ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భరత్ అనే నేను' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది మహేష్ బాబుకి 25వ చిత్రం. ఏప్రిల్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ ఖరారయ్యిందని తెలుస్తోంది.
'ముకుంద', 'ఒక లైలా కోసం', 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డె 'రంగస్థలం' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా కోసం పూజా హెగ్డెని హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న సాక్ష్యం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సో... టాలీవుడ్ లో పూజా హెగ్డె కెరియర్ మెల్లిగా పుంజుకుంటోందని చెప్పొచ్చు.