీరో ఎందుకు భ‌య‌ప‌డున్నాడ‌నేది సినిమాకు హైలైట్‌ పాయింట్‌.


- ఈ సినిమాలో నువేక్ష‌, రోహిణి, న‌వీన రెడ్డి వంటి న‌టీన‌టులు బాగా న‌టించారు. స‌ప్త‌గిరి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఇలా టీమ్ వ‌ర్క్‌తో ముందుకు సాగాం.


- ఇక సంగీత‌ప‌రంగా శేఖ‌ర్ చంద్ర బాణీలు ఆద‌ర‌ణ పొందింది. `బాగుంటుంది న‌వ్వితే.`. అనే పాట కాల‌ర్ ట్యూన్‌గా యూత్  పెట్టుకున్నారు. ఇప్ప‌టికి 4 మిలియ‌న్ల ప్ల‌స్ అయింది. ఇంకా మూడు సాంగ్‌లు హిట్ అయ్యాయి. ట్రైల‌ర్ ఆద‌ర‌ణ పొందింది.


- టైటిల్ ప‌రంగా చెప్పాలంటే ఇది క్లాస్ టైటిల్ అయినా.. అంద‌రికీ చేరుతుంది. క‌థ‌లో హీరోకు అంద‌రూ అతిథులే. అలా ఎందుకు అనుకుంటాడ‌నేది సినిమాలోనే చూడాల్సిందే.


- నిర్మాత‌లు అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రించారు. మ‌ధ్య‌లో క‌రోనా అడ్డంకి అయినా అనుకున్న బ‌డ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం.


- సినిమాకు వ‌చ్చి న‌ప్రేక్ష‌కుడు మంచి సినిమా చూశామ‌నే ఫీల్తో వుంటాడు.


- ఈ సినిమాను రాజ‌మౌళిగారికి చూపించే స‌మ‌య‌మంలేదు..ఎందుకంటే  జ‌న‌వ‌రి 26 మా సినిమా విడుద‌ల అనుకున్నాం. కానీ ప‌రిస్థితులు మారిపోవ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బిజీలో ఆయ‌న‌కు చూపించే వీలు కాలేదు. త‌ప్ప‌కుండా ఏదో టైంలో ఆయ‌న‌కు చూపిస్తాను.


- ఇప్ప‌టికే ప‌లు క‌థ‌లు రాసుకున్నాను. నాకు యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాలంటే ఇష్టం. అని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !