మాస్ మహారాజా రవితేజతో శ్రీను వైట్ల ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 'అమర్ అక్బర్ ఆంటోని' టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం యు.యస్ లోనే జరగనుంది. స్ర్కిఫ్ట్ వర్క్, లొకేషన్స్ సెర్చ్, ఆర్టిస్ట్ ల ఎంపిక అన్నీ పూర్తయినప్పటికీ ఈ చిత్రం యూనిట్ షూటింగ్ కి వెళ్లలేకపోతోంది. దీనికి ఓ కారణం ఉంది. అదేంటంటే...
చిత్రం యూనిట్ యు.యస్ వెళ్లడానికి వీసాలు కావాలి. ఈ వీసాల ప్రాసెసింగ్ జరుగుతోందట. అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందట. దాంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతోంది కాబట్టి, రవితేజ ఇంకో సినిమాని లైన్లో పెట్టాడని సమాచారమ్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని కూడా మైత్రి మూవీస్ నిర్మించనుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట రవితేజ. ఆల్ రెడీ రవితేజ చేస్తున్న 'నేల టిక్కెట్' షూటింగ్ చివరి దశలో ఉంది. సమ్మక్ కానుకగా థియేటర్స్ కి రానుంది. సో... రవితేజ, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ ఆరంభించడానికి ఇంకా టైమ్ పడుతుందని ఊహించవచ్చు.