filmybuzz
filmybuzz

View

ఇంటర్య్వూ - డైరెక్టర్ జయంత్.సి.పరాన్జీ (జయదేవ్)

Friday,May26th,2017, 09:26 AM

'ప్రేమించుకుందాం.. రా', 'ప్రేమంటే ఇదేరా', 'బావగారు బాగున్నారా!' 'లక్ష్మీనరసింహా' వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకి దర్శకత్వం వహించి డీసెంట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు జయంత్‌ సి. పరాన్జీ. లవ్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌ అవకుండా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో చిత్రాలను రూపొందిస్తూ తనకంటూ సెపరేట్‌ మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్నారు ఆయన. చాలాకాలం గ్యాప్‌ తర్వాత జయంత్‌ సి. పరాన్జీ 'జయదేవ్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.పి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవిని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జయదేవ్‌'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సెన్సార్‌ పూర్తి చేసుకుని అతి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి. పరాన్జీతో 'జయదేవ్‌' చిత్ర విశేషాల గురించి జరిపిన ఇంటర్వ్యూ.


ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
- చాలా తమాషాగా ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యింది. కెమెరామెన్‌ జవహార్‌రెడ్డి ఒక రోజు కాల్‌ చేసి అర్జెంట్‌గా కలవాలి అన్నాడు. ఇంటికి రమ్మన్నాను. బెల్‌ కొట్టగానే డోర్‌ నేనే ఓపెన్‌ చేశా. చూడగానే జవహార్‌ రెడ్డి, ప్రక్కన ఆరడుగుల పొడవున్న ఓ వ్యక్తి వున్నారు. అతను ఎవరు? అని అడగ్గానే గంటా శ్రీనివాసరావుగారి అబ్బాయి. తనకి సినిమాల్లో చెయ్యాలని బాగా ఇంట్రెస్ట్‌. అందుకే కలవడానికి వచ్చాం అని చెప్పాడు జవహార్‌రెడ్డి. గంటా రవిని చూడగానే చాలా అందంగా వున్నాడు. ఇతనితో సినిమా తియ్యొచ్చు అనే ఫీల్‌ కలిగింది. రెండు, మూడు నెలల్లో 16 కిలోల వెయిట్‌ తగ్గాడు. సత్యానంద్‌ మాస్టర్‌ దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్‌తో నటించాడు.


ఈ చిత్రం మెయిన్‌ కథాంశం ఏమిటి?
- తమిళ్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన 'సేతుపతి' చిత్రం చూశాను. నాకు బాగా నచ్చింది. అందులో మెయిన్‌ ఎస్సెన్స్‌ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. పరుచూరి బ్రదర్స్‌ అత్యద్భుతంగా స్క్రిప్ట్‌ని డెవలప్‌ చేశారు. ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఇది.


పోలీస్‌ స్టోరీస్‌ చాలా చిత్రాలు వచ్చాయి.. మరి ఈ చిత్రంలో వున్న కొత్తదనం ఏంటి?
- నిజమే. ఇంతవరకూ వచ్చిన పోలీస్‌ చిత్రాలు అన్నీ పర్సనల్‌ అటాచ్‌మెంట్‌తో వుంటాయి. 'అంకుశం', 'కర్తవ్యం'.. ఇంకా ఎన్నో చిత్రాలు అలాగే వుంటాయి. అన్నింట్లో కామన్‌ ఒకటే పాయింట్‌ వుంటుంది. అలా కాకుండా ఈ చిత్రంలో ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ తన కోసం కాకుండా డ్యూటీ కోసం ప్రక్కవారి కోసం తోటి ఆఫీసర్స్‌, వాళ్ల ఫ్యామిలీస్‌ని సేవ్‌ చేయడం కోసం కష్టపడుతున్నాడు. సెల్ఫ్‌ లెస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ స్టోరీ. రియాల్టీకి దగ్గరగా చాలా నేచురల్‌గా సినిమా వుంటుంది.


గంటా రవి క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- 'జయదేవ్‌'గా పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో గంటా రవి నటించాడు. తనలోని ప్లస్‌ పాయింట్స్‌ హైలైట్‌ చేస్తూ ఈ చిత్రంలో చూపించాం. సినిమా చూసి ఆడియన్స్‌ క్లాప్స్‌, విజిల్స్‌ కొట్టేవిధంగా సీన్స్‌ అన్ని వుంటాయి. ఈ చిత్రంలో 'జయదేవ్‌' పాత్రలో గంటా రవి అద్భుతంగా పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. 'జయదేవ్‌' క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. మూడీగా వుంటూ షార్ట్‌ టెంపర్‌తో అతని క్యారెక్టర్‌ వుంటుంది.


హీరోయిన్‌ క్యారెక్టర్‌ గురించి?
- 'కభీ ఖుషి కభీ ఘమ్‌' చిత్రంలో చిన్నప్పటి కరీనాకపూర్‌ క్యారెక్టర్‌లో నటించిన మాళవికా రాజ్‌ని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. బ్యూటిఫుల్‌గా నటించింది. గంటా రవి, మాళవిక రాజ్‌ ఇద్దరికీ ఇండస్ట్రీలో చాలా లాంగ్‌ రన్‌ వుంటుంది.


ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు గురించి?
- ఒక సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ ఈ చిత్రంలో వుంటుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్న వినోద్‌కుమార్‌ ఈ చిత్రంలో విలన్‌గా యాక్ట్‌ చేశాడు. చాలా టెర్రర్‌ పాత్ర అది. ఔట్‌ స్టాండింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశారు వినోద్‌. ఒక కొత్త వినోద్‌కుమార్‌ని ఈ చిత్రం ద్వారా చూస్తారు. హ్యాట్సాఫ్‌ వినోద్‌కుమార్‌.


బిగ్‌ స్టార్స్‌తో సినిమాలు తీసిన మీరు ఒక కొత్త హీరోతో ఈ సినిమా చేయడానికి రీజన్‌?
- ఇప్పుడు ఆ సిస్టమ్‌ అంతా పోయింది. కాంబినేషన్‌కి తప్ప స్క్రిప్ట్‌కి ప్రిఫరెన్స్‌ ఇవ్వడం లేదు. నాకు మెయిన్‌ స్క్రిప్ట్‌ ముఖ్యం. అది వుంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేశాం. ఇప్పుడు ప్రభాస్‌ పెద్ద రేంజ్‌ హీరో అయ్యాడు. చాలా గర్వంగా వుంది. గంటా రవి కూడా ప్రభాస్‌ రేంజ్‌ హీరో అవుతాడని కాన్ఫిడెన్స్‌ వుంది.


మ్యూజిక్‌ గురించి చెప్పండి?
- మణిశర్మ బ్యూటిఫుల్‌ మెలోడి సాంగ్స్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో 5 పాటలు వున్నాయి. రెండు పాటలు స్లావేనియా, యూరప్‌లలో చిత్రీకరించాం. మిగతావి ఇక్కడ సెట్స్‌ వేసి తీశాం. నేను 12 సినిమాలు చేస్తే అందులో 9 సినిమాలు మణిశర్మ మ్యూజిక్‌ చేశారు. అన్నీ మ్యూజికల్‌గా సూపర్‌హిట్స్‌ అయ్యాయి. ఇప్పటికే 4 పాటలు రిలీజ్‌ చేశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.


'తీన్‌మార్‌' తర్వాత ఇంత బ్రేక్‌ తీసుకోవడానికి రీజన్‌?
- 'తీన్‌మార్‌' ముందు 'అల్లరి పిడుగు' చేశాను. ఐదు సంవత్సరాలు గ్యాప్‌ తర్వాత 'తీన్‌మార్‌' చేశా. రెండూ సరిగ్గా ఆడలేదు. దాంతో బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. మళ్లీ 5 ఇయర్స్‌ గ్యాప్‌ తర్వాత 'జయదేవ్‌' చేస్తున్నాను. కరెక్ట్‌ టైమ్‌లో తీస్తున్న రైట్‌ ఫిలిం ఇది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఒక డైరెక్టర్‌గా మళ్లీ నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే చిత్రమవుతుంది.


నిర్మాత అశోక్‌కుమార్‌గారి మేకింగ్‌ గురించి?
- వెంకటేష్‌ హీరోగా అశోక్‌కుమార్‌ నిర్మించిన 'ధృవనక్షత్రం' చిత్రానికి నేను క్లాప్‌ అసిస్టెంట్‌ని. డైరెక్టర్‌ని అయ్యాక అశోక్‌ బేనర్‌లో 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్‌' రెండు చిత్రాలు చేశాను. రెండూ సూపర్‌హిట్స్‌ అయ్యాయి. ఇది థర్డ్‌ ఫిల్మ్‌. డెఫినెట్‌గా మా కాంబినేషన్‌లో 'జయదేవ్‌' హ్యాట్రిక్‌ సాధిస్తుంది.


మహేష్‌తో సినిమా ఎప్పుడు?
- మహేష్‌ లవ్‌స్టోరీ చేద్దామన్నాడు. ఇంకా స్క్రిప్ట్‌ ఫైనల్‌ అవలేదు. అన్నీ సెట్‌ అయ్యాక ఒక మంచి చిత్రం చేస్తాను.


మరి ప్రభాస్‌తో చేసే సినిమా?
- రెగ్యులర్‌గా ప్రభాస్‌తో టచ్‌లో వుంటాను. 'ఈశ్వర్‌' టైమ్‌లో ప్రభాస్‌ ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. ఏం మారలేదు. గతంలో రెండు, మూడు కథలు విన్పించాను. డేట్స్‌ ప్రాబ్లెమ్‌ వల్ల సెట్‌ కాలేదు. తప్పకుండా ప్రభాస్‌తో కూడా ఓ సినిమా చేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు 'జయదేవ్‌'తో సూపర్‌హిట్‌ కొట్టబోతున్న డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి. పరాన్జీ.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !