ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య డెలివరీ అయ్యిందనే వార్తలు కూడా హల్ చల్ చేసాయి. అయితే ఆ వార్తలు నిజమవ్వలేదు. కానీ ఈ రోజు (14.6.2018) లక్ష్మీప్రణతి పండండి బాబుకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో లక్ష్మీప్రణతి డెలివరీ జరిగిందని తెలుస్తోంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారట.
2014, జూలై 22న ఎన్టీఆర్ కి మొదటి కొడుకు అభయ్ రామ్ పుట్టాడు. ఈ రోజు రెండో బిడ్డకు తండ్రయ్యాడు ఎన్టీఆర్. ఈ వార్త విన్న వెంటనే ఎగ్జయిట్ అయ్యాడట ఎన్టీఆర్. మరి ఇద్దరు పండంటి బాబులకు తండ్రి కదా... సంతోషం తారాస్థాయికి చేరడం కామన్....!