View

ఇంటర్య్వూ - సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ (వీరసింహా రెడ్డి) 

Monday,January02nd,2023, 04:25 PM

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా పని చేసిన రిషి పంజాబీ విలేఖరుల సమావేశంలో 'వీరసింహారెడ్డి' విశేషాలని పంచుకున్నారు.


కెమరామెన్ గా సినిమాకి మొదటి ప్రేక్షకుడు మీరు.. 'వీరసింహారెడ్డి' ఎలా ఉండబోతుంది ?
వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో వుంటాయి. ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. 'వీరసింహారెడ్డి' బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్.

బాలకృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నిషియన్స్ ని చాల గొప్పగా అర్ధం చేసుకుంటారు. చాలా గౌరవిస్తారు. బాలయ్య గారికి ప్రతి డిపార్ట్మెంట్ పై గొప్ప అవగాహన వుంటుంది. చాలా ఫ్రీడమ్ ఇస్తూ టెక్నిషియన్ కి మంచి కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. బాలకృష్ణ గారి పర్సోనా లార్జర్ దెన్ లైఫ్. ఆయన స్క్రీన్ ప్రజన్స్ అవుట్ స్టాండింగ్.


'వీరసింహారెడ్డి' కోసం ఎన్ని లొకేషన్ లో షూట్ చేశారు.. షూటింగ్ పరంగా కష్టమైన లొకేషన్ ఏది ?
'వీరసింహారెడ్డి' కోసం ఏడాది పాటు షూట్ చేశాం. దాదాపు అన్ని బుతువుల్లో షూటింగ్ జరిగింది. సిరిసిల్లల్లో షూట్ చేస్తునపుడు తీవ్రమైన వేడి వుండేది. అలాగే టర్కీ ఇస్తాంబుల్, అంటాల్య లో కూడా షూటింగ్ చేశాం. అక్కడ కూడా చాలా వేడి వుంటుంది. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం.


టెక్నికల్ గా ఈ సినిమా కోసం ఏమైనా ప్రయోగాలు చేశారా ?
బాలకృష్ణ గారి పర్సోనా లార్జర్ దెన్ లైఫ్. దాన్ని తెరపై ఎంత గొప్పగా ఆవిష్కరించాలనే దానిపై ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టాం. లండన్ నుండి తీసుకొచ్చిన న్యూ సెటప్ లెన్స్ లు వాడాం. కలర్స్ అద్భుతంగా వుంటాయి. సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది.


దర్శకుడు గోపీచంద్ మలినేని తో పని చేయడం ఎలా అనిపించింది
గోపీచంద్ మలినేని యంగ్ అండ్ డైనమిక్ వండర్ ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. ఆలోచనలు పంచుకోవడం పట్ల చాలా ఓపెన్ గా వుంటారు. తనతో పని చేయడం మంచి అనుభూతి. తన గత చిత్రం క్రాక్ చూశాను. నిజానికి మేము కలసి ప్రాజెక్ట్ చేయాల్సింది. వేర్వేరు ప్రాజెక్ట్స్ వుండటం వలన కుదరలేదు. ఇప్పుడు తనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల గురించి ?
రవి గారు, నవీన్ గారు అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. ఇంత గొప్ప నిర్మాతలని నేను చూడలేదు. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ వుంది. సినిమాని చాలా చక్కగా అర్ధం చేసుకుంటారు. సినిమాకి ఏం కావాలంటే అది సమకూరుస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మళ్ళీ మళ్ళీ కలసి పని చేయాలని వుంది.


కమర్షియల్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్స్ చేయడంలో ఎలాంటి సవాల్ వుంటుంది ?
సవాల్ అంటూ ఏమీ వుండదు. గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చేశాను. ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !