filmybuzz
filmybuzz

View

భరత్ ని అందుకే చూడలేదంటున్న రవితేజ!

Sunday,July02nd,2017, 01:05 AM

మాస్ మహారాజా రవితేజ తమ్ముడు భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. తమ్ముడిని చివరి చూపులు కూడా చూడకపోవడం, అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో రవితేజ నిందలపాలయ్యాడు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రవితేజ గురించి వార్తలు హల్ చల్ చేసాయి. కొంతమంది విమర్శలు చేస్తే, కొంతమంది రవితేజ గురించి సానుకూలంగా వార్తలు రాసారు. అయితే అసలు విషయం ఏంటనేది మాత్రం తెలియలేదు. దీనికి సంబంధించి సాక్షి డైలీకి ఎక్స్ క్య్లూజివ్ ఇంటర్య్వూ ఇచ్చారు రవితేజ. ఎందుకు తమ్ముడు అంత్యక్రియలకు హాజరవ్వలేదో, తమ్ముడితో తనకున్న అనుబంధం... ఇలా పలు విషయాలను పంచుకున్నారు.


షాక్ అయ్యాం...
''యాక్సిడెంట్ అయ్యింది... భరత్ చనిపోయాడు'' అనే వార్త వినగానే మొత్తం కుటుంబం షాక్ అయ్యాము. 85యేళ్ల మా నాన్నగారు, అమ్మ ఈ వార్తను జీర్ణించుకోలేకపోయారు. వారిని మాములు స్థితికి తీసుకురావడం, నన్ను నేను సముదాయించుకోవడం కష్టమయ్యింది. అందుకే నా తమ్ముడు రఘుని పంపించి మిగతా కార్యక్రమాలు చూడమన్నాను. రఘు చిన్నవాడు కాబట్టి, మా బాబాయ్ తలకొరివి పెట్టారు. తలకొరివి పెట్టిన వ్యక్తి ఎవరో తెలీక, ఎవరితోనో చివరి కార్యక్రమాలు చేయించారని సోషల్ మీడియాలో వార్తలు రాసారు. ఇది చాలా బాధనిపించింది. టివిల్లో భరత్ గురించి వార్తలు ప్రసారం అవుతుంటే కూడా చూడలేదు. ఎందుకంటే డ్యామేజ్ అయిన మా తమ్ముడి ముఖాన్ని నేనుగానీ, నా తల్లిదండ్రులుగానీ చూడాలనుకోలేదు. మా ఊహల్లో భరత్ హ్యాపీగా నిలిచిపోవాలనుకున్నాం. భరత్ తో నా పిల్లలు చాలా క్లోజ్ గా ఉండేవారు. భరత్ చనిపోయాడనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. అమ్మ, నాన్న, పిల్లలను చూసుకుంటూ వారి ద్గగరే ఉండిపోయాను.


నాకు ఆ ఫోబియా ఉంది...
మరో విషయం ఏంటంటే.. నాకు ఒక ఫోబియా ఉంది. చనిపోయిన వారిని చూడటమంటే నాకు చాలా భయం, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోయినా సరే, వారిని చూడటానికి నేను వెళ్లను. ఓ వారం తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లి పలకరించి వస్తాను. నాకు చాలా క్లోజ్ అయిన శ్రీహరి చనిపోతే కూడా అలానే చేసాను. ఈ విషయాలు బయటికి చెప్పుకోలేము. ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకుంటుంటారు.


షూటింగ్ కి అటెండ్ అయ్యాను...
మరుసటి రోజే నేను షూటింగ్ కి అటెండ్ అయ్యానని కూడా వార్తలు రాసారు. నిజమే షూటింగ్ కి వెళ్లాను. ఓ 30మంది ఆర్టిస్ట్ ల కాంబినేషన్ లో సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అంతమంది డేట్స్ సెట్ చేసి, షూటింగ్ చేయడమంటే మామూలు విషయం కాదు. దర్శక, నిర్మాతలు చాలా ఇబ్బందిపడతారు. అది నాకు తెలుసు కాబట్టే, షూటింగ్ కి అటెండ్ అయ్యాను.


ఆ స్థానాన్ని తీసుకున్నాను...
భరత్ మా అమ్మ, నాన్నగారితో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఇప్పుడు తన స్థానాన్ని నేను తీసుకున్నాను. షూటింగ్ అయిపోగానే, ఇంటికి వెళ్లిపోతున్నాను. వీలైనంత వరకూ అమ్మ, నాన్న దగ్గర ఉంటున్నాను. మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. మేమందరం తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది.


కొన్ని ప్రాబ్లమ్స్ భరత్ ని ఇబ్బందిపెట్టాయి...
లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ భరత్ ని ఇబ్బందిపెట్టాయి. దాంతో తను కొన్నింటికి అలవాటుపడ్డాడు. వాటికి దూరంగా ఉండమని చాలాసార్లు చెప్పాను. బేసిక్ గా భరత్ చాలా మంచి వ్యక్తి. ఏం చేస్తాం... ఎవరి జీవితం ఎలా రాసి పెట్టి ఉందో ఎలా చెప్పగలం. ఇలా జరిగిపోయింది'' అంటూ తన ఆవేదన వ్యక్తపరిచారు రవితేజ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !