View

అజ్ఞాతవాసి ప్రివ్య్వూ.. కొత్త రికార్డులను టార్గెట్ చేసారు!

Tuesday,January09th,2018, 02:00 PM

'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కావడంతో మెగాభిమానులు ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కువ థియేటర్స్ లో రేపు (10.1.2018) విడుదలవుతున్న ఈ సినిమాకి భారీ వసూళ్లు దక్కేలా చేయడానికి తమవంతు కృషి చేస్తున్నారు మెగాభిమానులు.


బాహుబలి, ఖైదీ నెం.150
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2,700 థియేటర్స్ లో విడుదలవుతోంది. ఫస్ట్ డే ఈ సినిమా 40కోట్ల షేర్ ని రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఫస్ట్ డే 37కోట్ల షేర్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం. 150' రికార్డ్ బద్ధలవుతుంది. 'బాహుబలి' రికార్డులు సైతం కొన్ని ఏరియాల్లో బద్ధలవ్వడం ఖాయమని అంటున్నారు.


ఎ.పి, తెలంగాణా ప్రభుత్వాలు
రెగ్యులర్ షోలు తో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాత్రి 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ జనవరి 10 నుంచి 17 వరకూ 'అజ్ఞాతవాసి' స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భారీ వసూళ్లు రాబట్టడానికి ఈ వారం రోజులు చాలు అనేది పవన్ ఫ్యాన్స్ లెక్క. ఇక తెలంగాణా గవర్నమెంట్ జనవరి 10 నుంచి 17 వరకూ 5 షోలు స్ర్కీనింగ్ కి పర్మిషన్ ఇచ్చింది. దాంతో తెలంగాణాలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ఓవర్ సీస్ లో ఈ సినిమా 526 థియేటర్స్ లో స్ర్కీనింగ్ కానుంది. ఈ రోజు జరగబోయే ప్రీమియర్ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.


వారసుడి కథ
వారసుడి కథతో తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండో తల్లిగా నటించింది ఖుష్భూ. తండ్రి పైన పడిన మచ్చని చెరిపేసి, వారసుడిగా తనని తాను నిరూపించుకునే హీరో కథ అని సమాచారమ్. రావు రమేష్ కూతురిగా కీర్తి సురేష్ నటించగా, పవన్ కళ్యాణ్ పి.ఎ గా అనుఇమ్మాన్యువేల్ నటించింది. మెయిన్ విలన్ గా ఆది పినిశెట్టి చాలా కీలక పాత్ర చేసాడు. బొమన్ ఇరాని, మురళి శర్మ, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు చేసారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. కామెడీ కూడా ఉంటుందట. ఇద్దరు హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా అదిరిపోతుందట. 'కొలవెరి' బోయ్ అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మరో హైలైట్.

సో... 'అజ్ఞాతవాసి' తో మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఖాయం. మరి కొన్ని గంటల్లో థియేటర్స్ కి వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలకు తెర తీయనుందో వేచి చూద్దాం. వెయిట్ ఫర్ రివ్య్వూ...!

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !