View

ఇంటర్య్వూ - కోన వెంకట్ (శంకరాభరణం)

Saturday,November28th,2015, 05:34 PM

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం 'శంకరాభరణం'. నందిత కథానాయికగా నటించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సమర్పకులు కోన వెంకట్ తో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ మీ కోసం...

 

1. శంకరాభరణం చిత్రం గురించి చెప్పండి?
'ఫస్ గయా రే ఒబామా' హిందీ సినిమా చూసి ఒక ఐడియా తీసుకొని దాని చుట్టూ కథ అల్లాను. చాలెంజింగ్ బ్యాక్ డ్రాప్, చాలెంజింగ్ స్క్రీన్ ప్లే, చాలెంజింగ్ స్క్రిప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. బీహార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రం ఇది. కొత్త ప్రయోగం. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలంటే ముందు టైటిల్ పట్ల ఆసక్తి కలిగించాలి. అందుకే 'శంకరాభరణం' టైటిల్ ని పెట్టడం జరిగింది. నిజంగానే ఈ టైటిల్ పెట్టిన తర్వాత అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. ఆసక్తిగా సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.


2. కథకి టైటిల్ కీ సంబంధం లేదా?
ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. ఆ కారణం సినిమా ఆరంభమైన 5 నిముషాలకే తెలిసిపోతుంది. టైటిల్ కి తగ్గ జస్టిఫికేషన్ కూడా ఇచ్చాం.


3. ఈ టైటిల్ ని పెడుతున్నామని చెప్పినప్పుడు డైరెక్టర్ విశ్వనాధ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు?
చాలా పాజిటివ్ గా స్పందించారు. నువ్వు మంచి సినిమాలే చేస్తావు. బూతు సినిమాలు చేయవు. కాబట్టి 'శంకరాభరణం' టైటిల్ ని పెట్టి మంచి సినిమానే తీస్తావనే నమ్మకం ఉంది అని అన్నారు విశ్వనాధ్ గారు. అంతే కాదు... ఆడియో వేడుకకు వచ్చి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఆయన అలా స్పందించడం చాలా సంతోషంగా అనిపించింది.


4. నిఖిల్ తో ఈ సినిమా చేయడానికి కారణం?
ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు గౌతమ్. నిఖిల్ మాత్రమే న్యాయం చేయగలడని సెలెక్ట్ చేసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే గౌతమ్ పాత్రకు నిఖిల్ పూర్తి న్యాయం చేసాడు. తన కెరియర్ లో ఇదొక మంచి సినిమాగా స్థానం సంపాదించుకుంటుంది.


5. నిఖిల్ పాత్ర గురించి చెప్పండి?
తండ్రి విదేశాల్లో కష్టపడి బాగా సంపాదించాడు కాబట్టి, నేనెందుకు కష్టపడాలి అనే మనస్తత్వం కలవాడు. నిజం చెప్పాలంటే ఓ హీరో ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో సినిమా చేయడానికి ఇష్టపడడు. కానీ నిఖిల్ డిఫరెంట్ కథలతో, క్యారెక్టరైజేషన్ తో సినిమాలు చేయడానికి ఇష్టపడే హీరో. ఈ కథ చెప్పగానే మరో మాట మాట్లాడకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు.


6. బీహార్ బ్యాక్ డ్రాప్.. హీరో పేరు గౌతమ్ ... ఇలా పెట్టడానికి ఏదో కారణం ఉన్నట్టు ఉందే?
అవునండి ఖచ్చితంగా కారణం ఉంది. గౌతమ్ బుద్దుడికి జ్ఞానోదయం అయిన ప్రదేశం బీహార్ లోని గయ. బీహార్ బ్యాక్ డ్రాప్... హీరో అక్కడి పరిస్థితుల వల్ల చాలా మారతాడు కాబట్టి హీరో పేరును గౌతమ్ గా పెట్టడం జరిగింది.


7. బీహార్ బ్యాక్ గ్రౌండ్ తీసుకోవడానికి కారణం?
నేను ఓ బాలీవుడ్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించినప్పుడు బీహార్ రాష్టంలోని బీరగంజ్ అనే గ్రామానికి వెళ్లాను. ఈ విలేజ్ నేపాల్ దేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ కిడ్నాపింగ్ లు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ విలేజ్ లో కిడ్నాప్ చేసి, చాలా ఈజీగా నేపాల్ కి వెళ్లిపోయి దాక్కుంటారు. ఈ కిడ్నాపింగ్ ల్లో పొలిటీషియన్స్ ఇన్ వాల్వ్ మెంట్ కూడా ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ పరిస్థితులే ఈ సినిమాకి ఓ స్టోరీ లైన్ ని సమకూర్చేలా చేసాయి. దాంతో పాటు 'ఫస్ గయా రే ఒబామా' హిందీ సినిమా చూసిన తర్వాత వచ్చిన ఐడియాను తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది.


8. హీరోయిన్ నందిత గురించి చెప్పండి?
నందిత బీహారీ అమ్మాయి పాత్రను చేసింది. అనుకోని పరిస్థితుల్లో హీరోతో పాటు హీరోయిన్ కూడా కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అయిన తర్వాత కొన్ని ఎమోషన్స్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ కి తెలుగు వచ్చిన అమ్మాయి అయితేనే న్యాయం చేయగలదని భావించి నందితను తీసుకున్నాం. తను అద్భుతంగా నటించింది.


9. డైరెక్టర్ గురించి చెప్పండి?
ఈ చిత్ర దర్శకుడు ఉదయ్ నాతో పదేళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. తను ఈ సినిమాకి న్యాయం చేయగలడని భావించి తనని దర్శకుడిగా తీసుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం చేయడంతో పాటు ఓ మాంటేజ్ సాంగ్ కి కొరియోగ్రఫీ కూడా చేసాను. కానీ లొకేషన్స్, కాస్ట్యూమ్స్ సెలక్షన్ తో పాటు మరికొన్ని బాధ్యతలను డైరెక్టర్ మాత్రమే చేయగలరు. ఉదయ్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది.


10. ఈ సినిమాలో అంజలి నటించింది కదా... ఆమె గురించి చెప్పండి?
ఈ సినిమాలో ఫైర్ బ్రాండ్ బండిట్ క్వీన్ పాత్రను చేసింది అంజలి. శ్రీదేవి, విజయశాంతి గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసారు. ఈ సినిమాలోని పాత్ర నచ్చి అంజలి ఈ సినిమా చేయడానికి అంగీకరించింది. 15నిముషాల పాటు ఆమె పాత్ర ఉంటుంది. అద్భుతంగా నటించింది.


11. శ్రీను వైట్లతో మనస్ఫర్దలు అనే వార్తలు ప్రచారం అవుతున్నాయి?
నిజమే నాకు, శ్రీను వైట్ల మధ్య మనస్ఫర్దలు ఉన్నాయి. అయితే నేను శ్రీను వైట్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నానే వార్తల్లో నిజంలేదు. ప్రస్తుతం అయితే మాత్రం మా మధ్య సత్సంబంధాలు లేవు. అయితే రేపు మళ్లీ కలుసుకోవచ్చు. 'బ్రూస్ లీ సినిమా కోసం 72 సీన్స్ రాసిచ్చాను. అన్ని తీసుకోవాలని లేదు. కానీ కథా, రచయితగా నా పేరు వేసారు కాబట్టి, నేను రాసిచ్చిన సీన్స్ ని కన్సిడర్ చేయాలి. అలా జరగలేదు. అందుకే ఫీలయ్యాను. మా ఇద్దరి కాంబినేషన్ అనగానే బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎన్నో అంచనాలతో ఉంటారు. ఇప్పుడు మా కాంబినేషన్ మీద వారికి అంచనాలు లేవు... నమ్మకం లేదు అని చెప్పి ఇంటర్య్వూ ముగించారు కోన.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !