View

ఇంటర్య్వూ- మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి (ఖిలాడి)

Tuesday,February08th,2022, 01:50 PM

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై  తెరకెక్కుతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇందులో మూడు పాట‌ల‌ను  డింపుల్ హ‌యాతి పై చిత్రించ‌గా, టైటిల్ సాంగ్‌లో మీనాక్షి క‌న్పించ‌నుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రం త‌ర్వాత మీనాక్షి చేస్తున్న సినిమా ఇది. విశాల్‌తో `సామాన్యుడు` చేశాక డింపుల్ హ‌యాతి చేసిన ఖిలాడి విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు ఇలా తెలియ‌జేశారు.


మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, తెలుగు డైలాగ్‌లు చెప్ప‌డం నాకు బిగ్ టాస్క్‌. ర‌వితేజ సినిమాగానే మ‌రో పాట మాట్టాడ‌కుండా అంగీక‌రించాను. ఆయ‌న కామెడీ టైమింగ్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా వుంటుంది. అందుకోసం హోం వ‌ర్క్ చేశాను. కొన్ని సీన్స్ చేసేట‌ప్పుడు నేను బెరుకుగా వుంటే కంఫ‌ర్ట్ అయ్యేవ‌ర‌కు టైం తీసుకోమ‌ని సూచించారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను.


- ఏ సినిమా అయినా పాత్ర నిడివి ఎంత అనేది చూడ‌ను. క‌థ‌లో భాగంగా కేరెక్ట‌ర్ ప్రాధాన్య‌త చూస్తాను. నా రెండో సినిమాకు ఇలాంటి సినిమా రావ‌డం గ్రేట్‌.


- ట్రైల‌ర్‌లో లిప్‌లాక్ వున్నా క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాబ‌ట్టి కొన్ని అంశాలుంటాయి. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పినప్పుడే ఇలా వుంటుంది కేరెక్ట‌ర్ తీరు అని చెబుతారు.


- ర‌వితేజ సినిమాల్లో క‌థ‌కు రిలేటెడ్‌గా నాయిక పాత్ర‌లుంటాయి. న‌టిగా నేను యాక్టింగ్ స్కూల్‌లో నేర్చుకున్న‌ది కూడా ఇదే. కేరెక్ట‌ర్‌ను వెంట‌నే జ‌డ్జ్ చేయ‌లేం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ వుంటాయి. అవి హ్యూమ‌న్ ఎమోష‌న్సే. అంత‌కుమించి లైన్ క్రాస్ చేయం. ఇది కూడా న‌ట‌న‌లో ఓ భాగ‌మే.


- ఖిలాడి భారీ తారాగ‌ణం వున్నారు. డింపుల్ చాలా కంఫ‌ర్ట‌బుల్ న‌టి. సెల్ కాన్పిడెస్ ఎక్కువ‌. అంద‌రితో నూ క‌లిసిపోయేది.


- స‌లార్‌లో చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇంకా అది ఖ‌రారు కాలేదు. హిట్ 2 చేశాను. త‌మిళంలో విజ‌య్ ఆంథోని న‌టించిన `కొలై`లో న‌టించాను. అది త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతుంది. మ‌రో రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి.

 

న‌టిగా ఖిలాడి సినిమా సంతృప్తినిచ్చింది- డింపుల్ హ‌యాతీ
డింపుల్ హ‌యాతీ మాట్లాడుతూ,  నా ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎవ‌రో చూసి ద‌ర్శ‌కుడుకి పంపార‌ట‌. నాకు క‌థ చెప్పిన‌ప్పుడు ర‌వితేజ‌తోపాటు ఈక్వెల్ గా వుంటుంద‌ని తెలిసింది. ర‌వితేజ‌గారు నా ఫొటో చూసి గ‌ద్దెల‌కొండ గ‌ణేష్లో సాంగ్ చేసింద‌ని అన్నార‌ట‌.


