'అర్జున్ రెడ్డి' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశం వస్తే... ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరోయిన్ నో చెప్పదు. కానీ లావణ్యత్రిపాఠి నో చెప్పడం, ఆమె స్థానంలో వేరే హీరోయిన్ ని తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం లావణ్యను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ పారితోషికం విషయంలో జరిగిన చర్చ వల్ల లావణ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించిందని సమాచారమ్. దాంతోఆమె స్థానంలో కన్నడ బ్యూటీ రష్మక మండన్నాని తీసుకోవడం జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. అలా విజయ్ తో రొమాన్స్ చేసే అవకాశం లావణ్య చేజారింది.