View

ఇంటర్య్వూ - ఎస్పీ చరణ్ (సీతా రామం)

Tuesday,July12th,2022, 03:57 PM

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం 'సీతా రామం'. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో  అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఓహ్ సీతా, ఇంతందం ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ఈ రెండు పాటలని అద్భుతంగా ఆలపించారు. ఆయన వాయిస్ సంగీత ప్రియులని మెస్మరైజ్ చేస్తోంది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఎస్పీ చరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి.


సీతారామం పాటల కోసం మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం ఎలా అనిపించింది ?
ఇలాంటి మంచి పాటలు పాడే అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా వుంది. చిరకాలం నిలిచిపోయే రెండు పాటలు ఈ చిత్రం లో పాడటం నిజంగా సంతోషంగా వుంది.


పాటలు వింటుంటే సడన్  గా బాలు గారే పాడినట్లనిపిస్తుంది. అలా పాడమని దర్శక నిర్మాతలు ఏమైనా చెప్పారా ?
నేను ఇండస్ట్రీ కి వచ్చి 25 ఏళ్లపైనే అవుతుంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఇలానే పాడాను. అయితే ఇప్పుడు వినేవాళ్ళ ధ్యాస నా మీదకు కాస్త మళ్ళిందేమో.  ఇంతకుముందు పాడినప్పుడు కూడా నాన్నగారి చిన్నప్పటి వాయిస్ లా వుందే అనేవారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వలన నామీద కాస్త ధ్యాస ఏర్పడిందేమో కానీ ప్రత్యేకించి నాన్నగారిలా పడాలనే ఉద్దేశం కాదు.


కేవలం బాలు గారే పాడదగ్గ పాటలు కొన్ని వుంటాయి.. అలాంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తున్నాయని భావిస్తున్నారా ?
నేను అలా అలోచించడం లేదండీ. నాన్నగారు పాడాల్సిన పాటలు నాకే రావాలనే ఆలోచన లేదు. కానీ నాకు వచ్చే పాటలు నా శక్తి మేరకు  బాగా పాడాలనే ప్రయత్నం చేస్తాను.


ఈ పాటల్లో సాహిత్యం ఎలా అనిపించింది ?
కేకే గారు రాసిన పాట చాలా కొత్తగా అనిపించింది. స్వచ్చమైన తెలుగులా పాడినప్పుడు కూడా చాలా తీయగా అనిపించింది. మెలోడికి తగిన సాహిత్యం కుదిరింది.  మంచి తెలుగు రాసినందుకు కేకే గారికి మరోసారి కృతజ్ఞతలు.  


సంగీత దర్శకుడు  విశాల్ చంద్రశేఖర్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
సినిమా, కథ పరంగా చాలా సెన్సిబిలిటీస్ వున్న సంగీత దర్శకుడు. మెలోడి మంచి పట్టువున్న సంగీత దర్శకుడాయన. ఆయన ప్రోగ్రామింగ్ అద్భుతంగా వుంటుంది. లైవ్ మ్యూజిక్ కోసం ఆయన పడే తపన నాకు చాలా నచ్చింది. ఆయన్ని మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను.


ఈ మధ్య అచ్చతెలుగు మెలోడి పాటలు మళ్ళీ రావడం మొదలైయింది. ఈ మార్పుని ఎలా చూస్తారు ?
 మెలోడీలు ఎప్పుడూ వున్నాయి. అయితే ఫాస్ట్ బీట్ పాటల మధ్య అవంతగా కనిపించకుండా పోతున్నాయి. ఎక్కువ కాలం నిలిచేవి మెలోడిలే. ఫాస్ట్ బీట్ పాటలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మర్చిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకుని పాడుకునే పాటలు మెలోడిలే. రానున్న రోజుల్లో పూర్తి మెలోడి పాటలు వుండే సినిమాలు కూడా వస్తాయనే నమ్మకం వుంది.


ఒకప్పుడు తెలుగులో ఉదృతంగా పాడారు. తర్వాత ఒక్కసారిగా తగ్గించేశారు. నిర్మాణం వైపు వెళ్ళడం దీనికి కారణమని భావిస్తున్నారా ?
ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ, ఆర్పీ పట్నాయక్.. ఇలా అందరి సంగీత దర్శకుల దగ్గర నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి. జనాదరణ పొందాయి. అయితే తర్వాత ఎందుకు అవకాశాలు కుదరలేదో నాకైతే తెలీదు. నిర్మాణంలో బిజీగా వుండటం వలన పాడలేననే మాట నేను ఎన్నడూ చెప్పలేదు. రికార్డింగ్ కి ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారి నేను అందుబాటులో వుంటాను.


ప్రొడక్షన్ కొనసాగిస్తున్నారా ?
తమిళ్ లో చేస్తున్నాను. తెలుగులో ఇంకా ప్రవేశించలేదు.


సంగీతంలో వచ్చిన మార్పులు గురించి ? పాట పట్ల మన అప్రోచ్ అప్పటికి ఇప్పటికి ఎలా మారింది ?
సంగీతంలో వచ్చిన మార్పులు గురించి మాట్లాడాల్సినంత పెద్ద వాడిని కాదు, నేను వచ్చే పాతికేళ్ళు అవుతుంది. ఒక సింగర్ గా పాట పట్ల నా అప్రోచ్ మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మెలోడి పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా సెన్సిబుల్ గా మంచి పరిజ్ఞానంతో వున్నారు. దర్శక నిర్మాతలు కొత్త సంగీత దర్శకులని గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడం ఆనందంగా వుంది.  


బాలు గారు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా మంది కొత్త వారిని పరిచయం చేశారు. ఇప్పుడు మీరు టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా.. ఇప్పుడు వస్తున్న వారికీ ఎంత ప్రతిభ వుందని భావిస్తున్నారు ?
ప్రతిభకు కొరత లేదు. ఇప్పుడు అవకాశాలు కూడా వస్తున్నాయి. వారిని ప్రతిభని ప్రదర్శించడానికి చాలా వేదికలు దొరుకుతున్నాయి. భవిష్యత్ లో మంచి ప్రతిభ గల గాయకులు పరిశ్రమకి వస్తారని ఆశిస్తున్నాను.


సంగీత దర్శకత్వం వైపు ద్రుష్టి పెట్టె ఆలోచన వుందా ?
ఇప్పుడు లేదండీ. సంగీత పరంగా ఇంకా పరిణితి సాధించాని భావిస్తున్నాను.


అల్ ది బెస్ట్
థాంక్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !