View

ఇంటర్య్వూ - నిర్మాత ఎ.మహేష్ రెడ్డి (ఓం నమో వేంకటేశాయ)

Thursday,February02nd,2017, 10:35 AM

వ్యాపార రంగంలో అంచెలంచెలగా ఎదిగి à°Ž.à°Žà°‚.ఆర్‌. గ్రూప్‌ సంస్థను స్థాపించి నాలుగు వేల మందికి పైగా జీవనోపాధిని కల్పిస్తూ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌à°—à°¾ రాణిస్తున్నారు à°Ž.à°Žà°‚.ఆర్‌. గ్రూప్‌ అధినేత à°Ž.మహేష్‌రెడ్డి. స్వతహాగా బాబాకి పరమ భక్తుడైన మహేష్‌రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి అక్కినేని నాగార్జున-దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 'షిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించి నిర్మాతగా మహేష్‌రెడ్డి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కొంత విరామం తర్వాత అక్కినేని నాగార్జున-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తూ హాథీరాం బాబా జీవిత కథతో 'à°“à°‚ నమో వేంకటేశాయ' చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రం ఫిబ్రవరి 10à°¨ వరల్డ్‌వైడ్‌à°—à°¾ రిలీజ్‌ కాబోతోంది. à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత, సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. అధినేత à°Ž.మహేష్‌రెడ్డితో ఇంటర్వ్యూ..


ఈ సినిమా ముఖ్య కథాంశం ఏమిటి?
- గోవిందుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడైన హాథీరామ్‌ బాబాజీ పుణ్య చరిత్రే à°ˆ సినిమా మెయిన్‌ కథాంశం. వేంకటేశ్వర స్వామికి హాథీరామ్‌ బాబాజీకి మధ్య జరిగే డ్రామాని à°ˆ సినిమాలో చూపించాం. ఆయనతో పాటు కృష్ణమ్మ చరిత్రను కూడా ఈసినిమాలో ఎలా వుంటుందో చూపించాం. తిరుపతి కొండపైన హాథీరాం బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసారు? పూజలు, పునస్కారాలు, వెన్నతో దీపం వెలిగించడం, అక్కడ అడ్మినిస్ట్రేషన్‌ ఎలా వుంటుందనేది సినిమాలో క్లియర్‌à°—à°¾ చూపించాం. ఆయనకి హాథీరాం బాబా అనే పేరు ఎలా వచ్చింది? అనేది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే.


à°ˆ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
- à°ˆ కథని ఫస్ట్‌ జె.కె.భారవిగారు రాఘవేంద్రరావుగారికి చెప్పారు. ఆయనకి బాగా నచ్చడంతో సినిమా తియ్యాలనుకున్నారు. à°ˆ ప్రాజెక్ట్‌ గురించి నాకు చెప్పగానే వెంటనే ఇమ్మీడియెట్‌à°—à°¾ నేను తీస్తాను అని చెప్పాను. బాబా భక్తుడైన నేను నాగార్జున-రాఘవేంద్రరావుగారి కాంబినేషన్‌లో 'షిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించాను. à°† చిత్రంతో నేను, నాగార్జున బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. మా కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సినిమా తియ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా కోరిక à°ˆ సినిమాతో తీరింది.


à°ˆ సినిమా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది?
- నేను పెద్దగా సెట్‌à°•à°¿ వెళ్లలేదు. నా ఫ్రెండ్‌ విక్రమ్‌ à°ˆ సినిమా అంతా చూసుకున్నాడు. నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ రోజువారి పనుల్లో బిజీగా గడిపేస్తున్నాం. వేంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెల్సు. ఇప్పుడున్న యంగ్‌ జనరేషన్‌à°•à°¿ పెద్దగా తెలియకపోవచ్చు. తిరుపతిలో కొండపై జరిగే పూజలు అందరికీ తెలియాలి. హాథీరాం బాబా జీవితం గురించి కొంతమందికే తెల్సు. à°ˆ సినిమా రిలీజ్‌ ప్రపంచమంతా తెలుస్తుంది. సినిమా రిలీజ్‌ తర్వాత ఎన్నో వేల మంది తిరుపతికి వెళ్తారు అనేది మా ఉద్దేశం. టైటిల్‌ పైన హాథీరాం బాబా అని ఎందుకు పెట్టలేదు అని నన్ను చాలామంది అడిగారు. కానీ 'à°“à°‚ నమో వేంకటేశాయ' అనేది సినిమాలో చిన్న బీజియంలా వస్తుంది. అది ఎన్నిసార్లు పలికితే à°…à°‚à°¤ మంచి జరుగుతుంది. అందుకే 'à°“à°‚ నమో వేంకటేశాయ' అని టైటిల్‌ పెట్టాం.


రష్‌ చూసి మీరు ఎలా ఫీలయ్యారు?
- à°°à±€-రికార్డింగ్‌ లేకుండా నేను సినిమా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తుంటే నా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఇలాంటి అద్భుతమైన చిత్రానికి నేను నిర్మాతనైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను.


టెక్నికల్‌à°—à°¾ à°ˆ చిత్రం ఎలా వుంటుంది?
- 500 సంవత్సరాల క్రితం తిరుపతి ఎలా ఉండేదో అలా నేచురల్‌à°—à°¾ షూటింగ్‌ చేయడానికి టెక్నికల్‌à°—à°¾ చాలా జాగ్రత్యలు తీసుకున్నాం. ముఖ్యంగా గోపాల్‌రెడ్డిగారు చిక్‌ మంగళూరులోని స్మాల్‌ విలేజెస్‌లో లొకేషన్స్‌ ఫైనల్‌ చేశారు. à°† గోవిందుడు మా యందు ఉండి షూటింగ్‌ అంతా చక్కగా జరిపించుకున్నాడు. వాటర్‌ ఫాల్స్‌, చిన్న చిన్న సీన్స్‌లో సి.జి. వర్క్‌ వుంటుంది తప్ప ఎక్కువగా గ్రాఫిక్స్‌ వుండవు. à°…à°‚à°¤ నేచురల్‌à°—à°¾ సినిమా వుంటుంది.


నాగార్జునతో 'షిరిడిసాయి', ఇప్పుడు 'ఓం నమో వేంకటేశాయ' చేశారు?
- అవునండీ. 'మనం', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' వంటి బిగ్‌ కమర్షియల్‌ హిట్స్‌ సాధించి కూడా నాగార్జున à°ˆ సినిమా చేయడం మా అదృష్టం. ఆయన గొప్పతనం. భక్తి సినిమాలు చేయడం ఆయనకి చాలా ఈజీ. à°ˆ సినిమాని చాలా నిక్కచ్చిగా ఆహారపు అలవాట్లు అన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చేశాను. ఏ సినిమా ఒప్పుకోకుండా గెడ్డం పెంచి à°ˆ సినిమాకే వర్క్‌ చేశారు ఆయన.


రాఘవేంద్రరావుగారితో వర్క్‌ చేయడం ఎలా వుంది?
- గ్రేట్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారితో మా గురువు 'షిరిడిసాయి' సినిమా తీశాను. ఇప్పుడు మా కులదైవం వేంకటేశ్వర స్వామి సినిమా తీసే అవకాశం కల్పించిన రాఘవేంద్రరావుగారికి, నాగార్జునగారికి జీవితాంతం రుణపడి వుంటాను. వ్యాపార పరంగా కాకుండా సినిమాల విషయంలో à°’à°• భక్తుడిగా శాటిస్‌ఫై అవుతాను. జనరల్‌à°—à°¾ కమర్షియల్‌ సినిమాలకి తప్ప దేవుడి సినిమాలకి ఇంత ఎక్కువ ఎవరూ ఖర్చు పెట్టరు. కానీ క్వాలిటీ పరంగా, ఆర్టిస్ట్‌లు పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా à°ˆ సినిమా తీశాం.


ఈ సినిమా మీకు ఎలాంటి గుర్తింపు తెస్తుందని అనుకుంటున్నారు?
- మా à°Ž.à°Žà°‚.ఆర్‌. గ్రూప్‌ సంస్థలో 4000 మంది వర్క్‌ చేస్తారు. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. 'షిరిడిసాయి' తర్వాత ఎక్కడికి వెళ్లినా గుర్తు పట్టి పలకరించారు. టీవిల్లో సినిమా బాగా ఆడింది. à°† సినిమా వచ్చినప్పుడల్లా 50,60 ఫోన్‌ కాల్స్‌ ఇప్పటికీ వస్తాయి. 'à°“à°‚ నమో వేంకటేశాయ' తర్వాత కూడా ఎక్కువ రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాను.


వేంకటేశ్వర స్వామి క్యారెక్టర్‌లో సౌరభ్‌ జైన్‌ని ఎంపిక చేయడానికి రీజన్‌?
- చాలామందిని అనుకున్న తర్వాత గోపాల్‌రెడ్డిగారు సౌరభ్‌ జైన్‌ని తీసుకొచ్చాడు. అతను నేను కమర్షియల్‌ చేస్తున్నాను. నాకు మంచి నేమ్‌ వుంది. దేవుడిగా చెయ్యను అన్నారు. అప్పుడు నాగార్జునగారు మూడు కమర్షియల్‌ హిట్స్‌ తర్వాత నేను à°ˆ సినిమా చేస్తున్నాను. నీకు మంచి పేరు వస్తుంది. à°† తర్వాత కమర్షియల్‌ సినిమాలు చేయొచ్చు అని చెప్పగానే ఇమ్మీడియెట్‌à°—à°¾ చేస్తాను అని ఒప్పుకున్నాడు సౌరభ్‌. వేంకటేశ్వర స్వామిగా చాలా యంగ్‌à°—à°¾ అందంగా నటించాడు.


ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుంది?
- నాగార్జున-రాఘవేంద్రరావు, కీరవాణిలది మ్యూజికల్‌ హిట్‌ కాంబినేషన్‌. వారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు అన్నీ మ్యూజికల్‌à°—à°¾ పెద్ద హిట్‌ అయ్యాయి. à°’à°• ప్రక్క 'బాహుబలి-2'à°•à°¿ వర్క్‌ చేస్తూ కూడా à°ˆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్‌ని కంపోజ్‌ చేశారు. à°°à±€-రికార్డింగ్‌ మహాద్భుతంగా చేశారు. ఆడియో విన్నాక కీరవాణిగారికి లైఫ్‌లాంగ్‌ రుణపడి వుంటాను సార్‌ అని చెప్పాను. à°’à°• భక్తి భావంతో ఆయన పాటల్ని కంపోజ్‌ చేశారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !