View

ఇంటర్య్వూ -  శోభితా ధూళిపాళ (మేజర్)

Saturday,May21st,2022, 01:46 PM

వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా 'మేజర్' లో కీలక పాత్ర పోషించిన నటి శోభితా ధూళిపాళ మీడియాతో ముచ్చటించారు. శోభితా పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి.


'మేజర్' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
'గూడచారి' సినిమా చేస్తున్నపుడే హీరో అడవి శేష్ గారికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక ఆరాధన భావం గమనించాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై శేష్ ఎప్పటి నుండో రీసెర్చ్ చేస్తున్నారు. గూడచారి షూటింగ్ లో సందీప్ జీవితం గురించి చాలా ఆసక్తికరమైన సంగతులు చెప్పేవారు. ఐతే ఈ సినిమాలో నేను కూడా చేస్తానని అప్పుడు తెలీదు. ఒకవిధంగా ఈ కథకి నేనే ఫస్ట్ ఆడియన్.


గూడచారి తర్వాత తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం ?
నాకూ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనే వుంది. ఈ గ్యాప్ కి కరోనా ఒక కారణంగా భావిస్తా. కరోనా లేకపోతె మేజర్ ఏడాది క్రితమే వచ్చేది. ఐతే సౌత్ లో కురుప్ సినిమా చేశా. అలాగే మణిరత్నం గారి తో పొన్నియన్ సెల్వన్ చేస్తున్నా. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నా కానీ తెలుగులోనే ఐతే సరిగ్గా కుదరడం లేదు. అయితే రానున్న రోజుల్లో తెలుగు లో కూడా ఎక్కువ సినిమాలు చేయాలని ఆశిస్తున్నా.


స్థానిక నటుల పట్ల తెలుగులో సహజంగానే పక్షపాత ధోరణి వుందని భావిస్తున్నారా ?
నా కెరీర్ బాలీవుడ్ లో మొదలవ్వడంతో అక్కడ ఎలాంటి పక్షపాతం వుందో నాకో ఐడియా వుంది. అక్కడ నేను చూశాను. కానీ ఇక్కడ ఎలాంటి సవాళ్ళు ఉంటాయో తెలీదు.


మేజర్ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
మేజర్ లో ప్రమోద అనే పాత్రలో కనిపిస్తా. సినిమాలో ఒక పక్క సందీప్ జీవితం చూపిస్తూ.. మరో పక్క 26/11 దాడులు, తాజ్ ఇన్సిడెంట్ ని సమాంతరంగా చూపిస్తారు. నేను 26/11 ఎటాక్స్ లో బందీగా కనిపిస్తా. భయం, ఏడుపు , ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా బోలెడు కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. భావోద్వేగాలలో చాలా బరువైన పాత్ర. నిజ జీవితంలో ఒక వ్యక్తి దాడులని, బాధని ఎదురుకున్నారు. కాబట్టి కేవలం సినిమాటిక్ గా కాకుండా ఒక బాధ్యతతో చేసిన పాత్ర.


మేజర్ లో మీ పాత్ర చేయడానికి ఎలాంటి హోం వర్క్ చేశారు ?
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా చేస్తున్నపుడు రిఫరెన్స్ వుండదు. కానీ ఒక యాక్టర్ గా నేను బలంగా నమ్మేది ఏమిటంటే..,ఇది యాదార్ధంగా జరిగింది. నేను చేస్తున్న పాత్ర బాధ, భయాన్ని ఒకరు నిజంగా అనుభవించారు. ఈ ఘటన తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోయింది వారికి గౌరవం ఇవ్వాలి అని ఈ పాత్రని పూర్తిగా మనసుపెట్టి చేశా. నా కెరీర్ లో కన్నీళ్ళ కోసం నేను ఎప్పుడూ గ్లిజరిన్ వాడలేదు. ఈ కథని అనుభవించిన తర్వాత జీవితంలో నాకు గ్లిజరిన్ అవసరం వుండదు.


అడవి శేష్ గారికి మీరు లక్కీ చార్మ్ అనుకోవచ్చా ?
ఇలా అనుకోవడం మంచిదేగా (నవ్వుతూ)


ఒక ఆర్మీ సోల్జర్ కథ చేసినప్పుడు దాదాపు ఒకేలా అనిపిస్తాయి కదా.. మేజర్ లో వున్న కొత్తదనం ఏమిటి ?
ఆర్మీ కథలు ఒక యుద్ధం, లేదా ఒక సంఘటన మీద వుంటాయి. అయితే మేజర్ సందీప్ పర్శనల్ గా చాలా కలర్ ఫుల్, ఫిల్మీ. అమ్మాయిలందరికీ అతనంటే క్రష్ వుండేది. అతనికి సినిమాలంటే ఇష్టం. మేజర్ సందీప్ లైఫ్ లోచాలా కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. తనదగ్గర వున్న డబ్బులన్నీ స్నేహితుడికి ఇచ్చేసి రెండురోజులు ఆకలితో రైలు ప్రయాణం చేసిన వ్యక్తి సందీప్. ఇలాంటి కమర్షియల్ హీరోయిజం సన్నివేశాలు సందీప్ పర్శనల్ లైఫ్ లో చాలా వున్నాయి. సినిమాకి అడ్డువస్తాయేమోనని చాలా సీన్స్ కట్ చేయాల్సివచ్చింది. ఒకవైపు సందీప్ పర్శనల్ లైఫ్ చూపిస్తూ మరోపక్క ఎటాక్ ని చూపించారు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా మేజర్. చాలా సోల్ ఫుల్ గా తీశాం. 26/11 గురించి చాలా సినిమాలు వచ్చాయి.. కొన్ని ఆదరణ కూడా పొందాయి.. మేజర్ ఎంత భిన్నంగా వుండబోతుంది. మేజర్ సందీప్ ఎలా బ్రతికారు, ఎంత ధైర్యంగా నిలబడ్డారనేది ఈ చిత్రంలో చూస్తారు. ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యమైన మార్గాన్ని ఎంచుకునే సామర్ధ్యం అందరిలోనూ వుందనే విషయాన్నీ మేజర్ సినిమా చూసిన ప్రేక్షకులు అనుభూతి చెందుతారు.


మేజర్ సందీప్ గా మారడానికి అడివి శేష్ ఎలా ప్రిపేర్ అయ్యారు. మీరు గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా?
అడివి శేష్ చాలా కష్ట పడతారు. శరీరంలో చాలా మార్పులు ఉండేవి. బాడీని చూపించాలంటే ఒక ఒక మోటివేషన్ తో ఎవరైనా కష్టపడతారు. కానీ ఆర్మీ మ్యాన్ గా కనిపించడానికి బాడీని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కానీ అలా కనిపించాలంటే చాలా కష్టపడాలి. మేజర్ సందీప్ తల్లితండ్రులకు ఈ కథ చాలా సున్నితమైన అంశం. వారు సినిమా చూసి గర్వపడాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు.


మహేష్ బాబు గారి లాంటి సూపర్ స్టార్ ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు..ఆయన నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?
నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మహేష్ బాబు గారిది గ్రేట్ కెరీర్. అలాంటి సూపర్ స్టార్ తన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ లో మొదటిసారి బయట సినిమా చేశారు. ఇది మాకు గొప్ప ఎనర్జీ నింపింది. కరోనా సమయంలో చాలా అందోళన పడ్డాం. ఓటీటీకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాం. కానీ మహేష్ బాబు గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. 'ఇది థియేటర్ సినిమా ..ఎట్టి పరిస్థితిలో థియేటర్ లోనే విడుదలౌతుందని' చెప్పారు. ఆయన మార్గదర్శకం, ప్రోత్సాహం మాలో గొప్ప నమ్మకాన్ని నింపింది. మంచి నిర్మాణ సంస్థలో పని చేశాననే ఆనందం వుంది.


గూడాచారి తక్కువ బడ్జెట్ లో చేశారు.. కానీ మేజర్ కి స్కేల్ పెరిగింది. ఒక సినిమా స్కేల్ పెరగడంతో ఎలాంటి మార్పులు వుంటాయి ?
బడ్జెట్ ఇంతే అన్నప్పుడు దానికి తగ్గట్టుగా షూట్ చేస్తాం. ఇందులో కంప్లైంట్ ఏమీ వుండదు. బడ్జెట్ తక్కువ అవ్వడం నెగిటివ్ కాదు కొన్నిసార్లు టీంగా ఏర్పడి ఒక కసితో పని చేసే అవకాశం కూడా వుంటుంది. అయితే స్కేల్ పెరగడం అనేది మన ఎదుగుదలని చూపిస్తుంది. మేజర్ కోసం ఎనిమిది సెట్స్ వేశాం. ఒక సెట్ ఖరీదు కోటిన్నర. '' క్షణం బడ్జెట్ కోటిన్నర. ఈ ఒక్క సెట్ ఖరీదు కోటిన్నర. ఈ జర్నీ గొప్పగా అనిపిస్తుంది'' అన్నాడు శేష్. కష్టపడితేనే మన మీద డబ్బులు పెట్టె ధీమా నిర్మాతకి వస్తుంది. ఒకొక్కమెట్టు ఎక్కడంలోనే ఆనందం వుంటుంది.


గుడాచారికి మేజర్ కి దర్శకుడు శశి కిరణ్ లో ఎలాంటి మార్పులు గమనించారు ?
దర్శకుడుశశి కిరణ్ చాలా కూల్. ఏదైనా కూల్ గా ఆలోచిస్తారు. ప్రతి విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వుంటారు. ఆయన చాలా ఎమోషనల్ కూడా. ఎంతో ఎమోషనల్ కాకపొతే మేజర్ లాంటి సినిమా సాధ్యం కాదు. శశి హార్ట్ బీట్ ఆఫ్ థిస్ స్టొరీ.


మేజర్ సందీప్ ఫ్యామిలీ ని కలిశారా ?
నేను ఇంకా కలవలేదు. మా టీం కలిసింది. కొన్ని రషస్ చూశారు. సినిమాని చూసిన తర్వాత వారు ఎలా ఫీలౌతారో అనే ఎక్సయిట్ మెంట్ వుంది.


వరుసగా విజయాలు అందుకుంటున్నారు. ఒక ఆంద్ర అమ్మాయిగా ఎలా ఫీలౌతున్నారు ?
నచ్చిన పని చేయడం ఆనందంగా వుంది. నేను ఈ రంగంలోకి వస్తాననే ఆలోచన లేదు. ఫ్యామిలీలో సినిమా వాతావరణం లేదు. మిస్ ఇండియా గెలిచిన తర్వాత మోడలింగ్ చేశాను. కానీ మోడలింగ్ తృప్తిని ఇవ్వలేదు. తర్వాత నటనలోకి వచ్చాను. ఇది నాకు చాలా నచ్చింది. మంచి ఆవకాశాలు రావడం ఇంకా ఆనందంగా వుంది.


ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?
నాకు హిస్టారికల్ పాత్రలు చేయాల ని వుంది. పొన్నియన్ సెల్వన్ తో ఆ ఆకాంక్ష కొంతవరకూ తీరింది. అందులో నా పాత్ర బావుంటుంది. నేను క్లాసికల్ డ్యాన్సర్ ని. మొదటిసారి అందులో డ్యాన్స్ ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హ్యాపీగా వుండే పాత్రలు చేయాలని వుంది. కానీ చాలా వరకూ సీరియస్ పాత్రలే వచ్చాయి. మొదట్లో నాకు పాత్రని ఎంచుకునే అవకాశం వుండేది కాదు. వచ్చిన పాత్రలో మంచిదేదో ఎంచుకొని చేశాను. ఐతే ఇప్పుడు అన్నీ రకాల పాత్రలు చేయడానికి దర్శక, నిర్మాతలు, ప్రేక్షకుల నమ్మకాన్ని పొందననే భావిస్తున్నాను.


ఆల్ ది బెస్ట్
థ్యాంక్ యూ..Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !