మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఇంటిలిజెంట్' చిత్రం ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని పంపిణీ చేసిన పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో తనవంతు బాధ్యతగా వి.వి.వినాయక్ కొంతమేర నష్టాన్ని పూడ్చడానికి రంగంలోకి దిగాడని తెలుస్తోంది.
'ఇంటిలిజెంట్' చిత్రం కోసం 9.5కోట్లు పారితోషికం తీసుకున్నాడట వి.వి.వినాయక్. కాగా 'ఇంటిలిజెంట్' ఫ్లాప్ అయిన నేపధ్యంలో తన పారితోషికం నుంచి 5కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చేస్తున్నాడట. దీనివల్ల 'ఇంటిలిజెంట్' వల్ల నష్టపోయినవారికి కొంతైనా డబ్బులు తిరిగి ఇచ్చేసి ఆదుకోవడానికి నిర్మాతకు అవకాశముంటుందని భావిస్తున్నాడట వినాయక్. అందుకే నిర్మాత సి.కళ్యాణ్ కి 5కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నాడని సమాచారమ్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వినాయక్ కి ఇది ఫస్ట్ టైమ్ కాదు. అఖిల్ అక్కినేని తొలి సినిమా 'అఖిల్' కి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని పంపిణీ చేసిన పంపిణీదారులు కూడా నష్టాలను చవిచూసారు. అప్పుడు కూడా వినాయక్ తను తీసుకున్న పారితోషికంలోంచి కొంత తిరిగి ఇచ్చేసాడనే వార్తలు ఉన్నాయి. సో... తను దర్శకత్వం వహించిన సినిమా ఫ్లాప్ అయితే.. వినాయక్ తన బాధ్యతగా కొంతమేర నష్టాన్ని పూడ్చడానికి రంగంలోకి దిగుతున్నాడన్నమాట...!