View

చిట్ చాట్ - హీరో కార్తికేయ (ఆర్ ఎక్స్ 100)

Tuesday,July10th,2018, 04:40 PM

కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో కె.సి.డబ్య్లూ బ్యానర్ పై ఆశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన చిత్రం 'ఆర్ ఎక్స్ 100'. జూలై 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తికేయ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా విశేషాలు కార్తికేయ మాటల్లో...


- నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. వనస్థలిపురంలో ఉంటాము. మాకు వనస్థలిపురంలో స్కూల్ ఉంది. సినిమా ఇండస్ట్రీతో మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే నాకు చిన్నప్పట్నుంచి సినిమాలపైన, నటన పైన ఆసక్తి ఉంది. అందుకే డ్యాన్సులు నేర్చుకున్నాను. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాను. యాక్టింగ్ కోర్సులు చేసాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాను.


- ఆర్ ఎక్స్ 100 రైడ్ చాలా థ్రిల్లింగ్ గా సాగింది. రోడ్డు బాగోలేదు... చాలా సౌండ్ తో రోలర్ కోస్ట్ రైడ్ లా సాగిన ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేసాను.


- ఆర్ ఎక్స్ 100 టైటిల్... ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరీ ట్యాగ్ లైన్. హీరో క్యారెక్టర్ ని జస్ట్ ఫై చేసే విధంగా ఈ టైటిల్ ఉంటుంది. అమ్మాయి, అబ్బాయి ఓ కాపీ షాప్ లో పరియమవ్వడం, ప్రేమ మొదలవ్వడం... లాంటి ధోరణిలో లవ్ స్టోరీస్ ఉంటున్నాయి. కానీ అలాంటి ప్రేమకథతో తెరకెక్కిన సినిమా కాదు ఇది. ప్రేమలో పడ్డ ప్రేమికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది లాంటి విషయాలను చాలా ఇంటెన్స్ గా చూపించడం జరిగింది. అందుకే టైటిల్ ని జస్టిఫై చేసే విధంగా ఇన్ క్రెడిబుల్ అని ట్యాగ్ లైన్ ని పెట్టడం జరిగింది.


- ఈ సినిమా ట్రైలర్ చూసి, ఇది రివేంజ్ స్టోరీ అని అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. ఒక హెడ్ క్వార్టర్ లాంటి ప్లేస్ లో జరిగే సినిమా ఇది.


- మా సినిమా అర్జున్ రెడ్డి తరహాలో ఉంటుందనుకుంటున్నారు. అదీ లవ్ స్టోరీ, ఈ సినిమా కూడా లవ్ స్టోరీనే. అంతే తప్ప ఆ సినిమా జానర్ వేరు.. మా సినిమా జానర్ వేరు. ఆ సినిమాలో హీరో చాలా యారిగెంట్ టైప్. మా సినిమాలో హీరో చాలా అమాయకుడు. అలాంటి అమాయకుడు ఎక్స్ ్రటీమ్ సైకో స్టేజ్ కి ఎలా వెళ్లాడు. చాలా రియలిస్టిక్ గా సీన్స్ ఉంటాయి.


- సినిమాలో ముద్దు సీన్లు ఉన్నాయి. ఎన్ని ముద్దు సీన్లు ఉన్నాయి అని చెప్పలేనుగానీ.. ఓ ఫ్లో లో వెళుతుంటాయి. ఆ ముద్దు సీన్లు కథలో భాగంగాను ఉంటాయి.


- ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ప్రయోగాత్మక సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. హీరో అంటే జెంటిల్ మ్యాన్.. విలన్ అంటే చెడ్డవాడు.. హీరోయిన్ అంటే పద్ధతిగానే ఉండాలి.. ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ తోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ప్రేమలో పడ్డవారు, వారికి సమస్యలు ఎదురైతే ఎలా మారిపోతారు అన్న విషయాన్ని చాలా రియలిస్టిక్ గా చూపించడం జరిగింది. ఇలాంటి సినిమాలను అంగీకరించడానికి ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడు మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు వస్తాయి.


- ఈ సినిమాలో రెండు వెరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేసాను. ఒక క్యారెక్టర్ లో అమాయకుడిగా కనిపిస్తాను. మరో క్యారెక్టర్ గెడ్డంతో చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అందుకని ఈ సినిమాని రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేసాం. ఫస్ట్ గెడ్డం గెటప్ తో ఉన్న క్యారెక్టర్ కి సంబంధించి షూట్ జరిగింది. తర్వాత అమాయకుడి క్యారెక్టర్ ని షూట్ చేయడం జరిగింది. రావు రమేష్, రాంకీ లాంటి ఆర్టిస్ట్ లు ఉన్నారు. వారితో కలిసి సీన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎంత బాధ్యతగా ఉండాలో అంత బాధ్యతగా ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఉన్నాను. సినిమా బాగా రావడానికి నా వంతు కృషి చేసాను. ఇక ఆడియన్స్ ఇచ్చే తీర్పు కోసం వెయిటింగ్. చాలా కాన్ఫిడెంట్ గా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో యూనిట్ అందరం ఉన్నాం.

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !