View

ఇంటర్య్వూ - కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత కొణిదెల (వాల్తేరు వీరయ్య) 

Friday,January13th,2023, 03:02 PM

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సుస్మిత కొణిదెల విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య విశేషాలని పంచుకున్నారు. 


వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ చాలా కలర్ ఫుల్ గా అందంగా  వున్నాయి. దిని కోసం మీరు చేసిన రిసెర్చ్ గురించి చెప్పండి ? 
ఈ కథ విన్నపుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. దర్శకుడు బాబీ కథ చెబుతున్నపుడు నా ఆలోచనలు చాలా వరకూమ్యాచ్ అయ్యాయి. వాల్తేరు, పోర్ట్ , ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే  ఒక ఇమాజినేషన్ వచ్చింది. బాబీ గారు ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే.. మాకు వింటేజ్ చిరంజీవి గారి లుక్ కావాలని చెప్పారు.  మేముఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో .. అలా వింటేజ్ గ్యాంగ్ లీడర్ .. లాంటి లుక్ కావాలని చెప్పారు.  నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాం. దీంతో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి,  శ్రుతి హాసన్ గారికి వారివారి డిజైనర్స్ పని చేశారు. అందరం ఒక మంచి సమన్వయంతో పని చేశాం.


నాన్నగారి కాస్ట్యూమ్స్ కోసం ఆయనతో చర్చిస్తుంటారా ?తప్పకుండా నాన్నగారితో చర్చిస్తా. ఆయనకి వున్న అనుభవంతో ఒక సీన్ లో ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఇందులో కూడా ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు వుంటే బావుంటుందనే కొన్ని సూచనలు ఇచ్చారు. 


ఇందులో చిరంజీవి గారి లుక్స్ వింటేజ్ తో పాటు ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు వున్న్నాయి.. ఈ విషయంలో ఏదైనా రీసెర్చ్ చేశారా ?వింటేజ్ లుక్ తీసుకురావాలి. అలా అని ఇది పిరియడ్ సినిమా కాదు కదా. యవతకు కూడా నచ్చేలా చేయాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ పై అవగాహన వుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ని మిక్స్ చేస్తూ ఆయన నప్పే డిజైన్స్, షర్ట్స్ ప్రత్యేకంగా రూపొందించాం. 


వాల్తేరు వీరయ్యగా నాన్నగారిని తెరపై చూసినప్పుడు ఎలా అనిపించింది ?ఇది నాన్నగారి మోస్ట్ కంఫర్ట్బుల్ జోన్. చూస్తున్నపుడు అద్భుతంగా అనిపించింది. ఒక పెద్ద పండగలా అనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్న ప్రతి రోజ పండగలానే వుండేది.  


ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా వుంది ?అమ్మ లుక్ టెస్ట్ చేసినప్పుడే ఏది బావుంటుందో చెప్పేస్తుంది. అమ్మ ఇన్ పుట్స్ చాలా వుంటాయి. అలాగే ఎలావున్నా చరణ్  తప్పకుండా కాల్ చేస్తాడు. 

 
నాన్నగారు సినిమాలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని  చూస్తున్నపుడు విజిల్స్ వేస్తుంటారా ?ఇందులో ఎలాంటి మొహమాటాలు లేవు. ఆయన అభిమానిగా మేము చేసే పనే అది. ఉదయం నాలుగు గంటల కి టీం అందరితో కలసి షోకి వెళ్ళాం.  అభిమానులతో పాటు ఈలలు గోలలు అరుచుకుంటూ వచ్చాం. (నవ్వుతూ)  


చిరంజీవి గారు చాలా ఫిట్ గా కనిపించారు ? లుక్ విషయంలో మీరేమైనా ఫిట్ నెస్ టిప్స్ ఇచ్చారా ?ఈ విషయంలో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదండీ. ఆయన హార్డ్ వర్క్ చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. ఫిట్ గా వుండేవాళ్ళ కాస్ట్యూమ్స్ బావుంటాయి. దానిని మైండ్ లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆయన మెంటైన్ చేస్తూ వచ్చారు. హెల్త్ పట్ల ఆయన చాలా స్పృహతో వుంటారు. 


డిజైనర్ గా ఉంటూనే నిర్మాణం పై ద్రుష్టి పెట్టారు కదా .. నాన్నగారి సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయా ?నాన్నగారు లాంటి స్టార్ తో పని చేయాలనీ అందరి నిర్మాతలకు వుంటుంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే నాకు కూడా ‘’ముందు మంచి కథ తీసుకురా  వెంటనే చేద్దాం’’ అంటారు. మేము కూడా ఆ వేటలోనే వున్నాం. 


చిరంజీవి గారు..ఇందులో ఇరవై ఏళ్ళు వయసు తగ్గినట్లు కనిపించారు.. డిజైనర్ గా ఈ విషయంలో మీరేమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా ?నాన్నగారు తన లుక్ ని యాటిట్యూడ్ ని యంగ్ చేసుకుంటూ వచ్చారు. నేను దానిని క్యాచప్ చేశానంతే. 


రంగస్థలంలో రామ్ చరణ్ మాస్ గా డిజైన్ చేశారు.. ఇపుడు నాన్నగారు .. ఎవరు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు ?ఖచ్చితంగా నాన్నగారే. నాన్నగారంత చక్కగా ఈ మాస్ లుక్ ని మరొకరు చేయలేరని భావిస్తున్నాను. 


కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?భోళా శంకర్ జరుగుతోంది. అలాగే రెండు వెబ్ సిరిస్ లపై వర్క్ చేస్తున్నాం.అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి. శ్రీదేవి శోభన్ బాబు  సినిమా విడుదలకు సిద్దంగా వుంది. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !