View

ఇంటర్య్వూ - డైరెక్టర్ విమల్ కృష్ణ (డిజె టిల్లు)

Monday,February07th,2022, 04:13 PM

ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి 'డిజె టిల్లు' చిత్రాన్ని చూడొచ్చని చెబుతున్నారు దర్శకుడు విమల్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన 'డిజె టిల్లు' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత.  శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 'డిజె టిల్లు' సినిమా విశేషాలను దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ...


- సినిమాలకు ముందు షార్ట్ ఫిలింస్ చేశాను. ఒకట్రెండు చిత్రాల్లో నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ ఒక మంచి కథను తెరపై చూపించాలి అని ఉండేది. ఆన్ స్క్రీన్ ఉండాలనే కోరిక తక్కువ. సిద్దూ నాకు పదేళ్లుగా తెలుసు. తన బాడీ లాంగ్వేజ్, ఎలా మాట్లాడుతాడు ఇవన్నీ చూశా. నేను కథ రాసుకున్నప్పుడు ఈ టిల్లు క్యారెక్టర్ కు సిద్ధు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. సిద్ధూకు చెబితే చాలా బాగుందని చేసేందుకు ముందుకొచ్చాడు. నేను కథ రాస్తే, సిద్ధూ డైలాగ్స్ రాశాడు. మేమిద్దరం కలిసి రచన చేశాం. మేము మాట్లాడుకుంటున్నప్పడే చాలా సంభాషణలు వచ్చేవి. వాటిని సినిమాలో ఉపయోగించాం. లాక్ డౌన్ ముందు రాసిన కథ ఇది. తర్వాత మాకు ఇంప్రూమెంట్ చేసుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. దాంతో వీలైనంత డీటైయిల్డ్ గా స్క్రిప్ట్ రెడీ చేశాం. నా దగ్గర ఇది కాక మరో మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే నా తొలి సినిమా ప్రభావాన్ని చూపించాలి. జనాల్లోకి వెళ్లాలి. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథతో తొలి సినిమా రూపొందించాను.


- సిద్ధూ నేనూ సినిమాను చూసే విధానం ఒకేలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అనే విషయంలో ఇద్దరం దాదాపు ఒకేలా ఆలోచిస్తాం. మా మధ్య ఎప్పుడూ క్రియేటివ్ విబేధాలు రాలేదు. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా విడుదలయ్యాక నిర్మాత వంశీ గారి దగ్గర నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. అప్పటికే మా దగ్గర   డిజె టిల్లు కథ సిద్దంగా ఉంది. వెంటనే వెళ్లి చెప్పాం. ఆయనకు నచ్చడంతో సితారలో సినిమా మొదలైంది. సినిమా తొలి భాగాన్ని ఎంత ఆస్వాదిస్తారో, ద్వితీయార్థాన్నీ చూస్తూ అంతే ఆనందిస్తారు. 


- ట్రైలర్ లో చూస్తే నాయిక చుట్టూ ముగ్గురు నలుగురు మగాళ్లు ఉన్నట్లు చూపించాం. ఆ నలుగురు సోదరులు అవొచ్చు, స్నేహితులు అవొచ్చు. కానీ సమాజం మహిళను ఆ సందర్భంలో చూసే కోణం వేరు. ఈ దృక్పథం తప్పు. అయితే ఈ విషయాన్ని సందేశంగా చెబితే ఎవరికీ నచ్చదు. లోతుగా వెళ్లి చర్చిస్తే విసుగొస్తుంది. కానీ నవ్విస్తూ, వినోదాత్మకంగా చూపిస్తే చూస్తారు. మేము ఎంటర్ టైనింగ్ దారిని ఎంచుకుని డిజె టిల్లు చేశాం. 


- ట్రైలర్ లో రొమాంటిక్ ఫ్లేవర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు కానీ సినిమాలో కథానుసారం అలా కొంత రొమాంటిక్ సందర్భాలు ఉంటాయి. కావాలని రొమాన్స్ ఎక్కడా చేయించలేదు. అది హద్దులు దాటేలా ఉండదు. సిద్దూ హైదరాబాద్ కుర్రాడు, అతనిలో డిజె టిల్లు క్వాలిటీస్ ఉన్నాయి. ఆ బాడీ లాంగ్వేజ్ మేకోవర్ అంతా దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్యారెక్టర్ లోకి త్వరగా వెళ్లిపోగలిగాడు. నరుడు బ్రతుకు నటన అని ముందు టైటిల్ అనుకున్నాం కానీ సినిమా గురించి ఎవరికి చెప్పినా ఇది డిజె టిల్లు కదా అనేవారు. దాంతో అదే పేరును టైటిల్ గా పెట్టుకున్నాం. 


- టిల్లు తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటాడు. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో పోల్చుకుంటాడు. హీరోకున్న ఈ క్వాలిటీ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. సినిమాలో నాయిక పేరు రాధిక. మాటల్లో..జాతీయ ఉత్తమ నటి రాధిక ఆప్తే అని సరదాగా అనుకున్నాం. అది సినిమాలో అలాగే పెట్టాం. నిర్మాత నాగవంశీ చాలా సపోర్ట్ చేశారు. ఏది ఎలా కావాలంటే అలాగే చేయండని ప్రోత్సహించారు. ఎప్పుడూ ఇది వద్దు అని చెప్పలేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు కుటుంబ కథా చిత్రాల సంస్థ అని పేరుంది. అలాగని డిజె టిల్లు కథను తెరకెక్కించడంలో కాంప్రమైజ్ కాలేదు. సహజంగా మా కథలోనే ఎవరికీ ఇబ్బందిలేని అంశాలున్నాయి.


- త్రివిక్రమ్ గారు స్క్రిప్టు విషయంలో మంచి సూచనలు ఇచ్చారు. త్రివిక్రమ్ గారిని తరుచూ కలవడం, మీటింగ్స్ ఈ సినిమాతో మాకు దొరికిన గొప్ప జ్ఞాపకాలు. 


- డిజె టిల్లు ద్వారా కొత్త టేకింగ్, ఫ్రెష్ మేకింగ్ చూపించాలన్నదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సఫలం అయ్యామని అనుకుంటున్నాము. నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ట్రైలర్ చూశాక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామని ఫోన్ చేశారు. సినిమా కుదిరాక వివరాలు వెల్లడిస్తా.


హీరో సిద్దు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా 'డిజె టిల్లు’నుంచి నీ కనులను చూశానే పాట విడుదల:
సోమవారం హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా డిజె టిల్లు చిత్రం నుంచి నీ కనులను చూశానే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రవికాంత్ పేరెపు సాహిత్యాన్ని అందిచగా సిద్ధు పాడటం విశేషం. అడ్మైరింగ్ పాటలా సాగే ఈ గీతం కథానాయకుడి ప్రేమను ఆవిష్కరించింది. నీ కనులను చూశానే, ఓ నిమిషం లోకం మరిచానే, నా కలలో నిలిచావే, నా మనసుకు శ్వాసై పోయావే అంటూ సాగుతుందీ పాట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !