కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భలే మంచి రోజు, శమంతకమణి లాంటి మల్టీస్టారర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. మార్చిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
కాగా తాజా వార్తల ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ మల్టీస్టారర్ లో నటించే అవకాశం దక్కిందని సమాచారమ్. నాని సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోంది. ఫస్ట్ టైమ్ నాని, రకుల్ ఈ సినిమా కోసం జత కట్టబోతున్నారు. మరి ఈ జంట ఎలా ఉంటుందో వేచి చూద్దాం. ఇదిలా ఉంటే...
జెంటిల్ మ్యాన్, భలే భలే మగాడివోయ్, మిడిల్ క్లాస్ అబ్బాయ్ చిత్రాలు వరుస సక్సెస్ సాధించడంతో నాని సక్సెస్ ఫుల్ స్టార్ ట్యాగ్ ని మోస్తున్నాడు. ఈ మల్టీస్టారర్ లో నాని సైక్రియాటిస్ట్ గా నటిస్తున్నాడట. ఈ మల్టీస్టారర్ తో కూడా నాని తన సక్సెస్ పరంపరను కొనసాగించాలని ఆశిద్దాం.