స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు రైటర్ వక్కంతం వంశీ. డైరెక్టర్ గా అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయాడు. దాంతో నెక్ట్స్ సినిమా ఏ హీరోతో చేస్తాడు... డైరెక్టర్ గా ముందుకెళతాడా లేక రైటర్ గానే సినిమాలు చేసుకుంటాడా అని ఆసక్తి అందరిలో ఉంది. కాగా తాజా వార్తల ప్రకారం వక్కంతం వంశీ రెండో సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయడానికి వక్కంతం వంశీ సిద్ధమవుతున్నాడట. మంచి కథతో వస్తే, సినిమా చేద్దామని వంశీకి మాటిచ్చాడట రవితేజ. ఈ నేపధ్యంలో రవితేజ కోసం స్ర్కిఫ్ట్ రెడీ చేస్తున్నాడట. స్ర్కిఫ్ట్ రెడీ అయిన వెంటనే రవితేజకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ పడేలా చేసుకోవాలనుకుంటున్నాడట. రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ఈ ప్రాజెక్ట్ ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. సో... వక్కంతం వంశీ రెండో ప్రాజెక్ట్ ప్రకటన త్వరలోనే వస్తుందని ఊహించవచ్చు.