View

చిట్ చాట్ - హీరో ఉదయ్ శంకర్ (క్షణక్షణం)

Thursday,February25th,2021, 02:46 PM

కొత్త కంటెంట్ తో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు యంగ్ హీరో ఉదయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "క్షణక్షణం" శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మన మూవీస్ బ్యానర్ లో  జియాశర్మ నాయికగా  కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు "క్షణక్షణం" చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నటించిన అనుభవాలను హీరో ఉదయ్ శంకర్ మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు...


- నేను గతంలో రెండు చిత్రాలు "ఆటగదరా శివ", "మిస్ మ్యాచ్" లో హీరోగా చేశాను. ఆటగదరా శివ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ఆటగదరా శివ చిత్రానికి అత్యధిక వ్యూయింగ్ వచ్చినట్లు ఈ మధ్య బన్నీ వాస్ గారు చెప్పారు. మూడో చిత్రంగా క్షణక్షణం చిత్రం చేశాను. సినిమా రిలీజ్ కాబోతోంది.


- ఆడియెన్స్ థియేటర్ కు రావాలి లేకపోతే ఒక మంచి సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. ప్రమోషన్ బాగా చేస్తున్నాం. ఈ టైమ్ లో థియేటర్లు ఎక్కువగా దొరకడంలేదు. అయినా గీతా ఫిలింస్ వారు వీలైనంత ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు. నా జీవితంలో జరిగిన ఘటనలు కొన్ని ఈ కథలో రిలేట్ అయ్యాయి.


- హీరో క్యారెక్టరైజేషన్ నాజీవితంతో పోల్చుకున్నాను. నాకే కాదు చాలా మందికి ఇలా జరుగుతుంటాయి. ఇంట్లో, బయటా రిజెక్షన్స్ వస్తుంటాయి. నా జీవితంలో పదీ పదిహేనేళ్లుగా నా జీవితంలో ఇలాంటివే జరిగాయి. కాబట్టి నేను నటించేందుకు పెద్దగా కష్టపడలేదు. సహజంగానే అనిపించింది.


- క్షణక్షణం టైటిల్ ను నేను బజ్ కోసం పెట్టలేదు. చూడగానే క్యాచీ టైటిల్ అని పెట్టాను అని దర్శకుడు అన్నారు. క్షణక్షణం టైటిల్ కథకు యాప్ట్. వెంకటేష్ గారి క్షణక్షణం పెద్ద హిట్ సినిమా. ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రం. మా సినిమా డార్క్ హ్యూమర్ గా ఉంటుంది. చివరి 20 నిమిషాలు ఊహించలేరు. బన్నీ వాస్ గారికి కూడా ఆ  చివరి ఇరవై నిమిషాలే బాగా నచ్చింది. నేను ఊహించలేదు ఉదయ్ అన్నారు.


- మా కథకు కామెడీ కావాలని యాడ్ చేస్తే అసహజంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్ నుంచే కామెడీ పుడుతుంది. హీరో బాధలే ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. 

 

- కోటిగారితో నా ఫస్ట్ మూవీ. లాయర్ క్యారెక్టర్ చేశారు. ముందుకు ఈ క్యారెక్టర్కు  కీరవాణి గారిని అనుకున్నాం. అయితే ఆయన ఆర్ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ లో బిజీగా ఉండి ఉంటారు. కోటి గారు చివరకు మా టీమ్ లోకివచ్చారు. - రోషన్ సాలూరి మ్యూజిక్ బాగాచేశారు. ఆయన నిర్మల కాన్వెంట్ చిత్రానికి రోషన్ బాగా మ్యూజిక్ చేశాడు. తండ్రి కోటిగారు నటిస్తుంటే రోషన్ మ్యూజిక్ చేయడం వాళ్లిద్దరికీ కొత్త ఎక్సీపిరియన్స్. కోటి గారు సీన్ పేపర్ తీసుకుని క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయి చేశారు. ఎన్నిసార్లు టేక్స్ చేస్తానని కోటి గారు అన్నారు.


- కార్తీక్ గారు కథ చెప్పినప్పుడు తీసింది చూసినప్పుడు ఒకేలా అనుభూతి చెందాం. ఈ  కథను అనుకున్నట్లే చేయాలి. అనుకున్నదానికంటే ఎక్కువ చేసినా సమస్యే. మేము అనుకున్నంతే చేయాలి. ఇంకొంత సీన్స్ ఎక్కువ చేయకుండా ఖచ్చితంగా అనుకున్నట్లే చేశాం. మౌళి గారు వన్ ఆప్ ద ప్రొడ్యూసర్. కోవిడ్ టైమ్ లో ఫిష్ హార్బర్ లో సినిమా షూటింగ్ చేయాలి. వర్లు గారు, మౌళి గారు లేకుంటే మా సినిమా షూటింగ్ అయ్యేది కాదు. మాస్క్ లు, శానిటైజర్లు, పీపీఈ కిట్స్ ఇలా ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. ఉన్నవారికంటే ఎక్కువే తీసుకొచ్చి పెట్టారు. క్షణక్షణం సినిమా ఆడితేనే మరో సినిమా అవకాశం హీరోగా వస్తుంది, ఆ వాస్తవం నాకు తెలుసు. నేను లెక్కల్లో జీనియస్ గానీ, సినిమా లెక్కలు అస్సలు తెలియవు. కోటి, రఘు కుంచె, గిఫ్టన్ ఈ ముగ్గురు సంగీత దర్శకులు. మా సినిమాలో వాళ్లు నటించడం కో ఇన్సిడెంట్.


- నాకు హీరోయిన్ జియా శర్మతో సినిమాలో ఎలాంటి కెమిస్ట్రీ ఉండదు. ఆమె నా భార్య క్యారెక్టర్ చేసింది, ఎప్పుడూ మాకు గొడవలు జరుగుతుంటాయి. ఒక సమస్య నుంచి బయటకు రాగానే మరో సమస్యలో హీరో పడతాడు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. మేము ఏం చేసినా సినిమా జనాలు చూడాలి. ఫస్టాఫ్ సినిమా బాగుంటుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చివరి దాకా సినిమా ప్రేక్షకుల్ని కూర్చోబెడుతుంది. సెకండాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా ఉత్కంఠగా ఉంటుంది.


- రొటీన్ సినిమాలు కొత్త హీరోలు చేస్తే చూడరు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే రెడీమేడ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ల సంగతి వేరు. బయట నుంచి వచ్చి కొత్తగా ట్రై చేసే హీరోలకు డిఫరెంట్ కథలు ఎంచుకోవాలి, విజయ్ సేతుపతి, ఆయుశ్మాన్ ఖురానా లాంటి వాళ్లు బాలీవుడ్ లో అదే ప్రయత్నం చేశారు. ఈ హీరో వస్తుందంటే ఏదో ఓ కొత్త కథ ఉంటుందనే పేరొస్తే చాలు. అభిమానులు వస్తుంటారు. ఉదయ్ సినిమా వస్తుందంటే ఏదో కొత్త కథ తీసుకొస్తాడనే పేరు తెచ్చుకోవాలని ఉంది. కథలో ఇంపార్టెంట్స్ ఉంటే క్యారెక్టర్స్ చేసేందుకైనా సిద్ధమే. అయితే హీరోగా చేయాలనేది నా కోరిక. ఒక సఖి, గీతాంజలి, ఓకే బంగారం లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో నటించాలని ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !