View

ఇంటర్య్వూ-  డాలీ ధ‌నుంజ‌య్ (బ‌డ‌వ రాస్కెల్‌)

Monday,February14th,2022, 03:40 PM

'పుష్ప‌' సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ధ‌నుంజ‌య్ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క‌న్న‌డ‌లో 8 సినిమాల్లో హీరోగా చేసి, 9వ సినిమా శివ‌రాజ్ కుమార్ సినిమాలో విల‌న్‌గా చేశారు. ఆ చిత్రంలోని డాలీ పేరుతో డాలీ ధ‌నుంజ‌య్ గా పాపుల‌ర్ అయ్యారు. ఆయ‌న తాజాగా న‌టించిన సినిమా 'బ‌డ‌వ రాస్కెల్‌'. శ్రీ‌మ‌తి గీతా శివ‌రాజ్‌కుమార్ స‌మ‌ర్ప‌కులుగా ఈ సినిమాకు వ్య‌వ‌హ‌రించారు. శంక‌ర్ గురు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా క‌న్న‌డ‌లో విడుద‌లై విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఇదే సినిమాను తెలుగులోనూ బ‌డ‌వ రాస్కెల్ గా అనువ‌దించారు. ఈ చిత్రం ఈనెల 18న విడుద‌ల‌కాబోతోంది. ఈ సినిమా గురించి డాలీ ధ‌నుంజ‌య్ హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.


- పుష్ప సినిమా అనుభూతి మాట‌ల్లో చెప్ప‌లేనిది. క‌న్న‌డ‌లోనేకాదు ఎక్క‌డికి వెళ్ళినా న‌న్ను చూడ‌గానే `త‌గ్గేదేలే` అంటూ గుర్తుపెట్టుకుని ప‌లుక‌రిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ ల‌తో ప‌నిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా.


- నేను క‌న్న‌డ‌లో 9 సినిమాలు చేసినా పుష్ప త‌ర్వాత మ‌రింత గుర్తింపు వ‌చ్చింది. కొంత‌మంది స్నేహితులు ఎందుకు తెలుగులో న‌టించావ‌ని కూడా అడిగారు. న‌టుడికి ప‌రిధిలేదని చెప్పాను.


- నేను తెలుగులో `భైర‌వ ద్వీపం` చేశాను. ఇప్పుడు పుష్ప చేశా. ఈ సినిమా త‌ర్వాత ప‌లు క‌థ‌లు కూడా వింటున్నాను.


- క‌న్న‌డ‌లో పుష్ప విడుద‌లైన వారం త‌ర్వాత బ‌డ‌వ రాస్కెల్ రిలీజై హిట్ సంపాదించింది. బ‌డ‌వ రాస్కెల్ అనేది  స్వీట్‌గా తిట్టే తిట్టు. లెజెండ‌ర్ డా. రాజ్‌కుమార్ గారు ఎక్కువ యూజ్ చేసేవారు.


- తెలుగు డైలాగ్స్ రామ‌కృష్ణ రాశారు. డ‌బ్బింగ్ కూడా నేనే చెప్పాను. పుష్ప‌లో కూడా నేనే చెప్పాను. ఇక నా నిర్మాణంలో బ‌డ‌వ రాస్కెల్ తొలిసినిమా. ద‌ర్శ‌కుడు, మ‌రికొంత‌మంది స్నేహితులు క‌లిసి చేసిన సినిమా.  స్నేహితుడు ర‌మ‌ణ తెలుగులోకూడా రిలీజ్ చేస్తే మంచింది అని సూచించారు. అందుకే విడుద‌ల చేస్తున్నా.


- బ‌డ‌వ రాస్కెల్  క‌థ‌ప‌రంగా చెప్పాలంటే, చ‌దువు ముగిశాక ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేసే వ‌య‌స్సులో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినిమా వుంటుంది. ఇది మ‌ధ్య‌త‌ర‌గ‌తి క‌థ‌. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఇలాంటి క‌థ‌లో త‌ల్లిదండ్రులే హీరోలు. నాకు త‌ల్లిదండ్రులుగా న‌టించిన‌వారు బాగా న‌టించారు.


- నేను ప్ర‌తి సినిమా చేసేట‌ప్పుడు మార్కెట్ కూడా ప‌రిశీలిస్తాను. అలా కొన్ని మెళుకువ‌లు నేర్చుకున్నాకే నిర్మాత‌గా మారా. నా 9వ సినిమా శివరాజ్ కుమార్ తో చేశాను. అందులో విల‌న్‌. నా పాత్ర డాలీ. అది బాగా పాపుల‌ర్‌. అందుకే డాలీ ధ‌నుంజ‌య్‌గా నాకు గుర్తింపు వుంది.


- నేను సినిమారంగంలోకి వ‌చ్చి 13 ఏళ్ళ అయింది. ప్ర‌తిసారీ ప్ర‌తి ద‌ర్శ‌కుల‌నుంచీ ఏదో ఒక‌టి నేర్చుకుంటూనే వున్నా.


- నాకు చిన్న‌త‌నంనుంచే న‌టన‌పై అస‌క్తి. డ్రామాలు ఆడాను. థియేట‌ర్ బేక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చాను. మా కుటుంబంలో ఎవ‌రూ ఈ రంగంలో లేరు.


- న‌టుడిగా హీరో, విల‌న్ అనేవి రెండూ ఇష్ట‌మే. హీరోకు కొన్ని బౌండ‌రీలు వుంటాయి. కానీ విల‌న్‌కు వుండ‌వు. పెర్ ఫార్మెన్స్ ఎక్కువ‌కు అవ‌కాశం వుంటుంది.


- క‌న్న‌డ‌లో పేరున్న హీరోల సినిమాలు, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి సినిమాలు వ‌చ్చినా ఎక్క‌డా కాంపిటేష‌న్ అనిపించ‌దు. హెల్తీ కాంపిటేష‌న్‌గానే వుంటుంది. నా బ‌డ‌వ రాస్కెల్ విడుద‌లైన‌ప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా విడుల‌య్యాయి. మ‌రోవైపు ఇక్క‌డి హీరోల సినిమాలు కూడా విడుద‌ల‌య్యాయి. ఎవ‌రి సినిమాలు వారివే. నా సినిమా కూడా విడుద‌లై విజ‌య‌వంతం అయింది. అని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !