మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ కోసం రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెలాఖరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకాబోతుందని సమాచారమ్. ఈ సినిమాలో భారీ తారాగణం నటించబోతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార... ఇలా ఫుల్ బిజీగా ఉండే నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ నేపధ్యంలో 'సైరా' సినిమా కోసం డేట్స్ కేటాయించడానికి కొంత సమయం పడుతోందట. దాంతో కొన్ని మార్పులు తప్పడంలేదని తెలుస్తోంది.
ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ప్రముఖ కెమెరామ్యాన్ రవివర్మని తీసుకున్నారు. అయితే 'సైరా' రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వడానికి ఇంకా పట్టేటట్టు ఉండటంతో రవివర్మన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని వినికిడి. ముందు కమిట్ అయిన కమిట్ మెంట్స్ వల్ల రవివర్మన్ 'సైరా' కోసం డేట్స్ కేటాయించలేకపోతున్నాడట. దాంతో అతని స్థానంలో కెమెరామ్యాన్ రత్నవేల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. చిరు 'ఖైదీ నెం. 150' వ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన రత్నవేల్ ప్రస్తుతం రాంచరణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'రంగస్థలం' చిత్రానికి కెమెరా అందిస్తున్నాడు. అతడినే 'సైరా' కోసం ఫిక్స్ చేసారట. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇదే కనుక నిజమైతే రత్నవేల్ కి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు.