View

ఇంటర్య్వూ - రాజ్ తరుణ్ (రంగుల రాట్నం)

Friday,January05th,2018, 03:14 PM

2017లో 'రారండోయ్‌', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌. తాజాగా రాజ్‌తరుణ్‌ హీరోగా చిత్ర శుక్లా హీరోయిన్‌గా శ్రీరంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రంగులరాట్నం'. ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో రాజ్‌తరుణ్‌ జనవరి 4న హైదరాబాద్‌ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు.


ఇటీవల రిలీజ్‌ అయిన 'రంగులరాట్నం' ట్రైలర్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- షూటింగ్‌ అంతా ఫినిష్‌ అయ్యాక చిన్న సర్‌ప్రైజ్‌గా సంక్రాంతికి వస్తున్నాం. ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మేము ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. మా సినిమాకి ఇంత క్రేజ్‌ రావడానికి ప్రెస్‌వారే ముఖ్య కారణం.


ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
- సుప్రియగారు సడెన్‌గా ఒకరోజు కాల్‌ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్నాక ఇమ్మీడియెట్‌గా ఒప్పుకున్నాను. నాకు బాగా నచ్చింది. అలా ఈ చిత్రం స్టార్ట్‌ అయ్యింది.


మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి. జనరల్‌గా అందరిలాగే వుంటాడు. కానీ సెలెక్ట్‌ పర్సన్‌. నా లుక్‌, గెటప్‌ అంతా చాలా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో కంటే 'రంగులరాట్నం'లో చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా.


అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ ఎలా వున్నాయి?
- నా ఫస్ట్‌ సినిమా 'ఉయ్యాలా జంపాలా' చేసేటప్పుడు నేను డైరెక్షన్‌ ఫీల్డ్‌లో వున్నాను. అప్పుడు చిన్న టెన్షన్‌ వుండేది. ఇప్పుడు నేను హీరోగా చేస్తున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌లాంటి పెద్ద సంస్థలో చేస్తున్నప్పుడు చాలా ధైర్యంగా వుంటుంది. అందరూ కొత్తవాళ్ళు అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేశాను. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది.


సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి కదా? మీ సినిమా రిలీజ్‌ అవుతుంది. కాంపిటీషన్‌గా ఫీలవుతున్నాం?
- లాస్ట్‌ ఇయర్‌ సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాలు వచ్చి సక్సెస్‌ అయ్యాయి. కాంపిటీషన్‌ అనేది ఎప్పుడూ ప్రతివారం వుంటుంది. హాలిడేస్‌ వున్నాయి. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌ వెళ్ళి సినిమా చూస్తారు. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుని ఎంజాయ్‌ చేసేలా మా చిత్రం వుంటుంది. సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే అన్ని సినిమాలు బాగా ఆడాలి. ప్రేక్షకులను అలరించాలి. అందులో మా చిత్రం కూడా వుండాలని కోరుకుంటున్నాను.


ఈ కథలో మీకు అంతగా నచ్చిన అంశం ఏమిటి?
- ఇట్స్‌ ఎ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి. మదర్‌ సెంటిమెంట్‌. ఇద్దరు ప్రేమికుల మధ్య వచ్చే లవ్‌సీన్స్‌ అన్నీ చాలా ఫ్రెష్‌గా వుంటాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా వుంటుంది.


లేడీ డైరెక్టర్‌తో వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?
- మేల్‌, ఫిమేల్‌ అని తేడా వుండదు. డైరెక్టర్‌ ఈజ్‌ డైరెక్టర్‌. స్క్రిప్ట్‌ రాశాక వారి పాయింట్‌ వ్యూలో కొన్ని థాట్స్‌ వుంటాయి. దానికి తగ్గట్లుగా సినిమా చేశారు. శ్రీరంజని సెల్వరాఘవన్‌ వద్ద చాలాకాలం పని చేసింది. డైరెక్టర్‌ గురించి బాగా తెల్సు. వెరీ ప్యాషనేట్‌ డైరెక్టర్‌. కమాండింగ్‌గా వుంటుంది. తనకేం కావాలో చాలా పర్టిక్యులర్‌గా వుంటుంది. డైరెక్టర్‌కి కావాల్సిన క్వాలిటీస్‌ అన్నీ శ్రీరంజనిలో వున్నాయి.


ఈ చిత్రంలో మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంతవరకు వుంది?
- వన్స్‌ కథ విన్నాక నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఏమీ వుండదు. ఒకవేళ ఏదన్నా సలహాలు అడిగితే చెప్తాను.


ట్రైలర్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అసలు మేము ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. ట్రైలర్‌కి సోషల్‌ మీడియాలో హైయ్యస్ట్‌ వ్యూస్‌ రావడం చాలా ఆనందంగా వుంది.


'రంగులరాట్నం' టైటిల్‌ పెట్టడానికి రీజన్‌ ఏంటి?
- చాలా టైటిల్స్‌ అనుకున్నాం కానీ ఏదీ సెట్‌ కాలేదు. కథలోంచి టైటిల్‌ వుంటే బాగుంటుందని అందరం డిస్కస్‌ చేసుకుని 'రంగులరాట్నం' అని పెట్టాం. కథకి యాప్ట్‌ టైటిల్‌.


మ్యూజికల్‌గా ఎలా వుంటుంది?
- 'క్షణం'కి మ్యూజిక్‌ చేసిన శ్రీచరణ్‌ ఈ చిత్రానికి బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ని కంపోజ్‌ చేశారు. ఆరు పాటలు ఎక్స్‌లెంట్‌గా వున్నాయి. చాలా కొత్త సౌండింగ్‌తో ట్యూన్స్‌ కంపోజ్‌ చేశాడు శ్రీచరణ్‌. నేను కూడా ఇందులో ఒక పాట రాశాను. రీ-రికార్డింగ్‌ వండ్రఫుల్‌గా చేశాడు. శ్రీచరణ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి చాలా హెల్ప్‌ అవుతుంది.


హీరోయిన్‌ క్యారెక్టర్‌ గురించి?
- చిత్ర శుక్లా ఫస్ట్‌టైమ్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తుంది. ఎక్కువ రెస్పాన్స్‌బులిటీస్‌ వున్న అమ్మాయి క్యారెక్టర్‌ని ప్లే చేసింది. అల్లరి చిల్లరగా తిరుగుతూ సెటిల్‌ అయిన ఓ అబ్బాయి, అమ్మాయిల మధ్య లవ్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది అనేది కథ. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా కథ సాగుతుంది.


ఈ సినిమా మీకు ఎలాంటి బ్రేక్‌ తెస్తుంది?
- ప్యూర్‌ లవ్‌స్టోరి. యూత్‌, ఫ్యామిలీస్‌ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఈ చిత్రం వుంటుంది. ఆల్‌రెడీ నేను ఫస్ట్‌కాపీ చూశాను. నాకు బాగా నచ్చింది. డెఫినెట్‌గా ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.


అదర్‌ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్స్‌ గురించి?
- సితారగారు నాకు మదర్‌ క్యారెక్టర్‌లో నటించారు. ప్రియదర్శి నా ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో నటించాడు. చాలా రియలిస్టిక్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా కామెడీ వుంటుంది. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది.


రాజ్‌తరుణ్‌, చిత్ర శుక్లా నటించిన ఈ చిత్రంలో సితార, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ: ఎల్‌.కె.విజయ్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ఆర్ట్‌: పురుషోత్తం ఎం, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, దర్శకత్వం: శ్రీరంజని.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !