View

వైశాఖం సాంగ్స్ నా జీవిత కోరికను తీర్చాయి - వసంత్.డి.జె

Thursday,August31st,2017, 07:03 AM

ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన à°¡à°¿.జె. వసంత్‌ 2012 'సుడిగాడు' చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌à°—à°¾ మారారు. à°† చిత్రం సక్సెస్‌ అవడంతో 'మడత కాజా', 'స్పీడున్నోడు' 'గుంటూరోడు', 'పటేల్‌ సర్‌' 'వైశాఖం' ఇలా వరుసగా హిట్‌ సినిమాలు చేస్తూ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్నీ వర్గాల సంగీత ప్రియులకి, ఆడియన్స్‌à°•à°¿ నచ్చే వినసొంపైన బాణీలను సమకూరుస్తూ సక్సెస్‌ఫుల్‌à°—à°¾ ముందుకు దూసుకెళ్తున్నారు. అనతికాలంలోనే సంగీత దర్శకుడిగా విశేషమైన గుర్తింపుని సంపాదించుకున్న à°¡à°¿.జె. వసంత్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన 'వైశాఖం' చిత్రం ఇటీవల విడుదలై బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌à°—à°¾ నిలిచింది. ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి దర్శకత్వంలో అభిరుచి à°—à°² నిర్మాత బి.à°Ž.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం సూపర్‌హిట్‌ అయి ప్రేక్షకుల ఆదరణతో అర్థశతదినోత్సవం వైపు పరులుగు తీస్తోంది. à°ˆ సినిమాకి à°¡à°¿.జె. వసంత్‌ అందించిన సంగీతం, రీరికార్డింగ్‌ సినిమాకి ఎంతో ప్లస్‌ పాయింట్‌à°—à°¾ నిలిచి వసంత్‌à°•à°¿ మంచి పేరు తెచ్చింది. సెప్టెంబర్‌ 1à°¨ à°¡à°¿.జె. వసంత్‌ పుట్టినరోజు. à°ˆ సందర్భంగా ఆగస్ట్‌ 31à°¨ హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


'వైశాఖం' నా జీవిత కోరికను తీర్చింది
సంగీత దర్శకుడు à°¡à°¿.జె. వసంత్‌ మాట్లాడుతూ - ''à°ˆ సంవత్సరం నాకు చాలా హ్యాపీగా వుంది. లాస్ట్‌ ఇయర్‌ ఇదే బర్త్‌డేకి మా 'వైశాఖం' సినిమా షూటింగ్‌లో వుంది. à°ˆ బర్త్‌డేకి మా సినిమా రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయ్యింది. యాభై రోజులకి దగ్గర్లో వుంది. ఇంకా వంద రోజులు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. à°ˆ సంవత్సరం మూడు చిత్రాలు చేశాను. మంచు మనోజ్‌ 'గుంటూరోడు', జగపతిబాబుగారి 'పటేల్‌ సర్‌', ఇప్పుడు జయ మేడంగారి 'వైశాఖం' మూవీ చేశాను. 'పటేల్‌ సర్‌' à°°à±€-రికార్డింగ్‌à°•à°¿ చాలా మంచి పేరు వచ్చింది. అలాగే రీసెంట్‌à°—à°¾ రిలీజైన 'వైశాఖం' సాంగ్స్‌ పెద్ద హిట్‌ అయ్యాయి. నా జీవితంలో తీరని కోరిక ఏంటంటే మ్యూజిక్‌ ఛానెల్స్‌లో టాప్‌ 10 సాంగ్స్‌లో నేను చేసిన సినిమా సాంగ్స్‌ రెండు, మూడు స్టేజిలోనే ఆగిపోయేవి. కానీ 'వైశాఖం'లో రెండు సాంగ్స్‌ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో చాలాసార్లు వచ్చాయి. వస్తున్నాయి. 'వైశాఖం' సాంగ్స్‌ నా జీవిత కోరికను తీర్చింది. à°ˆ సినిమా మ్యూజికల్‌à°—à°¾ పెద్ద హిట్‌ అయినందుకు చాలా సంతృప్తిగా వుంది. రాజుగారి బేనర్‌లో వచ్చే బర్త్‌డే కల్లా ఇంకా రెండు సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను. అలాగే బయటి సినిమాలు కూడా చేస్తాను. 'వైశాఖం' టైటిల్‌ సాంగ్‌, 'భానుమతి..' à°ˆ రెండు సాంగ్స్‌ నా ఫేవరేట్‌. ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్‌. అలాగే 'పటేల్‌ సర్‌'లో 'అవ్వబుచ్చి' సాంగ్‌ కూడా ఇష్టం. à°† పాటకి చాలా మంచి పేరు వచ్చింది. రాజమౌళిగారు ఈమధ్యకాలంలో నాకు నచ్చిన పాట ఇది అని ట్వీట్‌ కూడా పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అన్పించింది.


జయ మేడమ్‌à°•à°¿ థాంక్స్‌!!
యాజ్‌ à°Ž మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే కాకుండా సినిమా పరంగా మ్యూజిక్‌ పరంగా 'వైశాఖం' నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. జయగారు సినిమాని చాలా బాగా తీశారు. సాంగ్స్‌ అన్నీ చాలా రిచ్‌ లొకేషన్స్‌లో తీశారు. చిత్రంలోని అన్ని సాంగ్స్‌ హిట్‌ అవడం నా కెరీర్‌à°•à°¿ మంచి ప్లస్‌ అయ్యింది. జయగారు కాన్సెప్ట్‌ చెప్పగానే చాలా థ్రిల్‌ అయ్యాను. మేడంగారు చెప్పడంతో à°’à°• పాటకి లిరిక్‌ రాశాను. జయ మేడంగారి డైరెక్షన్‌లో చేయడం చాలా ఈజీ. మనకి ఎలాంటి స్ట్రెస్‌ వుండదు. మొత్తం మేడమ్‌గారే తీసుకుంటారు. సిట్చ్యుయేషన్‌ క్లియర్‌à°—à°¾ ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తారు. దానికి ఈజీగా మనం ట్యూన్‌ చెయ్యొచ్చు. నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. చాలా హాయిగా, ఎంజాయ్‌ చేస్తూ à°ˆ సినిమాకి వర్క్‌ చేశాను. జయ మేడం, రాజుగార్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.


త్వరలో à°“ బిగ్‌ మూవీ చేయబోతున్నా!!
'వైశాఖం' మ్యూజికల్‌ హిట్‌ అవడంతో పెద్ద హీరోల చిత్రాలకు మ్యూజిక్‌ చేయమని ఆఫర్స్‌ వస్తున్నాయి. త్వరలో à°’à°• బిగ్‌ మూవీ చేయబోతున్నాను. డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ప్రస్తుతం కొంచెం గ్యాప్‌ తీసుకుని సరదాగా హాలిడే ట్రిప్‌à°•à°¿ à°’à°• నెల వెళ్తున్నాను. వచ్చిన తర్వాత కమిట్‌మెంట్స్‌ వివరాలు చెప్తాను. బేసిగ్గా నేను ట్యూన్స్‌ కంపోజ్‌ చేసాకే లిరిక్స్‌ రాయించుకోవడం ఇష్టం. లిరిక్‌à°•à°¿ ట్యూన్‌ చేయడం కూడా కొంతవరకు బెటర్‌ అని నా ఫీలింగ్‌. రీసెంట్‌à°—à°¾ 'పటేల్‌ సర్‌'లో అలా à°’à°• పాట చేశాను. 'వైశాఖం'లో అన్నీ ట్యూన్స్‌ రెడీ అయ్యాకే లిరిక్స్‌ రాయడం జరిగింది. à°ˆ సంవత్సరం చాలా ఫాస్ట్‌à°—à°¾ జరిగిపోయినట్లు వుంది. ఇలాగే ప్రతి పుట్టినరోజుకి అందర్నీ కలవాలని, మంచి మంచి సినిమాలను చేసి ప్రేక్షకులని అలరించాలని కోరుకుంటున్నాను. అందరి బ్లెస్సింగ్స్‌ నాకు కావాలి. ఇది నా 37à°µ బర్త్‌డే.


ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్‌!!
మా తాత సత్యంగారు మెలోడీ పాటలకి కూడా à°’à°• సెపరేట్‌ బీట్‌తో కంపోజ్‌ చేస్తారు. నేను అది కొంచెం ఫాలో అవుతున్నాను. నా కంటూ సెపరేట్‌ ఇండివిడ్యుయాలిటీ వుండాలని ట్రై చేస్తున్నాను. నేను మణిశర్మగారి మ్యూజిక్‌ వింటూ పెరిగాను. ఆయన పాటలంటే చాలా ఇష్టం. నేను మ్యూజిక్‌ నేర్చుకోవటానికి ఇన్‌స్పిరేషన్‌ మణిశర్మగారే. నాకు ఎప్పటికీ ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆయనే.


దేవిశ్రీగారికి థాంక్స్‌!!
'వైశాఖం' సాంగ్స్‌ అన్నీ దేవిశ్రీప్రసాద్‌గారు విని విజువల్‌à°—à°¾ చూసి పాటలు చాలా బాగున్నాయి. ఎవరు చేశారు? అని బి.à°Ž.రాజుగార్ని అడిగారు. à°† విషయం రాజుగారు చెప్పగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇండస్ట్రీలో à°’à°• లీడింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన à°¡à°¿.ఎస్‌.పి.గారు నేను చేసిన పాటల్ని మెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. à°†à°¯à°¨à°•à°¿ థాంక్స్‌!!

 

వైశాఖంతో నాకొక ఐడెంటిటీ వచ్చింది!!
పరభాషా గాయనీ, గాయకులు వస్తున్నారు. చక్కగా పాడుతున్నారు కానీ మనవాళ్లు కూడా వారికంటే బాగా పాడుతున్నారు. న్యూ టాలెంట్స్‌ చాలా మంది వున్నారు. అందరికీ అవకాశాలు కల్పిస్తూ మంచి సింగర్స్‌à°—à°¾ తీర్చిదిద్దటం అందరి బాధ్యత. మాగ్జిమమ్‌ 99 పర్సెంట్‌ తెలుగు సింగర్స్‌తోనే నేను ఎక్కువగా ఛాన్స్‌ ఇచ్చి పాడిస్తుంటాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌à°•à°¿ తెలుగు భాష క్షుణ్ణంగా తెలిసి వుండాలి. అది చాలా అడ్వాంటేజ్‌ అవుతుంది. అప్పుడే మంచి మ్యూజిక్‌ చేయడానికి ఎక్కువ స్కోప్‌ వుంటుంది. ఇతర భాషలపై కూడా కొంత పట్టు వుండాలి. సంగీతానికి భాషా భేదం లేదు. అది యూనివర్శల్‌. కాబట్టి ఏ భాషలోనైనా సంగీతం చేయవచ్చు. నేను ఇప్పుడు కన్నడ మూవీ à°’à°•à°Ÿà°¿ చేస్తున్నాను!! à°ˆ ఇయర్‌ నేను చేసిన మూడు సినిమాల్లో బాగా పేరొచ్చిన సినిమా 'వైశాఖం'. దానిలో డౌట్‌ ఏమీ లేదు. à°’à°• మ్యూజికల్‌ హిట్‌ అనే ట్యాగ్‌ తగిలిచ్చుకోగలిగింది. à°ˆ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌à°—à°¾ నాకొక ఐడెంటిటీ వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా ఏ రాగాన్ని వదలకుండా మ్యూజిక్‌ చేద్దామని ట్రై చేస్తున్నా. నాకు కర్ణాటక క్లాసికల్‌ సంగీతం బాగా ఇష్టం. ఛాన్స్‌ వస్తే à°† టైపు మ్యూజిక్‌ చేసి అందరి మెప్పు పొందుతాను.


స్పెషల్‌ థాంక్స్‌!!
నిర్మాత బి.à°Ž.రాజు మాట్లాడుతూ - ''మ్యూజిక్‌ డైరెక్టర్‌ వసంత్‌ మా ఫ్యామిలీ మెంబర్‌లాగ. ఆయనకి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 'వైశాఖం' మ్యూజిక్‌ సూపర్‌హిట్‌ అయిన విషయం అందరికీ తెల్సిందే. అన్ని పాటలూ హిట్‌ అవడంతో à°ˆ సినిమా విజయానికి వసంత్‌ మ్యూజిక్‌ ఎంతో హెల్ప్‌ అయ్యింది. ఫస్ట్‌ డివైడ్‌ టాక్‌ వచ్చినా రెండోవారం స్లోగా వున్నా.. మూడోవారం నుండి మా సినిమా బాగా పికప్‌ అయి యాభై రోజులు పూర్తి చేసుకోబోతోంది. త్వరలో యాభై రోజుల ఫంక్షన్‌ చేయబోతున్నాం. à°ˆ సక్సెస్‌ ఇచ్చిన ఆడియన్స్‌à°•à°¿, మా చిత్రానికి ఫస్ట్‌ నుండి ఎంకరేజ్‌ చేస్తున్న మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికీ స్పెషల్‌ థాంక్స్‌'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !