ప్రిన్స్ మహేష్ బాబుతో కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను' చిత్రం ఈ నెల 20న థియేటర్స్ కి వస్తోంది. ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త హల్ చల్ చేసింది. అయితే ఆ వార్త నిజంకాదని క్లారటీ ఇచ్చాడు కొరటాల శివ.
ఈ సినిమా స్టోరీ 'తకిట తకిట' ఫేం శ్రీహరి నాను ఇచ్చాడని, అందుకుగానూ కొరటాల శివ అతనికి కోటి రూపాయలు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే స్టోరీ లైన్ శ్రీహరి నానుదేకానీ, కోటి రూపాయలు ఇచ్చి కథ తీసుకున్నామన్నది మాత్రం నిజంకాదని కొరటాల తేల్చేసాడు. కొరటాల, శ్రీహరి నాను రూమ్ మేట్స్ అట. ఎప్పుడో 'భరత్ అనే నేను' స్టోరీ లైన్ కొరటాలకు చెప్పాడట. ఆ స్టోరీ లైన్ ని కొరటాల డెవలప్ చేసి మహేష్ బాబుకు చెప్పి ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ పడేలా చేసుకున్నాడు. అందుకుగానూ శ్రీహరి నానుకు 'భరత్ అనే నేను' టైటిల్ కార్డ్స్ లో 'స్పెషల్ మెన్షన్' ఇచ్చి థ్యాంక్స్ కార్డ్ వేసారట. సో... కథ ఇచ్చినందుకుగానూ శ్రీహరి నానుకు కొరటాల కోటి ఇవ్వలేదు... థ్యాంక్స్ చెప్పాడు... అంతే...!