View

సమంతతో 20 నిముషాల డిస్కషన్ గ్రిప్పింగ్ గా ఉంటుంది - నాగ్

Tuesday,October03rd,2017, 08:36 AM

అక్కినేని నాగార్జున‌, స‌మంత‌, శీర‌త్‌క‌పూర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బేన‌ర్స్‌పై ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం రాజుగారి గ‌ది2. సినిమా అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగార్జున మీడియాతో చెప్పిన విశేషాలు...


చైత‌న్య‌, స‌మంత‌ల‌కు అదే చెప్పాను...
- అక్టోబర్‌ నెల నాకు ఎంతో స్పెషల్‌ అవుతోంది. చైతన్య, సమంతకు అక్టోబర్‌ 6న పెళ్లి. ఎగ్జయిటింగ్‌గా ఉంది. సంప్రదాయాన్ని గౌరవించి రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకుంటున్నారు. ఒక దానికి పంచె కట్టుకోవచ్చు. మరో దానికి సూట్‌ వేసుకోవచ్చు(నవ్వుతూ). సాధారణంగా పిల్లను మీరు చూసుకోండ్రా పెళ్లి నేను చేస్తానని చెప్పేవాడిని. పెళ్లి మన ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రమే కూర్చొని సింపుల్‌గా చేసుకుని, రిసెప్షన్‌ గ్రాండ్‌గా చేసుకోవచ్చు అని అనేవాడిని. ముఖ్యంగా ఆర్య సమాజ్‌లో పెళ్లి ఎందుకు చేసుకుంటారంటే, వారు ప్రతి మంత్రానికి, శ్లోకానికి అర్థం చెబుతారు. ఏడు అడుగులు ఎందుకు వేస్తారనే దానికి కూడా అర్థం చెబుతారు. నేను, అమల అలాగే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు వారు చెప్పినవి నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు చైతు, సమంత పెళ్లి ఆర్య సమాజ్‌లో చేస్తానని కాదు కానీ, చైతు, సమంతలకు కూడా పెళ్లి పెద్దలు ఏదో చెప్పమన్నారు కదా అని మంత్రాలు, శ్లోకాలు చెప్పేయకుండా వాటి అర్థాలు తెలుసుకోమని చెప్పాను. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సమక్షంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి వంద మంది కూడా ఉండరు. రిసెప్షన్ డేట్‌ ఇంకా ఫైనలైజ్‌ చేయలేదు. తర్వాత ప్లాన్‌ చేద్దామని అనుకుంటున్నాం.


విఎఫ్ఎక్స్ కార‌ణంగానే ఆల‌స్యం...
- రాజుగారిగది 2 పూర్తయ్యింది. చాలా హ్యాపీ. సినిమాను సెప్టెంబర్‌ 1న చూద్దామని అనుకున్నాను. కానీ నిర్మాణాంతర కార్యక్రమాలు వల్ల అక్టోబర్‌ 2న సినిమా చూశాను. ఒక నెల ఆలస్యం కావడానికి కారణం, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌. సినిమా అవుట్‌పుట్‌ చూసిన తర్వాతే డబ్బింగ్‌ చెబుతానని ముందే చెప్పాను. ప్రెషర్‌ పెడితే కానీ సినిమా అనుకున్న టైంలో మంచి అవుట్‌పుట్‌తో పూర్తయ్యింది. దీనికి కారణం, సినిమా కోసం యూనిట్‌ ఎంత కష్టపడ్డా, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అవసరం. ఎఫెక్స్‌ చాలా బాగా చేశారు. విఎఫ్‌ఎక్స్‌ సరిగ్గా లేకపోతే, ప్రేక్షకుడికి హారర్‌ సినిమా చూసే ఫీల్‌ కలుగదు, సినిమాకు కనెక్ట్‌ కాలేడు. రాజుగారి గది2 సినిమా ముంబైలో ఎఫెక్ట్స్‌ చేశారు. చక్కగా చేశారు. సినిమాలో విఎఫ్‌ఎక్స్‌ లేకపోతే సినిమాలు తొందరగానే పూర్తయిపోతాయి. ఇప్పుడు 'హలో' మూవీ చేస్తున్నాం. విఎఫ్‌ఎక్స్‌తో సినిమాకు పెద్ద‌గా గొడవేలేదు.


కొత్త క్యారెక్ట‌ర్‌లో...
- 'రాజుగారి గది2' సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. సిల్లీ కారణాలు కనపడవు. ఇందులో మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌లో కనపడతాను. ఆత్మకు, నాకు ఉన్న హ్యుమన్‌ రిలేషన్‌ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. కొత్త కథ. నాకు కాన్సెప్ట్‌ నచ్చగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కొత్త డైలాగ్స్‌, కొత్త క్యారెక్టర్‌తో కొత్తగా కనపడతాను. మలయాళం సినిమా నుండి ఇన్‌స్పిరేషన్‌ తీసుకున్నాం. మన స్టయిల్లో కథను మలుచుకున్నాం. అశ్విన్‌, వెన్నెలకిషోర్‌, షకలక శంకర్‌ కామెడీ ట్రాక్‌ చాలా బాగా నవ్విస్తుంది.


స‌మంత క్యారెక్ట‌ర్ గురించి....
- సమంత క్యారెక్టర్‌ చాలా బావుంటుంది. చివరి 20 నిమిషాలు మా ఇద్దరి మధ్య డిస్కషన్‌ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. మనం సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఓ మంచి ఫీలింగ్‌ ఎలా కలిగిందో, ఈ సినిమాకు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. రావురమేష్‌గారు సమంత తండ్రి పాత్రలో కనపడతారు.


మంచి పాత్ర‌లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి...
- మంచి మంచి క్యారెక్టర్స్‌ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా, ఇప్పుడు రాజుగారి గది2 ఇలా మంచి మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. ఓ యాక్టర్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే అన్నీ చక్కగా కుదిరితే నానితో మరో మంచి సినిమా చేస్తాను. అందులో కూడా నా క్యారెక్టర్‌ సూపర్బ్‌గా ఉంటుంది.


`హలో` సినిమా గురించి...
- అక్టోబర్‌ 15న హలో షూటింగ్‌ పూర్తి చేసేస్తానని దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ చెప్పారు. డిసెంబర్‌ 22న సినిమా విడుదలవుతుందని ముందే థియేటర్స్‌కు కూడా చెప్పేసుకున్నాం. డైరెక్టర్‌ విక్రమ్‌కు ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేస్తున్నాను. ఏమైందని అడుగుతున్నాను. బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. సినిమా చాలా బాగా వస్తుంది. ప్రియదర్శిన్‌గారి అమ్మాయి కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ప్రియదర్శిన్‌గారు నాతో, అమలతో నిర్ణయం సినిమా చేశారు. ఈ మధ్య ఆయన నాకు ఫోన్‌ చేసి అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.


అన్న‌పూర్ణ ఫిలిం స్కూల్ నుండి సినిమాలు వ‌స్తాయి...
- అన్నపూర్ణ ఫిలిం స్కూల్‌లో స్క్రిప్ట్‌ విభాగాన్ని ఒకదాన్ని రెడీ చేశాం. దానికంటూ కొంత ఫండ్‌ కేటాయించాం. ఫిలిం స్కూల్‌ స్టూడెంట్సే స్క్రిప్ట్‌ తయారు చేస్తారు. వాళ్లే నటీనటులు, దర్శకులు, టెక్నికల్‌ టీంగా వ్యవహరిస్తారు. మా స్టూడియో నుండి సినిమాను నిర్మిస్తాం. ఈ ప్రాసెస్‌ వచ్చే ఏడాది నుండి ప్రారంభం అవుతుంది. స్టూడెంట్స్‌ కోసం క్వాలిటీ ఫ్యాక్టలీస్‌ను తీసుకొస్తున్నాం. అలాగే గెస్ట్‌ లెక్చరర్స్‌ కూడా ఉన్నారు. అమల కూడా తన సమయాన్ని స్కూల్‌కు కేటాయిస్తుంది. లెటెస్ట్‌ టెక్నాలజీ తెలుసుకోవాలని అమల మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఓ బాలీవుడ్‌ సినిమాలో నటిస్తుంది.


చందు మొండేటితో సినిమా చేస్తా...
- చందు మొండేటితో తప్పకుండా సినిమా చేస్తాను. తను నాకు పెద్ద ఫ్యాన్‌. తనని అభిమానిలా కాకుండా డైరెక్టర్‌లా సినిమా చేద్దామని అన్నాను. పోలీస్‌ క్యారెక్టర్‌ స్టోరీ చెప్పాడు. అలాగే సవ్యసాచి కథ కూడా విన్నాను. స్టోరీ లైన్‌ ఎంతో బావుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !