మెగా పవర్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రంగస్థలం' చిత్రం ఎల్లుండి (మార్చి 30) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ నిమిత్తం 81.70కోట్లు ఈ సినిమాకి దక్కినట్టు తెలుస్తోంది. ఏరియా వారిగా ఈ సినిమా చేసిన బిజినెస్ వివరాలు...
నైజాం - 18 కోట్లు
సీడెడ్ - 12 కోట్ల 10 లక్షలు
నెల్లూరు - 3 కోట్లు
గుంటూరు - 6 కోట్ల 60 లక్షలు
కృష్ణా - 4 కోట్ల 80 లక్షలు
వెస్ట్ గోదావరి - 4 కోట్ల 20 లక్షలు
ఈస్ట్ గోదావరి - 6 కోట్లు
ఉత్తరాంథ్ర - 9 కోట్లు
టోటల్ ఎ.పి తెలంగాణా ఫ్రీ రిలీజ్ బిజినెస్ - 63 కోట్ల 70 లక్షలు
కర్నాటక - 7కోట్ల 60 లక్షలు
రెస్టాఫ్ ఇండియా - 1కోటి 40 లక్షలు
ఓవర్ సీస్ - 9 కోట్లు
వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ - 81 కోట్ల 70 లక్షలు