స్టార్ డైరెక్టర్ యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ఆరంభం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇది పక్కన పెడితే...
హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయడం కోసం కొన్ని లఘు చిత్రాలను రూపొందించారు. ఈ లఘు చిత్రాల్లో ఎన్టీఆర్, రాజమౌళి, విజయ్ దేవరకొండ కనిపించి అలరించనున్నారు. వీరితో షూట్ చేసిన లఘు చిత్రాలకు సెన్సార్ కూడా పూర్తయ్యిందట. త్వరలో స్ర్కీనింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. సైబర్ మోసాలు, మార్కెటింగ్ బిజినెస్, పెళ్లి ప్రకటనల పేరుతో జరుగుతున్న మోసాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ లఘు చిత్రాలను తెరకెక్కించిందట పోలీస్ డిపార్ట్ మెంట్. స్టార్ హీరో ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండీ క్యాంపెయిన్ లో పాల్గొనడం వల్ల ప్రచారం బాగా లభిస్తుందని, ప్రజలకు ఈజీగా ఈ లఘు చిత్రాలను చేరువ చెయ్యొచ్చని భావిస్తోందట పోలీస్ డిపార్ట్ మెంట్. సో... ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఎన్టీఆర్, రాజమౌళి, విజయ్ దేవరకొండ తమవంతు కృషి చేసారని చెప్పొచ్చు.