తొలిప్రేమ' ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. కె.యస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమాపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి 'తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమకథ' అనే టైటిల్ ని ఖరారు చేసారనే వార్తలు ప్రచారమవుతున్నాయి.
కానీ ఈ టైటిల్ కన్ ఫార్మ్ అవ్వలేదని స్వయంగా సాయిధరమ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నట్టు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాపై మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుసగా ఫ్లాప్స్ చవిచూస్తున్న నేపధ్యంలో ఈ సినిమా తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నాడట. మరి ఈ లవ్ స్టోరీతో సాయిధరమ్ తేజ్ ఆడియన్స్ ని ఫిదా చేస్తాడేమో వేచి చూద్దాం.