View

ఇంటర్య్వూ - కాలభైరవ (మత్తు వదలరా)

Tuesday,December24th,2019, 02:52 PM

ఇండస్ట్రీలో తొలి అవకాశం రావడం గొప్ప అన్నది నా సిద్ధాంతం. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఆ నియమం నాకు వర్తిస్తుంది అన్నారు కాలభైరవ. సంగీత దిగ్గజం ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం మత్తువదలరా. ఈ నెల 25న మత్తు వదలరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాలభైరవ జరిపిన ఇంటర్వ్యూ ఇది.


ఈ సినిమాలో చివరగా చేరిన సాంకేతిక నిపుణుడు మీరేనని దర్శకనిర్మాతలు ప్రచార వేడుకల్లో పేర్కొన్నారు?సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చింది?
సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కుదిరిన తర్వాత  షూటింగ్ ప్రారంభమయ్యే తరుణంలో నేను భాగమయ్యాను. సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని చిత్రబృందం చర్చించుకున్న తర్వాత  నిర్మాత చెర్రి నాకు అవకాశమిచ్చారు.


సాధారణంగా పాటలున్న సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం కావాలని కోరుకుంటారు. పాటలు లేని నేపథ్య సంగీతంతో కూడిన ఈ సినిమాను ఎంచుకోవడానికి కారణం  ఏమిటి?
ఇండస్ట్రీలో తొలి అవకాశం రావడం గొప్ప అన్నది నా సిద్ధాంతం. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఆ నియమం నాకు వర్తిస్తుంది.  వచ్చిన అవకాశాన్ని స్వీకరించకపోతే నష్టపోయేది నేనే.  లక్కీగా తొలి ప్రయత్నంలోనే బలమైన కథ, కథనాలున్న సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం దొరికింది. అందువల్లే సినిమాలో పాటలు లేవు అన్న ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. కథ విన్న తర్వాత ఇందులో పాటలు ఉండాల్సిన అవసరం లేదనిపించింది. బలవంతంగా మంచి పాట పెట్టినా కథకు అన్యాయం చేసినట్లవుతుందనిపించింది.  ఈ సినిమా కోసం నేను అందించిన నేపథ్యసంగీతం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.


సంగీత దర్శకుడిగా నాన్నగారి ప్రభావం మీపై ఎంత  ఉందని అనుకుంటున్నారు?
చిన్నతనం నుంచి నేను నాన్న దగ్గర పనిచేశాను. దర్శకుడు సన్నివేశం చెప్పినప్పటి నుంచి పాట ప్రయాణం ఎలా  ఆరంభమవుతుంది?ట్యూన్ ఎలా కంపోజ్ చేస్తారు? దర్శకుడు చేసే మార్పులు, వాటికి స్పందించే తీరుతో పాటు నాన్న నుంచి చాలా నేర్చుకున్నాను. తెలిసో తెలియకో నాన్న ప్రభావం నాపై వందశాతం  ఉంది.


 నాన్నతో  మీరు చేసిన తొలి సినిమా ఏది?
నాలుగైదు ఏళ్లుగా నాన్న దగ్గరే పనిచేస్తున్నాను. ఆయన దగ్గర కోరస్ సింగర్‌గా  కెరీర్ ఆరంభించాను.  ఆయన దగ్గరే సరదాగా ట్యూన్స్ కంపోజింగ్ చేయడం మొదలుపెట్టాను. బాహుబలి-2 చిత్రం  నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత లఘు చిత్రాలతో పాటు బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్ యానిమేషన్ వెబ్‌సిరీస్‌కు సంగీతాన్ని అందించాను. సినిమాకు సంగీతాన్ని అందించడం ఇదే తొలిసారి. సంగీతంలో ఎవరి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. స్వీయ సాధనతోనే పట్టు సాధించాను.


సోదరుడు శ్రీసింహాకు నటన పట్ల ఉన్న ఆసక్తిని మీరు ఎప్పుడూ గ్రహించారు.
శ్రీసింహాకు చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం ఉంది.  యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని  నిర్ణయించుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాడు. నటుడవ్వాలని నిశ్చయించుకున్న తర్వాత ఆ దిశగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.


నేపథ్య గాయకుడిగా మీ ప్రయాణం  పట్ల సంతృప్తిగా ఉన్నారా?
ఇప్పటివరకు దాదాపు ముప్పై పాటలు పాడాను.బాహుబలి-2లోని  దండాలయ్యా.. పాట మంచి పేరుతీసుకొచ్చింది.  అరవిందసమేతలోని పెనిమిటి.. గీతం ఆ పేరును రెట్టింపుచేసింది. చిన్నతనం నుంచి సంగీత దర్శకుడినవ్వాలనేది నా కల. అయితే వాయిస్ బాగుండటంతో  నేపథ్యగాయకుడిగా అవకాశాలు వస్తున్నాయి.  పాటలు పాడటాన్ని నేను ఎంజాయ్ చేస్తాను.


ఒకే సినిమాతో మీరు,  మీ సోదరుడు శ్రీసింహా ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎలాంటి అనుభూతిని పంచుతుంది.
గొప్ప అనూభూతి కలుగుతున్నది. ఇద్దరం ఒకే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అవుతామని కలలో కూడా ఊహించలేదు. తొలుత తమ్ముడు ఈ సినిమాలో హీరోగా ఖరారయ్యాడు. ప్రీప్రొడక్షన్ జరిగే సమయంలో నేను సంగీత దర్శకుడిగా సినిమాలో భాగమయ్యాను.  మ్యూజిక్ డైరెక్టర్‌గా నా పేరును శ్రీసింహా చిత్రబృందానికి  సూచించలేదు. అలాంటి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో  మేము లేము. చెర్రి మామ  మాకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.బయటి వారితో పోలిస్తే నాకున్న కుటుంబ నేపథ్యం కారణంగా అవకాశాలు రావడం సులభమే. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా సరైన సమయం కోసం ఎదురుచూసి ఈ సినిమాను అంగీకరించాను.


కీరవాణిగారు సంగీత దర్శకుడిగా అన్ని జోనర్‌లలో సినిమాలు చేశారు. మీ నాన్నగారి దారిలోనే మీరు అడుగులు వేయాలని అనుకుంటున్నారా? మ్యూజిక్ డైరెక్టర్‌గా మీకు ఎలాంటి సినిమాలు చేయాలనుంది?
ఐదు, పదేళ్ల తర్వాత నా పేరు చెబితే ప్రత్యేకంగా ఒకటే రకమైన సంగీతం  గుర్తురాకుండా ఏదైనా చేయగలడని చెప్పుకోవాలి. అదే సంగీత దర్శకుడిగా నా లక్ష్యం.  


ఓ సంగీత దర్శకుడిగా నాన్న కీరవాణిలో మీకు నచ్చినదేమిటి?
కంపోజింగ్,ఇన్‌స్ట్రూమెంటేషన్, నేపథ్య సంగీతం అన్ని చేసే ప్రతి పని ఇష్టమే. నాన్న ఏ భాషలో పాటను సమకూర్చిన ఆ నేటివిటీ కనిపిస్తుంది. హిందీ పాటకు బాణీలు అందిస్తే  హిందీ కంపోజర్ స్వరాల్ని అందించినట్లుగా ఉంటుంది. తమిళ పాట చేస్తే ఆ నేటివిటీ టచ్ ఉంటుంది. తెలుగు సంగీత దర్శకుడు ఐనా పరిపూర్ణంగా ఓ భాషకు తగినట్లుగా స్వరాల్ని అందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాన్న సంగీతాన్ని అందించిన సినిమాల్లో ఒకరికి ఒకరు సినిమా అంటే నాకు చాలా ఇష్టం.


సెలబ్రిటీ పిల్లల్లా కాకుండా నా తనయుల్ని సాధారాణంగా పెంచానని మీ నాన్నగారు అన్నారు?ఎందుకలా?
మేము సంపాదించే పరిజ్ఞానం కంటే మంచి బుద్ధి కలిగి ఉండటం ముఖ్యమనే భావంతో అమ్మనాన్న  చిన్నతనం నుంచి మమ్మల్ని పెంచారు. మేము అలాగే పెరిగాం. 


థ్రిల్లర్ సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం ఎంతవరకు ఛాలెంజింగ్‌గా అనిపించింది?
నిజాయితీగా మాట్లాడాలంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా  నా  పేరు వినిపించడం కంటే కీరవాణి అబ్బాయి సంగీతాన్ని అందించిన సినిమా ఇదనే అందరూ చెబుతారు. తొలి సినిమా ఏ విధంగా స్వరాల్ని సమకూర్చాడో  చూద్దాం అనే ఆలోచనతోనే  సినిమాకు వస్తారు.  ఆ అంచనాల వల్ల ఒత్తిడి  పెరుగుతుంది. సంగీత దర్శకుడిగా నా  నుంచి ఎక్కువగా కోరుకుంటారు. అయితే నాపై ఒత్తిడి ఉందనే ఫీలింగ్‌తో ఈసినిమాకు ఏ రోజు పనిచేయలేదు. ఆ క్రెడిట్ నాది కాదు. టీమ్ అందరం కొత్తవాళ్లం కావడంతో స్నేహితుల్లా కలిసిపోయి కాలేజీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లుగా కష్టపడ్డాం. మైత్రీ మూవీస్ నిర్మాతలు, చెర్రి మాపై ఏ రోజు ఒత్తిడి తీసుకురాలేదు. సినిమా మొత్తం హాయిగా సాగిపోయింది.


ఈ సినిమా విషయంలో నాన్నగారు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
సంగీతాన్ని సమకూర్చే విషయంలో నాన్న తనంత తానుగా నాకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. రీరికార్డింగ్ సమయంలో కొన్ని సీన్స్ చూపించి నాన్న ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను.


సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాకు సంబంధించిన ఇతర విషయాల్లో మీ సహకారం ఎంత ఉంది?
స్నేహితుల మాదిరిగా అన్ని విభాగాల వారందరం ఒకరి అభిప్రాయాల్ని మరొకరం పంచుకుంటూ ఈ సినిమాలు చేశాం.


సగటు ప్రేక్షకుడిగా ఈసినిమా చూసినప్పుడు ఏమనిపించింది?
సెట్‌కు వెళితే నాకు బోర్ కొడుతుంది. అందుకే షూటింగ్‌లకు దూరంగా ఉంటాను. ఈ సినిమా షూటింగ్‌కు ఒక్కరోజు కూడా వెళ్లలేదు. రీరికార్డింగ్  కోసం రఫ్ కట్‌ను నాకు పంపించారు. తొలి సినిమా కావడం, పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కించడంతో ఎలా ఉంటుందో ననే ఉత్సుకతతో నా తమ్ముడు  నటించిన సినిమా అన్నది మర్చిపోయి ప్రేక్షకుడి మైండ్‌సెట్‌తో సినిమా చూశాను.  ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని థ్రిల్‌ను అనుభవించాను. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా సినిమా ఉండటంతో నేను బాగా సంగీతాన్ని అందించాలని ఫిక్సయ్యాను.


ఈ సినిమా కోసం మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏది?
చాలా కొత్తగా ఉంది. ఇదివరకు ఎక్కడ ఇలాంటి సన్నివేశాలు చూడలేదని చాలా అంది అన్నారు.


రాజమౌళి తనయుడు కార్తికేయతో మీరు సినిమా చేయబోతున్నట్లు తెలిసింది?
కార్తికేయ నిర్మాణ సంస్థలో ఆకాశవాణి సినిమాకు సంగీతాన్ని అందించారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !