యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు ఉన్నాయి. సునీల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్లు లయ, మీనాలను తల్లి పాత్రల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు ఉన్నాయి. తాజాగా మరో హీరోని ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
హీరోగా సినిమాలు చేస్తున్న నవీన్ చంద్ర ఈ మధ్య నాని హీరోగా తెరకెక్కిన 'నేను లోకల్' సినిమాలో విలన్ గా నటించాడు. ఈ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో నవీన్ చంద్రకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కూడా నవీన్ చంద్రకి చాలా మంచి రోల్ చేసే అవకాశం దొరికిందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ లో నవీన్ చంద్ర పాల్గొంటున్నాడు. ఈ సినిమా తన కెరియర్ కి మంచి మలుపు అవుతుందనే నమ్మకంతో నవీన్ చంద్ర ఉన్నాడు. సో... ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంనేషన్ సినిమా భారీగా, భారీ తారాగణంతో తెరకెక్కుతోందని చెప్పొచ్చు.