- ఇంత‌కుముందు చేసిన ద‌ర్శ‌కుల‌నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నా. గ‌ద్దెల‌కొండ‌..లో ఐటం సాంగ్ చేస్తే అలాంటివే వ‌స్తాయ‌ని అన్నారు కూడా. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ కొంత గేప్ తీసుకుని న‌టిగా నిరూపించుకోవాల‌ని మంచి సినిమా కోసం వెయిట్ చేశాను. ఇప్పుడ‌యితే ఐటం సాంగ్ లు చేయ‌లేను. ఫ్యూచ‌ర్‌లో వ‌స్తే ఆలోచిస్తాను.


- ల‌క్కీగా ర‌వితేజ సినిమాలు అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో నేను భిన్న‌మైన మూడు సాంగ్‌లు చేశాను. లంగా ఓణితో, ఫుల్ మాస్, గ్లామ‌ర్ రోల్ సాంగ్ చేశా. న‌టిగా ఖిలాడి సినిమా సంతృప్తినిచ్చింది అని చెప్ప‌గ‌ల‌ను.


- అయితే మొద‌ట్లో ఈక్వెల్ పాత్ర అంటే భ‌య‌మేసింది. ఇలా చెబుతున్నారు. తీస్తారాలేదా! అనే అనుమానం కూడా క‌లిగింది. సినిమా చేశాక నాకు ద‌ర్శ‌కుడు చెప్పింది చెప్పిన‌ట్లు తీశారు. యాక్ష‌న్ సీన్ త‌ప్పితే మొత్తం నా పాత్ర వుంటుంది. ఇలాంటి పాత్ర ఇంత‌కుముందు ఎప్ప‌డూ రాలేదు.


- సినిమా విడుద‌ల‌కు ముందు ఎగ్జైట్‌మెంట్ వుంటుంది. అప్ప‌టికే సాంగ్ విడుల‌యి   అంచ‌నాలు పెరిగాయి. దాంతో న‌ర్వెస్‌కూడా ఫీల్ అవుతున్నా.


- ఇందులో భారీ తార‌గ‌ణం వుంది. నేను ఖిలాడి చేశాక‌. సామాన్యుడు చేశాను. సామాన్యుడు లాకౌడ్‌న్‌లో 65 రోజులుల హైద‌రాబాద్‌లో చేశాను. ల‌క్కీగా రెండు సినిమాలు నెల‌గేప్‌లో ప్ర‌చారంలో రావ‌డం  నా క‌ల నెరవేరిన‌ట్లుగా అనిపించింది.


- మీనాక్షి డౌన్ టు ఎర్త్‌. క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చింది. త‌న‌తో కాంబినేష‌న్ అన‌గానే ముంబై న‌టి రిజ‌ర్వ్‌గా వుంటుంద‌ని భావించాను. కానీ త‌ను అలా లేదు. క‌లిసిపోయింది. మిస్ దివా కంటెస్ట్‌లో నేనూ పాల్గొన్నా. మ‌ధ్య‌లో త‌ప్పుకున్నా. త‌ను ఫైనల్ వ‌ర‌కు వెళ్ళి టైటిల్ గెలుచుకుంది.


 - నేను ఫిట్‌గా వుండ‌డానికి కార‌ణం డైట్‌. నాకు డాన్స్ అంటే ఇష్టం. ఖిలాడిలో కేచ్ మి సాంగ్ చేయ‌డానికి ముందు లావుగా వున్నా. ద‌ర్శ‌కుడు న‌న్ను 6 కేజీలు త‌గ్గ‌మ‌న్నారు. త‌గ్గాక ఆ సాంగ్ చేశాను. ఇటలీలో సాంగ్ చిత్రీక‌ర‌ణ‌. అనుకోకుండా లాక్‌డౌన్ వ‌చ్చింది. షూట్ కేన్సిల్‌. రెండు నెల‌ల‌పాటు నా బాడీని మెయిన్‌టైన్ చేయ‌డానికి డైట్‌తోపాటు వ్యాయామం చేశాను. అని తెలిపారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !