View

ఇంటర్య్వూ - హీరో సిద్ధు జొన్నలగడ్డ (డిజె టిల్లు)

Wednesday,February09th,2022, 11:41 AM

"గుంటూర్ టాకీస్", "కృష్ణ అండ్ హిస్ లీల", "మా వింతగాథ వినుమా" వంటి చిత్రాలతో నటుడిగానే కాదు ప్రతిభ గల రచయితగా పేరు తెచ్చుకున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన కొత్త సినిమా "డిజె టిల్లు". నేహా శెట్టి నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. ఈ నెల 12న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'డిజె టిల్లు' సినిమా విశేషాలను హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఆయన మాట్లాడుతూ...


- నటుడిని అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉండేది. నాకు నేనే చిత్ర పరిశ్రమలో ఒక అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం రచయితగా మారాల్సివచ్చింది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా తర్వాత నాగవంశీ గారు సినిమా చేయమని అవకాశం ఇచ్చారు. అలా 'డిజె టిల్లు' సినిమాకు శ్రీకారం చుట్టాం. నేను, దర్శకుడు విమల్ కృష్ణ కలిసి ఈ కథ, మాటలు రాశాం. రచనలో మా ఇద్దరి కృషి ఉంది.


- ప్రేమ కథకు చిన్న క్రైమ్ కోణాన్ని జతచేసి రాసిన కథ ఇది. ప్రేమ కథే ఎక్కువగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన మనుషుల్లో ఒక ప్రత్యేకమైన ప్రవర్తన గమనించాను. వాళ్ల క్యారెక్టర్ లను తెరపై చూపించాలని అనుకని ఈ సినిమాలో పాత్రలను రూపకల్పన చేశాం. 


- నేను పెరిగిన మల్కాజ్ గిరి ఏరియాలో యూత్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. తమ దగ్గర డబ్బు పెద్దగా లేకున్నా పైకి దర్పంతో ఉంటారు. అందరితో కలిసి స్నేహం చేస్తారు. ఎవరికైనా అవసరం వస్తే సాయం చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లలో నిజాయితీ ఉంటుంది. ఈ లక్షణాల స్ఫూర్తిగా తీసుకుని డిజె టిల్లు క్యారెక్టర్ రాసుకున్నాం. డిజె టిల్లు రాత్రంతా పోగ్రాముల్లో ఉంటారు. ఉదయం ఆలస్యంగా లేస్తారు. వాళ్లు కొత్త కొత్త ప్యాషన్ లు ఫాలో అవుతారు. హేయిర్ స్టైల్, డ్రెస్ లు వేస్తుంటారు. మన టిల్లు కూడా అలాంటి మేకోవర్ లోనే కనిపిస్తాడు. పూర్తిగా తెలంగాణ యాసతో మాట్లాడుతుంటాడు.


- సినిమాలో టిల్లుకు పెద్దగా డీజే చేసే ప్రతిభ ఉండదు. ఏవో రెండు మాస్ పాటలు చేసి వాటితోనే ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఆ రోజుకు వచ్చిన డబ్బులు ఖర్చు చేసేస్తాడు. అతనికి డబ్బులు వెనకేయాలి, ఇంకేదో చేయాలనే ఆలోచనలు ఉండవు. ఉన్నంతలో హాయిగా బతికేస్తుంటాడు. తన చుట్టూ తిరిగేవాళ్లకు ఖర్చు పెడుతుంటాడు. లేకుంటే వాళ్లు అన్నా అని వెనకే తిరగరు కదా.


- ఇది బుద్ధిగా, ఒక పద్దతితో రాసుకున్న కథ కాదు. క్యారెక్టర్ నుంచి, కథ నుంచి, త్రివిక్రమ్ గారి సూచనల నుంచి పుట్టిన అంశాలన్నీ కలిపి కథగా రాసుకున్నాం. వినోదంతో పాటు ఒక మంచి విషయం ఈ సినిమాలో ఉంటుంది. అది తెరపైనే చూడాలి. అప్పటిదాకా నవ్వించే టిల్లు ఒక మంచి విషయం చెప్పి ముగిస్తాడు. అది సందేశం ఇచ్చినట్లు కూడా అనిపించదు కానీ ప్రేక్షకులకు చేరుతుంది.


- హీరో కోణంలో సాగే కథే ఇది. అయితే నాయికకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. హీరో ప్రేమ బాధితుడు. ఆ బాధ, విసుగు నుంచే వినోదాన్ని రప్పించాం. దర్శకుడు విమల్ నాకు స్నేహితుడు. మా మధ్య సృజనాత్మక విబేధాలు ఎప్పుడూ రాలేదు. 


- సితార సంస్థలో మాకు ఏ ఇబ్బందులు లేవు. సినిమా కోసం ఏది కావాలన్నా వచ్చేసేది. మాకు పెద్ద సమస్యలు అనుకున్నవి వంశీ గారు, చినబాబు గారు వెంటనే పరిష్కరించేవారు. వంశీ గారు మొన్న సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. డిజె టిల్లును పెద్ద సినిమా చేయొచ్చు అని త్రివిక్రమ్ గారు ప్రోత్సహించారు. ఇటీవల సినిమా చూశాక కూడా ఇది హిట్ అవుతుంది. ఏ రేంజ్ హిట్ అనేది చూడాలి అన్నారు. మేమూ అదే చెబుతున్నాం. డిజె టిల్లు విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఎంత పెద్ద విజయం అనేది ప్రేక్షకులు చెప్పాలి.


- డిజె టిల్లు టైటిల్ సాంగ్ విజయాన్ని పూర్తిగా రామ్ మిర్యాలకే ఇస్తాడు. టిల్లు ఇలా ఉంటాడు అని చెబితే ఆయన సూపర్ మాస్ సాంగ్ చేసి ఇచ్చాడు. సినిమా విడుదలకు సిద్ధమవుతుందన్న ఒత్తిడి నాలో లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !