View

చిట్ చాట్ - ఆదాశర్మ (క్షణం)

Monday,February22nd,2016, 05:43 PM

'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, మంచి గుర్తింపు తెచ్చుకున్న అదాశర్మ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ డ్రామా ‘క్షణం’. అడవిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించిన à°ˆ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ à°ˆ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. ఫిభ్రవరి 26à°¨ గ్రాండ్ లెవల్ లో à°ˆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా హీరోయిన్ ఆదాశర్మతో ఫిల్మీబజ్ డాట్ కామ్ చిట్ చాట్...


- 1920 సినిమా తర్వాత అలాంటి కష్టమైన క్యారెక్టర్ చేసిన సినిమా ‘క్షణం’. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేస్తానని నేను అనుకోలేదు. చాలా టఫ్ క్యారెక్టర్ చేశాను. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్. మ్యారేజ్ కు ముందు, పాప పుట్టిన తల్లిలాంటి మరో క్యారెక్టర్ చేశాను. ఆడియెన్స్ కు à°ˆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలంటే నేను ముందు à°ˆ పాత్రల పట్ల కన్వీన్స్ అవ్వాలి. అందుకే పూర్తిగా పాత్రలను అవగాహన చేసుకుని నటించాను.


- క్షణం సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశానా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అంటే ఈ నెల 26వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే ట్రైలర్ లో శ్వేతా నీకు అసలు కూతురు ఉందా? అనే చిన్న ట్విస్ట్ ఇచ్చాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయని విధంగా సాగే సబ్జెక్ట్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదు, డ్యాన్సులు, ఐటెంసాంగ్స్ ఏవీ లేవు. తెలుగు ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను.


- నా à°—à°¤ చిత్రాల్లో నేను చేసిన పాత్రలకు à°ˆ సినిమాలో నేను చేసిన పాత్రకు ఏ మాత్రం పోలికలు ఉండవు. బాలీవుడ్ మూవీ ‘కహనీ’ షేడ్స్ ఉన్నాయంటున్నారు, కానీ అలా ఏం ఉండదు. సినిమా చూస్తే మీకే à°ˆ విషయం అర్ధమవుతుంది. వేరే సినిమాలను ఇన్ స్పిరేషన్ à°—à°¾ తీసుకుని క్షణం చేయలేదు.


- దర్శకుడు రవికాంత్ పేరెపును కలిసినప్పుడు తను నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఎక్స్ ప్లెయిన్ చేశారు. లుక్ పరంగా శ్రద్ధ తీసుకున్నాను. కానీ ఎటువంటి రీసెర్చ్ చేయలేదు. కాలేజ్ లో బబ్లీగా ఉండే పాత్ర అయితే, ప్రెజంట్ లో బబ్లీగా కనపడను. రెండు డిఫరెంట్ షేడ్స్. ప్రెజెంట్ పోర్షన్ ను ముందుగా షూట్ చేశాం. ఇలాంటి రోల్ నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు, శేష్ కు థాంక్స్.


- పివిపి బ్యానర్ ఇలాంటి సినిమాకు బ్యాకింగ్ గా నిలవడం మా లక్ అనాలి. ఇలాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాకు బ్యాకింగ్ ఉండబట్టే ఈ సినిమా చేయడానికి కారణమని చెప్పాలి.


- అనసూయ చాలా బ్యూటిఫుల్ తన పాత్ర పరంగా చాలా చక్కగా యాక్ట్ చేసింది. తను రియల్లీ టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా విషయానికి వస్తే చాలా కీలకపాత్ర చేసింది. ఇది నార్మల్ మూవీ కాదు. ప్రతి పాత్రకు గుర్తింపు ఉంటుంది. నేను, అనసూయ కలిసి యాక్ట్ చేయలేదు.


- నాకు నటన అంటే ప్రేమ. క్యారెక్టర్ నిడివి గురించి ఆలోచించను. మంచి పాత్ర అనిపిస్తే చేసేస్తా. అలా అనుకునే 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాలు చేశాను. కొంతమంది ఎందుకవి చేశారు? అనడిగారు. కొంతమంది అభినందించారు. చేస్తే తప్పేంటి? ఏ పని చేసినా విమర్శలు, ప్రశంసలు రెండూ కామన్. అందుకని నేనేదీ పట్టించుకోను. నా మనసుకి అనిపించినది నేను చేస్తా.


- బేసిక్ గా నేను నెగటివ్ పీపుల్ కి దూరంగా ఉంటాను. నెగటివ్ ఆలోచనలను రానివ్వను. వీలైనంతగా పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉంటాను. ఎదుటి వ్యక్తుల్లో కూడా పాజిటివ్ నే చేస్తాను. ఒకవేళ నా గురించి ఎవరైనా నెగటివ్ గా కామెంట్ చేశారని తెలిస్తే, లైట్ తీసుకుంటాను. నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. అందుకని చిన్న చిన్న విషయాలకు హర్ట్ అయిపోను.


- నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. ముఖ్యంగా పీరియాడికల్ మూవీస్ లో నటించాలనే కోరిక ఉంది. మంచి మంచి పాత్రలు చేస్తూ, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. షూటింగ్స్ లేని సమయాల్లో పెయింటింగ్ చేస్తాను. వాటిని నా ఫ్రెండ్స్ కి బహుమతిగా ఇస్తుంటాను. పుస్తకాలు బాగా చదువుతాను.


- ఈ మధ్య రష్యల్ బ్యాలే నేర్చుకోవడం మొదలుపెట్టాను. బ్యాలే డ్యాన్స్ ఏదైనా చిన్నప్పుడే నేర్చేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది. నేను జిమ్నాస్టిక్స్ కూడా చేసి ఉండటంవల్ల నాకు ఈజీ అవుతోంది. బ్యాలే డ్యాన్స్ ఫిజికల్ ఫిట్ నెస్ కి బాగా ఉపయోగపడుతుంది.


- ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చలు దశలో ఉన్నాయి. నేను చేసే సినిమాల గురించి దర్శక-నిర్మాతలు ప్రకటిస్తే ఓకే. నా అంతట నేను మాత్రం సినిమా షూటింగ్ ఓ పదిహేను రోజులు పూర్తయ్యాకే ఆ చిత్ర వివరాలు చెబుతా. నాకదో సెంటిమెంట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !