View

ఇంటర్య్వూ- శ్రీనివాస రెడ్డి (భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు) 

Wednesday,December04th,2019, 08:57 AM

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డితో ఇంట‌ర్వ్యూ..


ద‌ర్శ‌కుడిగా ఎలా? ఎందుకు మారారు?
- త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీని ప్రొడ్యూస్ చేయాల‌ని చాలా రోజులుగా అనుకునేవాడిని. అలాంటి స‌మ‌యంలో నేను చేయాల్సిన ఓ సినిమా 20 రోజుల పాటు వాయిదా ప‌డింది. ఆ స‌మ‌యంలో నాతో జ‌యమ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమా చేసిన ప‌రం చెప్పిన పాయింట్ మీద క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాం. క‌థ చాలా బాగా వ‌చ్చింది. దాంతో సినిమా మా క‌మెడియ‌న్స్ గ్రూప్ ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకున్నాను. అయితే చాలా మంది క‌మెడియ‌న్స్ వ‌స్తే కొత్త ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేస్తాడో లేదోన‌నిపించింది. అందుక‌నే నేనే సినిమాను డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాను. నేను ద‌ర్శ‌క నిర్మాత‌గా చేయ‌బోయే సినిమా గురించి మా ఆర్టిస్టుల‌కు చెప్పగానే త‌మ నుండి ఎలాంటి సాయం కావాల‌న్నా చేస్తామ‌ని అన్నారు. నేను వారికి ఎలాంటి రెమ్యున‌రేష‌న్స్ ఇవ్వ‌లేదు. ఓన్ రిలీజ్ చేస్తుండ‌టం వ‌ల్ల రిలీజ్ త‌ర్వాతే డ‌బ్బులు తీసుకుంటామ‌ని అంద‌రూ అన్నారు. అలా నేను భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు సినిమాకు డైరెక్ట‌ర్‌గా మారాను. 


మీరే ద‌ర్శ‌క నిర్మాత అన్నారుగా విమ‌ర్శ‌లు వ‌స్తాయేమోన‌ని అనుకోలేదా?
- సినిమా ఎలాగో ఉంటుంద‌ని అనుకుని చేయ‌లేదు. ముందుగా నాకున్న నాలెడ్జ్‌లో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌గ‌ల‌మ‌ని భావించి రాసుకున్న క‌థ‌. ప్రీ వ‌ర్క్ బాగా చేశాం. నేను, ప‌టేల్ అనే రైట‌ర్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్‌పై న‌మ్మ‌కంగా ఉన్నాం. ఈ క‌థ‌ను విన్న‌వాళ్లెవ‌రూ ఎందుకులే అన్నా! క‌థ‌లో అంత ద‌మ్ములేదు అనలేదు. ఇంట్లోవాళ్లకి కూడా క‌థ వినిపించాను. అనిల్ రావిపూడిగారికి కూడా క‌థ వినిపించాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. జాగ్ర‌త్త‌గా చేసుకుంటే బావుంటుంద‌నే స‌ల‌హా ఇచ్చారంద‌రూ. మ‌న విజువ‌లైజేష‌న్ వేరుగా ఉంటుంది. ప్రాక్టికల్‌గా వేరుగా ఉంటుంది. అన్ని ఓ ప్రాసెస్‌లా నేర్చుకుంటూ వ‌చ్చాను. దిల్‌రాజుగారు, ట్రైల‌ర్ క‌ట్ చేసిన స‌ల‌హాలు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంత ఆర్టిస్టుల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌థ‌లోకి తీసుకెళ్లడం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు..ఆసాంతం ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వుతారు.


మెయిన్ పాయింట్ ఏంటి?
- స‌ర్వైవ‌ల్ ప్రాబ్ల‌మ్ ఒక‌రికి, మ‌రొక‌రికి లాట‌రీ టికెట్స్ పిచ్చి ఉంటుంది. ఇలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సినిమా సాగుతుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన‌ చాలా విష‌యాల‌ను మా సినిమాలో ఎంట‌ర్‌టైనింగ్ వేలో చెప్పాం. ఉదాహ‌ర‌ణ‌కి శివాజీగారి ఆప‌రేష‌న్ గ‌రుడ‌వేగ ఉంది. దాన్ని శివాజీగారు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం బావుంది. దాన్ని మా సినిమాలో ఉప‌యోగించుకున్నాం. ఓంకార్‌గారి వ‌న్ మినిట్ సీన్‌ ఉంది. సృజ‌న‌, ప్రియాప్ర‌కాష్, బ్ర‌తుకు ఎడ్ల‌బ‌డ్ల‌లాంటి సీన్‌, ర‌స‌గుల్లాలాంటి సీన్స్ ఇలా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. ఒక‌రోజులో జ‌రిగే క‌థ ఇది. దేన్ని మిస్ చేయ‌కూడ‌ద‌ని తొలి స‌న్నివేశాన్ని మా నాన్న‌గారిపై తీశాను. సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత ఆయ‌న క‌న్నుమూశారు. మా ఆయ‌న‌కు డ‌బ్బింగ్‌ను మ‌హ‌ర్షి సినిమాలో రైతు పాత్ర చేసిన గురుస్వామిగారు చెప్పారు. మాద‌క ద్ర‌వ్యాల ముఠాను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ప‌ట్టుకోవాల‌నుకుంటే దాంట్లోకి మేం ఎలా ఇరుక్కున్నామ‌నేదే క‌థ‌. నేను, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధానంగా న‌టించాం. 


అంత మంది న‌టీన‌టుల‌ను ఎలా హ్యాండిల్ చేశారు?
- అంద‌రూ నా స్నేహితులే కావ‌డంతో ఓ స‌న్నివేశంలో న‌టించారు. వాళ్లు కూడా కొన్ని ఇంప్ర‌వైజేష‌న్స్ చెప్పారు. అవి న‌చ్చితే చేసుకుంటూ వెళ్లాం. షాట్ డివిజ‌న్ కూడా చేశాం. హైద‌రాబాద్ సిటీలోనే ఎక్కువ షూటింగ్ చేశాం. ఓ ద‌శ‌లో ఈ క‌థలోని క్యారెక్ట‌ర్స్ రోడ్ల పైకి వ‌చ్చేస్తాయి. 


ఈ  క‌థ‌కు ఇన్‌స్పిరేష‌న్ ఉందా?
- ప‌ర్టికుల‌ర్ ఇన్‌స్పిరేష‌న్ అంటూ ఏమీ లేదు. ఉదాహ‌ర‌ణ‌కు రాంగోపాల్ వ‌ర్మ‌గారి క్యారెక్ట‌ర్‌ను వెన్నెల కిషోర్‌గారికి ఇంప్లిమెంట్ చేశాం. 


మీ మేన‌ల్లుడు పాత్ర ఎలా ఉంటుంది?
- మా మేన‌ల్లుడు సుజిత్‌, ఇందులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడు. డ‌గ్స్ర్‌కి బానిసైన యువ‌కుడిగా క‌న‌ప‌డ‌తాడు. యూత్‌కు వెళ్లాల్సిన మెసేజ్ త‌న ద్వారానే వెళుతుంది. 


ద‌ర్శ‌క నిర్మాత‌గా చేయ‌డం వ‌ల్ల మీరు సినిమాలు మిస్ అయ్యార‌ని అనుకుంటున్నారా?
- ఆర్టిస్ట్‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత రోల్స్‌లో నాకు ఆర్టిస్ట్‌గా ఉండ‌టమే ఇష్టం. ఈ సినిమా కోసం ద‌ర్శ‌క నిర్మాత‌గా మారడం వ‌ల్ల స‌రిలేరు నీకెవ్వ‌రు చేయ‌లేక‌పోయాను. అయితే మ‌హ‌ర్షి సినిమా కోసం గ్యాప్ తీసుకెళ్ళి న‌టించాను. ఆర్టిస్ట్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంజాయ్ చేశాను. డైరెక్ట‌ర్‌గా నేనేం చేశాన‌నేది నాకు తెలుసు. ఆర్టిస్ట్‌గా ఎక్క‌డా ఆగే స‌మ‌స్య లేదు. ఆల్ రెడీ న‌టుడిగా నాలుగైదు సినిమాల‌ను క‌మిట్ అయ్యాను. 


ప్ర‌స్తుతం న‌టుడిగా చేస్తున్న సినిమాలేవీ?
- బాల‌కృష్ణ‌గారి రూల‌ర్‌ లో న‌టించాను. క‌ల్యాణ్‌రామ్‌, మ‌ల్లిడి వేణు కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమాలో న‌టించ‌బోతున్నాను. మ‌రికొన్ని డిస్క‌ష‌న్స్ ఉన్నాయి. ఇక డైరెక్ట‌ర్‌గా చూస్తే.. నేను బేసిగ్గా క‌మెడియ‌న్‌ని కాబ‌ట్టి డైరెక్ట‌ర్‌గా కూడా ఆడియెన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికే ప్ర‌య‌త్నిస్తాను. 


సినిమా మేకింగ్‌లో ఎలాంటి స‌పోర్ట్ ల‌భించింది.. ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది?
- సినిమా తెర‌కెక్కించిన త‌ర్వాతే కాదు..ముందు నుండి చాలా కాన్ఫిడెంట్‌గానే ముందుకెళ్లాం. అంద‌రూ త‌మ వంతు స‌పోర్ట్ చేశారు. ట్రైల‌ర్ చూసి రాజ‌మౌళిగారు ట్వీట్ చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌గారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమా పూర్త‌యిన త‌ర్వాత దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, మా కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఈ సినిమాను చూశారు. అంద‌రికీ సినిమా బాగా న‌చ్చింది. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !