View

ఇంటర్య్వూ - వి.వి.వినాయక్ (ఇంటిలిజెంట్)

Wednesday,February07th,2018, 03:22 PM

యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగల దమ్మున్న డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. 'ఆది, దిల్‌, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్‌, లక్ష్మి, కృష్ణ, బన్నీ, అదుర్స్‌, నాయక్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్‌ లేటెస్టుగా 'ఇంటెలిజెంట్‌' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌కి, సాంగ్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా కూడా గ్యారెంటీగా హిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ కాన్ఫిడెంట్‌గా చెప్తోంది. సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరాయిన్‌ గా సి. కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం ఫి˜బ్రవరి 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.


- సినిమా ఫస్ట్‌ కాపీ చూసుకున్నాక ఎలా ఫీీల్‌ అయ్యారు?
- నిన్ననే సినిమా అంతా చూసుకుని అందరం చాలా ఆనందంగా, హ్యాపీగా ఫీల్‌ అయ్యాం. ఖచ్చితంగా సూపర్‌హిట్‌ కొడతామని నమ్మకంతో వున్నాం. బేసిగ్గా ఇది మంచి హ్యూమర్‌, కామెడీ, యాక్షన్‌, బ్యూటిఫుల్‌ సాంగ్స్‌ వున్న పక్కా కమర్షియల్‌ మూవీ. రీసెంట్‌గా సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సభ్యులంతా సినిమా చూసి చాలా బాగుంది అని అప్రిషియేట్‌ చేశారు.


- ఆడియోకి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది?
- 'నాయక్‌' సినిమా తర్వాత మళ్ళీ థమన్‌తో కలిసి వర్క్‌ చేశాను. నాయక్‌ ఆడియోతో పాటు సినిమా కూడా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. 'ఇంటిలిజెంట్‌'కి థమన్‌ ఎక్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. నాలుగు సాంగ్స్‌ సూపర్‌హిట్‌ అయ్యాయి. రీరికార్డింగ్‌ అద్భుతంగా చేశాడు.


నిర్మాత సి.కళ్యాణ్‌ మేకింగ్‌ ఎలా వుంది?
- నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వున్నప్పటి నుండి నాకు కళ్యాణ్‌గారు తెలుసు. ఇద్దరం ఫ్రెండ్స్‌లాగా వుంటాం. ఎప్పుడు షూటింగ్‌ జరిగినా ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్నీ సమకూర్చి అన్‌కాంప్రమైజ్డ్‌గా ఎంతో ఖర్చు పెట్టి చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో 'ఇంటిలిజెంట్‌' సినిమా పెద్ద హిట్‌ చిత్రంగా నిలుస్తుందని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాను. జనరల్‌గా నేను అందర్నీ బాగా చూసుకుంటాను. అలాంటి నన్ను ఒక గాజు బొమ్మలాగా కళ్యాణ్‌గారు చూసుకున్నారు. ప్రొడక్షన్‌ సైడ్‌ ఎలాంటి ప్రాబ్లెమ్స్‌ లేకుండా సి.వి.రావు, పత్స నాగరాజా ఎంతగానో సపోర్ట్‌ చేశారు.


సాయిధరమ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ వుండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా తేజ్‌ తన స్టైల్‌లో బాగా చేశాడు. కామెడీ, యాక్షన్‌ సీన్స్‌లలో అద్భుతంగా చేశాడు. పర్టిక్యులర్‌గా కొన్ని షాట్స్‌లో అచ్చం చిరంజీవిగారిలా కన్పించాడు. సాయి అంతకు ముందు చేసిన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి. డ్యాన్స్‌లు ఇరగదీశాడు. శేఖర్‌, జానీ మాస్టర్స్‌ ఎంతో కష్టపడి రిహార్సల్స్‌ చేశారు. అందులోని బెస్ట్‌ మూవ్‌మెంట్స్‌ని సెలెక్ట్‌ చేసుకుని చేశాం.


ఈ సినిమా మెయిన్‌ కథాంశం ఏమిటి?
- విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తూ... తనకి సాయం చేసిన ఒక గాడ్‌ఫాదర్‌ లాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే అతని కోసం హీరో ఎలా రియాక్ట్‌ అయ్యాడు? విలన్‌ మీద ఎలా పోరాడాడు? అనేది మెయిన్‌ కథాంశం. ఒక చిన్న మైండ్‌గేమ్‌ని హీరో 'ఇంటిలిజెంట్‌'గా ఎలా డీల్‌ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది.


'చమక్‌ చమక్‌' సాంగ్‌ని రీమిక్స్‌ చేయాలన్న థాట్‌ ఎవరిది?
- అన్నయ్య సినిమాల్లోని నాకు చాలా ఇష్టమైన పాట అది. 'చమక్‌ చమక్‌' పాట పెట్టాలని అందరం అనుకున్నాం. కళ్యాణ్‌గారు ఇళయరాజాగారిని అప్రోచ్‌ అయ్యి ఈ పాట రీమిక్స్‌ గురించి అడగ్గానే ఆయన చాలా ఆనందంగా స్పందించి ఓకే చేశారు. ఈ పాటని రోమన్‌లో అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఒరిజినల్‌ పాటకి ఏమాత్రం తీసిపోని విధంగా వుంటుంది.


హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి గురించి?
- ఫస్ట్‌టైమ్‌ ఫుల్‌ కమర్షియల్‌ మూవీలో లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమాతో లావణ్య పెద్ద కమర్షియల్‌ హీరోయిన్‌ అవుతుంది. సంధ్య క్యారెక్టర్‌లో లావణ్య ఫెంటాస్టిక్‌గా పెర్‌ఫార్మ్‌ చేసింది. డ్యాన్స్‌లు కూడా బాగా చేసింది.


'అదుర్స్‌-2' సినిమా ఎప్పుడు?
- రెండు మూడు కథలు అనుకున్నాం. కానీ మేం శాటిస్‌ఫై అయ్యేంతగా అన్పించలేదు. అదుర్స్‌ సినిమాని మించి 'అదుర్స్‌-2' తీయాలని మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాను. తప్పకుండా 'అదుర్స్‌-2' చేస్తాను.


మహేష్‌తో సినిమా ఎప్పుడు?
- మా కాంబినేషన్‌లో తప్పకుండా సినిమా వుంటుంది. మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాం.


ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసే ఉద్దేశం వుందా?
- నాకు కొన్ని ఐడియాలు వున్నాయి. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ మంచి కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ తీయాలని ప్లాన్‌ చేస్తున్నాను. అదీ రెండు సంవత్సరాల తర్వాత ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేస్తాను.


మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటి?
- ఇంకా ఏం కమిట్‌ కాలేదు. ప్రస్తుతానికి 'ఇంటిలిజెంట్‌' మీదే నా ఫోకస్‌ అంతా వుంది. రెండు నెలలు గ్యాప్‌ తీసుకుని నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా గురించి ఆలోచిస్తాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !