View

చిట్ చాట్ - డైరెక్టర్ విక్రమ్ కుమార్

Thursday,May12th,2016, 02:38 AM

13 బి, ఇష్క్, మనం లాంటి వైవిధ్యభరిమైన, సూపర్ హిట్ చిత్రాలను అందించి తనకంటూ ఓ గుర్తింపును ఏర్పర్చుకున్నారు డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఆయన దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా రూపొందిన '24' చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం విక్రమ్ కుమార్ ప్రతిభను మరోసారి చాటి చెప్పింది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో ఫిల్మీబజ్ టీమ్ జరిపిన చిట్ చాట్...


- '24' చిత్రాన్ని పెద్దల నుంచి పిల్లల వరకూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.


- సినిమా ప్రారంభం నుంచి ఓ ఎగ్జయిట్ మెంట్ కి గురి చేసే విషయాన్ని చెబుతున్నామన్న విషయం తెలుసు. అందుకే చాలా జాగ్రత్తపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ మాత్రం తేడా జరిగినా సినిమా ప్రేక్షకాదరణ పొందడం కష్టం. అందుకే మా టీమంతా చాలా కృషి చేసాం. ఫైనల్ గా మేం ఏదైతే తెరపై చూపించాలనుకున్నామో అది సక్సెస్ ఫుల్ గా చూపించగలిగాం.


- ఇండస్ట్నీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ను, ఇంత సింపుల్ గా ఎలా చెప్పగలిగారని అడుగుతున్నారు. ఇలాంటి కాంప్లిమెంట్ వింటుంటే హ్యాపీగా ఉంది. సూర్యగారు చాలా రిలీఫ్ గా ఉన్నారు. హీరోగా ఆయన్ను చాలా రకాలైన క్యారెక్టర్స్ లో చూస్తుంటారు. నిర్మాతగా కూడా ఆయనెంత ఫ్యాషనేటెడ్ పర్సనో ఈ సినిమా ద్వారా తెలిసింది. ఆయన బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నాను.


- సినిమాలో ప్రతి విషయాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా విషయాలను నేర్చుకున్నాం. అయితే కథలో హీరోకు వాచ్ దొరికినప్పుడు దానితో ఏం చేయవచ్చు అనే విషయాలను చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ఏదో వాచ్ దొరికిందిగా, ఏదో చేయవచ్చు.. అన్నట్లు చెబితే ఆసక్తి తగ్గిపోతుంది. అందుకని ఆ విషయంలో చాలా ఎక్కువగా ఆలోచించాను.


- ఆ వాచ్ ను ఎమోషనల్ సీన్స్ కు ఎలా కనెక్ట్ చేయాలి, లవ్ సీన్స్ కు, వాచ్ కు మధ్య సంబంధాన్ని ఎలా చూపెట్టాలనే విషయంపై చాలా వర్కవుట్ చేసాం. అది పర్ ఫెక్ట్ గా చేయగలిగాం కాబట్టి, సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.


- ప్రతి కథను రెండు గంటల ఇరవై నిమిషాల్లో చెప్పడం కష్టం. నిడివి కంటే ఎంత మంచి కథ చెప్పామనేదే ముఖ్యం. సినిమా విడుదలైన తర్వాత ట్రిమ్ చేసాం. దాని వల్ల ఇంకా మంచి స్పందన లభిస్తోంది.


- డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయడం వల్ల కొత్త సీన్స్ రాసుకోవచ్చు. కొత్త ఆలోచనలు వస్తాయి. టైం గురించి చాలా మంది చాలా రకాలుగా రాశారు. 24 సినిమాలో నేను చెప్పిన పాయింట్ నా స్టయిల్ లో సింపుల్ గా చెప్పాను.


- 24 సినిమాకు ప్రీక్వెల్ ఉంటుంది..అల్రెడి స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. ప్రీక్వెల్ చేయడానికి కారణం ఉంది. ఆత్రేయ ఆ వాచ్ ను ఎందుకు పొందాలనుకుంటాడనే పాయింట్ నుండి సినిమాను స్టార్ట్ చేశాను. సినిమాలో చాలా విషయాలు ఆలోచించేలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన కథకు ముందు ఏం జరిగిందనే దాన్ని సినిమాగా ప్రీక్వెల్ లో చూపిస్తాను.


- సమంత, నిత్యామీనన్ మంచి నటీమణులు. వారితో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.


- నేను ‘ఇష్టం’ సినిమాతో దర్శకుడినయ్యాను. చిన్న బ్రేక్ తీసుకున్నా కానీ నాకు తెలుగు సినిమానే ముఖ్యం. అల్లుఅర్జున్ తో నా తదుపరి చిత్రం ఉంటుంది. నేను చెప్పిన పాయింట్ తనకు బాగా నచ్చింది. అలాగే మహేష్ బాబుగారికి కూడా చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. వాళ్లిద్దరితోనే నా నెక్ట్స్ చిత్రాలు ఉంటాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !