View

ఇంటర్య్వూ - హీరోయిన్ మిస్తీ చక్రబర్తి (బాబు బాగా బిజీ)

Monday,May01st,2017, 01:57 AM

'చిన్న దాన నీ కోసం' చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయ్యింది మిస్తీ చక్రబర్తి. తాజాగా 'బాబు బాగా బిజీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'బాబు బాగా బిజీ'. మే 5న విడుదలవుతోన్న ఈ సినిమా ద్వారా నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ప అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన మిస్తీ చక్రబర్తి ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం...


'బాబు బాగా బిజీ' హిందీ సినిమాకి రీమేక్ కదా.. తెలుగు వెర్షన్ కి మార్పులు చేసారా?
చాలా చేసారు. హిందీ సినిమాని మక్కీ కి మక్కీ దింపడం ఇష్టంలేక చాలా మార్పులు చేసారు. సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది.


ఈ సినిమా చేసే అవకాశం ఎలా వచ్చింది?
డైరెక్టర్ నవీన్ మేడారం నన్ను అప్రోచ్ అయ్యారు. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్ర చేయాలన్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర. మంచి సినిమా. నా కెరియర్ కి మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో మరో మాట మాట్లాడకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.


అవసరాల శ్రీనివాస్ గురించి చెప్పండి?
అవసరాల శ్రీనివాస్ గారు అమేజింగ్ పర్సన్. చాలా మంచి వ్యక్తి. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను.


ఈ సినిమాలో ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా... వారి గురించి చెప్పండి?
ఈ సినిమాలో నాది సెపరేట్ ట్రాక్. వారితో కలిసి నటించే అవకాశం రాలేదు. కాబట్టి వారిని కలవడం కుదరలేదు. అయితే ఆ ఇద్దరూ చాలా బాగా యాక్ట్ చేసారన్న విషయాన్ని యూనిట్ మెంబర్స్ ద్వారా తెలుసుకున్నాను.


ఈ చిత్రం ద్వారా నవీన్ మేడారం డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. కొత్త డైరెక్టర్ కదా... ఎలా అనిపించింది?
నా పాత్ర ఎలా ఉంటుంది.. నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి.. ఇలా ప్రతి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు డైరెక్టర్ నవీన్. దాంతో పాత్రలో లీనమై నటించగలిగాను. చాలా సరదాగా ఉంటారు. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా సినిమా పూర్తి చేసారు.


ఈ సినిమాలో మీది గ్లామర్ రోల్.. ఇకముందు కూడా గ్లామర్ రోల్ చేస్తారా?
గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పను. కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తాను. నేను చేసిన హిందీ చిత్రం 'బేగం జాన్' లో డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ చేస్తాను. కథ డిమాండ్ మేరకు గ్లామర్ గా కూడా నటిస్తాను.


ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పండి?
కథ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. పాటలు బాగుంటాయి. సిట్యువేషన్ డిమాండ్ సాంగ్స్. క్యారెక్టర్స్ బాగుంటాయి. టోటల్ గా సినిమా అందరికీ నచ్చుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా.


మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదు. కొన్ని కథలు విన్నాను. కొన్ని చర్చల దశలో ఉన్నాను. వచ్చే నెలలో ఓ సినిమాకి సైన్ చేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !