ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్టీఆర్' తో బిజీగా ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేసారు. దాంతో ఈ సినిమా వర్క్ చాలా టైట్ గా సాగనుంది. పెద్ద బ్రేక్ తీసుకోకుండానే ఈ సినిమా షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఈ చిత్రం యూనిట్ కృషి చేస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమా తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలయ్య ఆసక్తి కనబరుస్తారా లేక బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే ఫిల్మ్ నగర్ వార్తల మేరకు బోయపాటి శ్రీను దర్శకత్వంలోని సినిమాతోనే బాలయ్య ముందుకు సాగనున్నారని సమాచారమ్. వి.వి.వినాయక్ ఇప్పటివరకూ బాలయ్యను ఇంప్రెస్ చేసే విధంగా స్ర్కిఫ్ట్ ని ఇవ్వలేదట. దాంతో వినాయక్ సినిమాని పక్కన పెట్టి, బోయపాటి సినిమాతో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే నందమూరి అభిమానుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. ట్రేడ్ వర్గాల్లో కూడా ఫుల్ క్రేజీ్ ఉంది. ఈ నేపధ్యంలో బోయపాటి సినిమాని ముందు చేయాలని డిసైడ్ అయిన బాలయ్య నిర్ణయం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారని సమాచారమ్.