మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు రాంచరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సైరా' నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ కూడా పెద్ద బ్రేక్స్ లేకుండా జరుగుతోంది. కాగా ఈ రెండు సినిమాల విడుదలకు సంబంధించి రాంచరణ్ పక్కా ప్లాన్ తో ఉన్నాడట. ఆ వివరాల్లోకి వెళితే...
రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ సినిమా #RC12 ని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే 'సైరా' నరసింహారెడ్డి చిత్రం రిలీజ్ విషయంలో ఓ క్లారటీకి వచ్చిన తర్వాతే #RC12 రిలీజ్ గురించి ప్రకటించాల్సిందిగా నిర్మాత దానయ్య, డైరెక్టర్ బోయపాటిని కోరాడట చరణ్.
వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'సైరా' ని విడుదల చేయడానికి సిద్ధమైతే, అప్పుడు ఈ యేడాది దసరాకి #RC12 విడుదలయ్యేలా చూసుకోవాలనుకుంటున్నాడట. లేకపోతే 'సైరా' ని వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తే, #RC12 ని సంక్రాంతి బరిలో నిలిచేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. సో... ఇటు పండగలను మిస్ అవ్వకుండా, అటు సమ్మర్ ని మిస్ అవ్వకుండా తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా రాంచరణ్ ప్లాన్ చేస్తున్నాడని ఊహించవచ్చు.