యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #NTR28 చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆరంభమైన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఎన్నాళ్లనుంచో ఈ కాంబినేషన్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించి తాజా వార్తలు బయటికి వచ్చాయి.
ఇందులో ఎన్టీఆర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అలరించనున్నాడట. ఇక ఈ సినిమా కోసం భారీ సెట్ ని వేయిస్తున్నాడు త్రివిక్రమ్. అది రాయలసీమ సెట్ అని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకే ఈ సెట్ ని వేయిస్తున్నారట. ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్ లోనే జరగనుందని తెలుస్తోంది. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్నారట. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 28కోట్లు చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుందని ఫిల్మ్ నగర్ టాక్. దీన్నిబట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఊహించవచ్చు.