View

ఇంటర్య్వూ - డైరెక్టర్ ఎన్.ఆర్.రెడ్డి (ధగఢ్ సాంబ)

Tuesday,May17th,2022, 02:16 PM

సంపూర్ణేష్ బాబు గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా ఒక ఎత్తు.ఈ సినిమా లో సంపూని సరికొత్తగా చూస్తారు. సంపూ గారి కెరీర్ లో ది బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి. బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” ఈ నెల 20.న విడుదల అవుతుంది. నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ & ప్రోమోకు,పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మే 20. న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ...


1993 లో ఇండస్ట్రీ కి ఆర్టిస్టుగా వచ్చాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కారణంగా బిజినెస్ వైపు వెళ్లడం జరిగింది. అయినా సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ తో మళ్లీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అయితే దర్శకుడు అవ్వాలనే కోరికతో నేను కొన్ని కథలు రాసుకున్నాను.. దర్శకుడుగా నాకిది మొదటి చిత్రం. లాక్ డౌన్ లో రాసుకున్న కథను నా ఫ్రెండ్ డిఓపి ముజీర్ గారికి వినిపించి ఎవరితో నైనా ఈ కథతో సినిమా చేద్దాం అన్నాను.ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, పాటలు ఇలా అన్ని నేనే రాసుకోవడం జరిగింది.ఈ కథ ముజీర్ గారికి నచ్చడంతో నాకు సంపూ గారు బాగా తెలుసు తను ఇప్పటి వరకు ఇలాంటి మాస్ యాక్షన్  సినిమా చేయలేదు తనకైతే ఈ కథ బాగుంటుంది సంపూతో చేద్దాం అన్నాడు.ఆ తర్వాత ఈ కథను సంపూ కు చెప్పడం తను చేయడానికి ఒప్పుకోవడం జరిగింది.


సంపూ గారి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు నేను రాసుకున్న కథను 30% మార్పు  చేశాము.ఈ సినిమాలో ట్విస్ట్ ల తో ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఇన్ని రకాల ఎమోషన్స్ తో కూడుకున్న మొదటి ఇదే..అవుతుంది. 


ఈ చిత్రానికి ముజీర్ గారు డిఓపి గానే కాకుండా ఈ చిత్రం పూర్తి కావడానికి మెయిన్ పిల్లర్ గా నిలబడ్డారు .ఈ రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతుందంటే.. ముజీర్ గారి పాత్ర ఎంతో ఉంది. ఎంతో సపోర్ట్ చేశారు. సంపూ గారి యాక్టింగ్ ,బాలు గారి కొరియోగ్రఫీ, డేవిడ్ గారి మ్యూజిక్, పాపారావు గారి ఎడిటింగ్, రాజు మాస్టర్ అసిస్టెంట్స్  ఫైట్స్ , యాక్షన్స్ సీన్స్ ఇలా అందరు టెక్నీషియన్స్ సపోర్ట్ చేయడం అలాగే నటులు బాషా ,జ్యోతి, అప్పారావు, చలాకీ చంటి ,ఫిష్ వెంకట్ అందరూ చాలా బాగా నటించారు.ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది.


ఇది ఒక రివెంజ్ స్టొరీ..ఇందులో రొమాంటిక్ కామెడీ & రీవేంజ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ ఫిల్మ్. ఇందులో ఐదు ఫైట్స్, ఐదు సాంగ్స్ ఉంటాయి. ఈ చిత్రం లో కథ సీరియస్ గా నడిచినా అందులోనే కామెడీ ఉంటుంది తప్ప కావాలని పెట్టినట్టు పేరడీ కామెడీ ఈ సినిమాలో ఉండదు. స్విచ్వేషన్స్ తగ్గట్టు న్యాచురల్ గా అందరి లైఫ్ లో ఎలా జరుగుతుందో అలా ఉంటుంది తప్ప ఇంపాజిబుల్ ను పాజిబుల్ చేసేలా మాత్రం ఉండదు.
ఇందులో సంపూ గారిది సస్పెన్స్ క్యారెక్టర్ తను ఎం చేస్తుంటాడో ఎవరికీ తెలియని క్యారెక్టర్. అది ఏంటనేది ఇంటర్వెల్ లో బ్లాస్ట్ అవుతుంది.ఈ సినిమాలో సంపూ గారు ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ చాలా బాగా చేశారు. సంపూ గారి కెరీర్ లో  ది బెస్ట్ సినిమా అవుతుంది.ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు.ఇందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూసేలా ఈ సినిమా ఉంటుంది.


ఈ సినిమా పూర్తి అయిన తరువాత  సెన్సార్ వారికీ చూపిస్తే ఈ కథ చాలా బాగుందని మెచ్చుకొని సెన్సార్ వారు సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.


ఈ సినిమా తర్వాత మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని  కోరుకుంటున్నా..అని ముగించారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !