అక్కినేని హీరో అఖిల్ రెండో సినిమా 'హలో' ని డిసెంబర్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నవిషయం తెలిసిందే. ఎలాంటి పోటీ లేకుండా ఈ సినిమా విడుదలవుతుందనుకున్నారు. అయితే అల్లు శిరీష్ 'ఒక్క క్షణం' చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో అఖిల్, అల్లు శిరీష్ బాక్సాఫీస్ వార్ తప్పదని అందరూ భావించారు. కానీ తాజా వార్తల ప్రకారం ఈ కుర్ర హీరోలు పోటీపడటంలేదని తెలుస్తోంది.
అల్లు శిరీష్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఒక్క క్షణం' చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తాజా వార్తల ప్రకారం డిసెంబన్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. 22, 23 వరుసగా సినిమాలు విడుదల చేస్తే, ఇద్దరూ హీరోలు నష్టపోతారని భావించే రిలీజ్ డేట్స్ విషయంలో పెద్దలు చర్చించుకుని ఈ విధంగా డిసైడ్ అయ్యారని ఫిల్మ్ నగర్ టాక్. సో... అల్లు శిరీష్, అఖిల్ పోటీ పడబోవడంలేదని ఫిక్స్ అయిపోవచ్చు.