ఆశిష్ (శిరీష్ తనయుడు) హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రౌడీ బాయ్స్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఇంటర్వ్యూ విశేషాలు...
- సాధారణంగా ప్రతి సినిమా దేనికో ఒకదానికి రిలేట్ అవుతుంటుంది. అలాగే ‘రౌడీ బాయ్స్’ సినిమాకు ‘ప్రేమ దేశం’ సినిమాకు సంబంధం ఉందా? అని అంటుంటారు. కానీ అది నిజం కాదు. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆధారంగా చేసుకుని సినిమా చేశాను. మా కాలేజ్‌లోనే అటు ఇంజనీరింగ్ కాలేజ్.. ఇటు మెడికల్ కాలేజ్ ఉండేది. మా కాలేజ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని కథ రాస్తే.. అది రాజన్నకి నచ్చింది. సినిమా చేశారు.
- హీరో ఆశిష్ క్యారెక్టరైజేషన్‌ను క్రేజీగా ఉండేలాగానే ప్లాన్ చేసుకున్నాను. దానికి తగ్గట్టే ఇప్పుడు చాలా మంది టాటూ వేసుకుంటున్నారుగా. అలా టాటూస్, హోయిర్ స్టైల్ ప్లాన్ చేసి డిజైన్ చేసుకుని చేశాం.
- ‘హుషారు’ సక్సెస్ తర్వాత దిల్ రాజుగారు ఓ రోజు పిలిచి కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఏదైనా కథ ఉందా? అన్నారు. ఉంది సార్! అని చెప్పి.. మరుసటి వచ్చి చెప్పాను. చెప్పగానే ఆయనకు నచ్చి ఓకే చెప్పారు. ముందు ఇది ఆశిష్‌తో సినిమా చేస్తున్నామని రాజుగారు నాకు చెప్పలేదు. రెండు నెలలు పాటు కథపై కూర్చుని అతా బాగా వచ్చిందని అనుకున్న తర్వాత రాజుగారు ఆశిష్‌తో సినిమా చేస్తామని అన్నారు. తర్వాత ఆశిష్‌ను కలిసి మాట్లాడాను.
- కాలేజ్ మూవీ వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. కథ రాసుకునేటప్పుడు ఎవరైనా యంగ్ హీరో అయితే బావుంటుందని అనుకున్నాం. కానీ ఎవరినీ మైండ్‌లో పెట్టుకుని కథను తయారు చేయలేదు.
- ఎలాంటి ప్రెషర్ లేదు. అయితే రాజుగారు ఎక్కువ కేర్ తీసుకున్నారు. దాని వల్ల ప్రెషర్ అనిపించింది. ఫిల్మ్ మేకింగ్‌లో ఎలాంటి ప్రెషర్ లేదు.
- ఆశిష్ చాలా బాగా యాక్టింగ్, డాన్సులు చేశాడు. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లంరదూ అదే అన్నారు. రేపు ఆడియెన్స్ ఎలా చెబుతారో చూడాలి. తన ఫస్ట్ సినిమా అని అనిపించదు. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న యాక్టర్లా నటించాడు.
- ప్రెషర్స్ పార్టీ అనేది ప్రతి కాలేజ్‌లో జరుగుతుంటుంది. నేను చదువుకునే రోజుల్లో చాయ్, సమోసా ఇచ్చేవాళ్లు ఇప్పటికీ అలాగే ఉంది. విదేశాల్లో అయితే ప్రాన్ నైట్ అని ఉంటుంది. అందులో కపుల్స్ వస్తారు. డాన్సులు చేస్తారు. దాన్ని మన దగ్గర చూపెడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో డేట్ నైట్ సాంగ్ ప్లాన్ చేశాం.
- ప్రతి పిల్లాడుకి 17-18 ఏళ్ల వయసున్నప్పుడు మెచ్యూరిటీ ఉండదు. అప్పుడు చాలా పనులు చేస్తుంటాం. వైల్డ్‌గా ఉంటాం. తర్వాత ఓ ఏజ్ వచ్చిన తర్వాత ఇన్నీ చేశామా! అనిపిస్తుంది. దాన్ని సినిమాలో చూపించాం. ఆ రౌడీనెస్ను సినిమా చూపించాం కాబట్టి.. రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వారి పాత రోజులు గుర్తుకు వస్తాయి.
- రౌడీ బాయ్స్‌కు మెయిన్ ఎసెట్ మదిగారు. ఆయన పెద్ద సినిమాలకు వర్క్ చేశారు. స్క్రిప్ట్ మీద మంచి పట్టుంది. ఆయనతో పాటు రాజీవన్‌గారు, దేవిశ్రీ ప్రసాద్‌గారు ఇలా అందరూ కాలేజ్ సినిమా చేసి చాలా రోజులైంది. కాబట్టి వాళ్లు కూడా యంగ్ ఫీల్‌తో సినిమా చేశారు.
- హీరోయిన్ కోసం చాలా మందిని ఆడిషన్ చేశాం. కొంత మందిని ఫైనల్ కూడా చేశాం. సినిమాలో హీరో కంటే హీరోయిన్ కాస్త పెద్దది. హీరో ఎంత రఫ్‌గా ఉంటాడో.. హీరోయిన్ అంత మెచ్యూర్డ్‌గా ఉండాలి. తెలుగు వచ్చినవాళ్లు ఉంటే బావుంటుందనిపించి ఆలోచిస్తే.. అనుపమ పరమేశ్వరన్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో లాక్ డౌన్ వల్ల ఆమె ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి, యంగ్ లుక్‌లో చక్కగా కనిపించింది. టెస్ట్ షూట్ చేశాం. బాగా ఉందనిపించడంతో ఆమెను హీరోయిన్గా తీసుకున్నాం.
- విక్రమ్ కళ్లలో మంచి ఇన్టెన్స్ ఉంటుంది. తన పాత్ర పెద్దగా మాట్లాడదు. కళ్లతో మాట్లాడేలా ఉంటుంది. అందుకని తనను తీసుకున్నాం. తను కూడా ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపిస్తాడు. ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఈ సినిమా బాగా నచ్చుతుంది.
- నెక్ట్స్ ఇంకా ఏదీ కమిట్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. రౌడీ బాయ్స్ రిలీజ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. లాక్ డౌన్ సమయంలో స్క్రిప్ట్స్ రాసుకున్నాను.